Minister KTR: పంప్ హౌస్ వల్ల నిర్మల్ వాసుల కల సాకారమైంది, మంత్రి కేటీఆర్
నిర్మల్ జిల్లాలో మంత్రి కేటిఆర్ పర్యటించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
15 సంవత్సరాల నిర్మల్‌వాసుల కల సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో సాకారమైందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. దిలావర్‌పూర్ మండలంలోని గుండంపెల్లి వద్ద నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ నంబర్ -27 ( శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఎత్తిపోతల పథకం)ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. స్థానిక మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ఎత్తిపోతల పథకానికి స్విచ్ ఆన్ చేసి కాలువలకు నీటిని విడుదల చేసి రైతులకు అంకితం ఇచ్చారు. తర్వాత దిలావర్పూర్ శివారులోని డెలివరీ సిస్టర్ ను పరిశీలించి పూజలు చేశారు. అనంతరం సోన్ మండలం మాదాపూర్ వద్ద రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.
శ్రీ లక్ష్మీ నర్సింహాస్వామి ఎత్తిపోతల పథకాన్ని రూ.714 కోట్లతో నిర్మించారు. ఈ పథకం ద్వారా నిర్మల్ నియోజకవర్గంలోని దిలావర్‌పూర్, నర్సాపూర్ (జి), కుంటాల, సారంగాపూర్, నిర్మల్, లక్ష్మణచాంద, మామడ, సోన్ మండలాల్లోని 99 గ్రామాల పరిధిలో గల చెరువులు, కుంటలకు నీరందించే అవకాశం కలిగింది. 20 ఏండ్లుగా ఒకే పంటకు పరిమితమైన భూముల్లో ఇక మూడు పంటలు రానుండగా, అన్నదాతల సంతోషానికి అవధుల్లేకుండా పోతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేసి, నిర్మల్ నియోజకవర్గ రైతులకు సాగు నీరందేలా చేసిన సీఎం కేసీఆర్‌కు రైతన్నలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ప్యాకేజీ 27 పనులను మూడు యూనిట్లుగా విభజించి పనులను పూర్తి చేశారు. మొదటి యూనిట్ కింద 32 వేల ఆయకట్టును నిర్ధేశించారు. ఇందులో భాగంగా దిలావర్‌పూర్ గ్రామ శివారులో సిస్టర్న్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. దీని ద్వారా లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్‌లోకి సాగు నీటిని ఎత్తి పోయనున్నారు. యూనిట్-1 కింద ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్‌లో గుండంపెల్లి వద్ద ఇప్పటికే పంప్‌హౌస్ నిర్మాణం పూర్తయింది.
ఇక్కడ 6.70 కిలోమీటర్ల పొడువుతో అప్రోచ్ చానల్‌ను నిర్మించారు. లెఫ్ట్ మెయిన్ కెనాల్ పొడువు 29.50 కిలో మీటర్లు కాగా, ఈ కాలువ ద్వారా నీటి సరఫరా సామర్థ్యం 140 క్యూసెక్కులు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అలాగే రైట్ మెయిన్ కెనాల్ పొడువు 13.50 కిలోమీటర్లు కాగా, నీటి సరఫరా సామర్థ్యం 100 క్యూసెక్కులుగా ఉంది.
ఆశా కార్యకర్తల ఆందోళన
గుండంపల్లి లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ ప్రారంభంకి వచ్చిన మంత్రి కేటీఆర్ ను ఆశా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో ఆశా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆశా వర్కర్లు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఆశా కార్యకర్త సొమ్మసిల్లి పడిపోవడంతో పోలీసుల తీరిపై ఆశా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం దారుణమని వెల్లడించారు. చివరికి ప్యాకేజీ 27 కాళేశ్వరం పనులు ప్రారంభించిన తర్వాత మంత్రి కేటీఆర్ కు ఆశా కార్యకర్తలు వినిత పత్రం అందజేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఈ సంధర్భంగా మంతి కేటిఆర్ మాట్లాడుతూ.... కాంగ్రెస్ వాళ్ళకీ ఒక్కసారి కాదు 11 సార్లు 55 ఎoడ్లు ఛాన్స్ ఇచ్చినా ఎం చేశారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాం లో త్రాగు సాగు నీరు సరిగా అందలేదని వెల్లడించారు. కేసీఅర్ పాలనలో ఒక్క సంవత్సరం కూడా కరువు కాటకాలు లేవన్నా. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉందని చెప్పారు. దేశం లో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో 17 ప్రాజెక్టులు నిర్మించామని చెప్పారు. నిర్మల్ జిల్లాలో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజీ 27 ప్రారంభించాడం సంతోషకారం అన్నారు. త్వరలోనే చనాఖ కొరాట, సదర్మాట్ పనులు పూర్తి అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృధ్ది అంటే తెలంగాణ రాష్ట్రాన్ని చూసీ నేర్చుకోవాలని ప్రతిపక్షలను విమర్శించారు.
పాక్ పట్లలో రూ. 300 కోట్లతో నిర్మించనున్న ఆయిల్ ఫామ్ ప్యాకర్టీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటిఆర్ మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో పంటలకు నీళ్ళ కోసం రైతులు తన్నుకునే వారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఎకరాకు నీరు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ దే అని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ పంటలు కొనుగోలు చేసినా, చేయకపోయినా బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కచ్చితంగా పంటలను కొనుగోలు చేస్తుందని వెల్లడించారు.
ఆయిల్ ఫామ్ పరిశ్రమతో ప్రతి ఒక్కరికి మంచి నూనె అందే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గమైన సిరిసిల్ల రైతులకు ఏదైనా అన్యాయం జరిగితే తనదే బాధ్యత అని చెప్పారు. నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, సిరిసిల్ల జిల్లాలో పండించే ఆయిల్ ఫామ్ పంటను ఇక్కడే కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి రైతు సంవత్సరానికి పంట ఆయిల్ ఫామ్ సాగు ద్వారా రెండు లక్షల వరకు ఆదాయం వస్తుందని చెప్పారు. కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీ ప్రాజెక్టు నిండుకుండలా మారిందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రతి ఒక్కరు అండగా నిలవాలి మంత్రి కేటీఆర్ కోరారు.