By: ABP Desam | Updated at : 08 Jan 2023 07:00 AM (IST)
సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక అసెంబ్లీ పెట్టే అవసరం లేనట్లేనా ?
BRS Vs BJP : తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. ఆ విషయంలో ఎవరికీ డౌట్ లేదు. అప్పులు దొరకకపోవడం వల్లనే... కేంద్రం ఇవ్వాల్సినవి ఇవ్వకపోవడం... కనీసం అప్పులు తీసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడం వల్లనే జీతాలు కూడా సక్రమంగా చెల్లించలేకపోతున్నామని ఆర్థిక మంత్రి హరీష్ రావు తరచూ చెబుతూంటారు. కేంద్రం తీరుపై తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంపై తీవ్ర అగరహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ప్రత్యేక అసెంబ్లీ పెట్టి చర్చించాలనుకున్నారు. డిసెంబర్‌లో వారం రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనుకున్నా ఆగిపోయారు. కానీ ఇప్పుడు పెట్టాల్సిన అవసరం లేకుండా పోయిందనుకోవచ్చు. ఎందుకంటే.. తెలంగాణ అడిగిన దాని కన్నా ఎక్కువరుణాలకు అనుమతిలభించింది
అడిగినదాని కన్నా రూ. మూడు వేల కోట్ల ఎక్కువ రుణానికి చాన్స్
తెలంగాణ ప్రభుత్వానికి చివరి మూడు నెలల్లో కేంద్రం అడిగిన దాని కన్నా ఎక్కువగానే రుణ పరిమితి మంజూరు చేసింది. ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ ఖాతాలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో రూ. 6,572 కోట్లు కావాలని కేంద్రానికి తెలంగాణ సర్కార్ ప్రతిపాదన పెట్టింది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం రూ. 9,572 కోట్లకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఓ రకంగా ఆర్థిక సమస్యల్లో ఉన్న తెలంగాణ సర్కార్ కు ఈ అప్పు ఊరట కలిగిస్తుది. అయితే ఇంత కాలం అడిగిన దాన్ని కూడా ఇవ్వని కేంద్రం... ఇప్పుడు అడగకుండానే దాదాపుగా మూడు వేల కోట్ల అప్పు ఎందుకిచ్చింది ? తెలంగాణ సర్కార్ చేస్తున్న ఆరోపణలతో వెనక్కి తగ్గిందా ?
బడ్జెట్‌లో అప్పు ప్రతిపాదనలకు.. కేంద్రం అనుమతికి పొంతన లేని లెక్కలు
2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.53,970 కోట్ల రుణాలు తీసుకోవాలని లక్ష్యంగా బడ్జెట్ ప్రతిపాదనల్లో పెట్టుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం మొదటి నుంచి తెలంగాణ అప్పులపై ఆంక్షలు విధించింది. గతంలో కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాలను కూడా కలపడంతో చివరికి అప్పుల పరిమితి తగ్గిపోయింది. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం రాష్ట్రానికి రూ.39,450 కోట్ల అప్పులు చేసుకునే అవకాశం ఉందని గతంలో కేంద్రం నుంచి సమాచారం వచ్చింది. ఇప్పటివరకు రూ.28,424.88 కోట్ల అప్పులు తీసుకున్నారు. కేంద్రం పెట్టిన పరిమితి మేరకు ఇంకా కేవలం రూ.6,572 కోట్ల అప్పు తీసుకునేందుకు చాన్స్ ఉంది. దీన్నే తెలంగాణ సర్కార్ ఇండెంట్ పెట్టింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా మరో మూడు వేల కోట్ల వరకూ ఎక్కువ అప్పు తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది.
అప్పులు చేసి ఆస్తులను భారీగా పెంచుతున్నామన్న తెలంగాణ సర్కార్
తాము అప్పులు చేస్తోంది ఉచిత పథకాలకు పంచడానికి కాదని.. సంపద పెంచడానికేనని కతెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఆ ప్రకారం మూలధన వ్యయం లెక్కలను కూడా చూపిస్తోంది. రాష్ట్ర సంపదను పెంచి తెలంగాణను బలమైన ఆర్థిక శక్తిగా తెలంగాణను నిలుపుతున్నామని చెబుతున్నారు. ఫలితంగా 2014-15వ ఆర్థిక సంవత్సరంలో రూ.11,583 కోట్లుగా ఉన్న రాష్ట్ర మూలధన వ్యయం 2021-22లో రూ.61,343 కోట్లకు చేరింది. అంటే, గత ఎనిమిదేళ్లలో తెలంగాణ మూలధన వ్యయం ఐదున్నర రెట్లు పెరిగిందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. అయితే కేంద్రం చెప్పిన అనేక సంస్కరణలను తెలంగాణ ఆమోదించలేదు. కరెంట్ మీటర్లు పెట్టడం.. మున్సిపాలిటీల్లో ఆస్తిపన్నును ప్రతీ ఏడాది పెంచడం వంటి సంస్కరణలు అమలు చేయకపోవడం వల్ల అప్పుల పరిమితిని తగ్గుతూ వస్తోంది.
కారణం ఏదైనా అనేక ఆర్థిక సమస్యల్లో ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి ... కేంద్రం కొత్తగా ఇచ్చిన అనుమతి... మాత్రం ఊరట నిచ్చేదే. ఇది రాజకీయ పరిమామాలతో జరిగిందా లేదా అన్నది మాత్రం క్లారిటీ లేదు. కానీ ఇంత కాలం ఆపడం వల్ల తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పడింది.
Telangana Budget 2023: రాష్ట్రంలో 52 శాతానికి పైగా ఉన్న బీసీలకు 2 శాతం నిధులేనా?: బడ్జెట్ పై బండి సంజయ్
MLC Kavitha: రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి, అదానీ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలి?: ఎమ్మెల్సీ కవిత
YSRCP Politics: ఆ ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేతలే విలన్లుగా మారారా, అధిష్టానం ఎలా స్పందిస్తుందో !
Pinnelli on Kotamreddy: కార్పొరేటర్ స్థాయి కూడా లేని కోటంరెడ్డిని జగన్ 2 సార్లు గెలిపించారు: పిన్నెల్లి ఘాటు వ్యాఖ్యలు
Bandi Sanjay: నాందేడ్ లో బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్, రూ.500 ఇచ్చి జనాన్ని పట్టుకొచ్చి డ్రామాలు: బండి సంజయ్
Majilis Congress : మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?
Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
Adani Group : అదానీకి మరో షాక్, రూ.5400 కోట్ల బిడ్ రద్దు చేసిన యూపీ డిస్కమ్
Turkey Earthquake : అల్లకల్లోలమైన టర్కీ, సిరియా- ప్రకృతి కోపానికి 2300 మంది మృతి!