News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

JC Prabhakar: తాడిపత్రిలో ఉద్రిక్తం-జేసీ ప్రభాకర్‌రెడ్డి గృహనిర్బంధం

తాడ్రిపత్రిలో మరోసారి రాజకీయం వేడెక్కింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి దగ్గర పోలీసులు మోహరించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డిని హౌస్‌అరెస్ట్‌ చేశారు. ఏ క్షణంలో జరుగుతుందో అన్న టెన్షన్‌ అక్కడ కనిపిస్తోంది.

FOLLOW US: 
Share:

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. జేపీ ప్రభాకర్‌రెడ్డిని గృహనిర్బంధం చేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రభాకర్‌రెడ్డి ఇంటి దగ్గరకు రాకుండా.. బారికేడ్లు ఏర్పాటు చేశారు. వచ్చిన వారిని వచ్చినట్టు వెనక్కి పంపేస్తున్నారు.

పెద్దపప్పూరు మండలం తిమ్మంచెరువులో వజ్రగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం దగ్గర కల్యాణ మండపానికి భూమి పూజ చేసేందుకు సిద్ధమయ్యారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. అందుకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఆలయ కమిటీ సిబ్బందితో పాటు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి దగ్గర భారీగా మోహరించారు. తనను హౌస్‌అరెస్ట్‌ చేయడంతో పోలీసుల తీరుపై జేసీ ప్రభాకర్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఎండోమెంట్ పరిధిలోకి రాదంటూ హైకోర్టు ఇటీవలే తీర్పు ఇచ్చింది. దేవాలయం పరిధిలో అభివృద్ధి పనులు చేసుకోవచ్చంటూ  ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో పలు అభివృద్ధి పనులకు జేసీ ప్రభాకర్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. అయితే పోలీసులు మాత్రం అందుకు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. జేసీ ఇంటి దగ్గర పోలీసులు పెద్దసంఖ్యలో మోహరిచడంతో... ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్‌ నెలకొంది. టీడీపీ కార్యకర్తలు గుమికూడకుండా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. 

Published at : 25 Sep 2023 12:03 PM (IST) Tags: JC Prabhakar Reddy ananthapuram TDP Leader house arrest Andra Pradesh Tadripatri Police deployed Tension in Tadripatri

ఇవి కూడా చూడండి

YSRCP Politics: ఇప్పుడు 11 నియోజకవర్గాలకు ఇన్ ఛార్జీలు! భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చు: బొత్స, సజ్జల క్లారిటీ

YSRCP Politics: ఇప్పుడు 11 నియోజకవర్గాలకు ఇన్ ఛార్జీలు! భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చు: బొత్స, సజ్జల క్లారిటీ

Vasantha Krishna Prasad: మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ రాజీనామా! అసలు విషయం చెప్పిన వైసీపీ నేత

Vasantha Krishna Prasad: మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ రాజీనామా! అసలు విషయం చెప్పిన వైసీపీ నేత

Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే ఏప్రిల్‌లోనే అవకాశం !

Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే  ఏప్రిల్‌లోనే అవకాశం !

Gas Cylinder Guarantee : రూ. 500కే గ్యాస్ సిలిండర్ - అప్పుడే క్యూ కడుతున్న మహిళలు

Gas Cylinder Guarantee :   రూ. 500కే గ్యాస్ సిలిండర్ -  అప్పుడే క్యూ కడుతున్న మహిళలు

YSRCP Gajuwaka : వైసీపీకి గాజువాక ఇంచార్జ్ గుడ్ బై - వెంటనే గుడివాడ అమర్నాథ్‌కు బాధ్యతలు !

YSRCP Gajuwaka :  వైసీపీకి  గాజువాక ఇంచార్జ్ గుడ్ బై - వెంటనే గుడివాడ అమర్నాథ్‌కు బాధ్యతలు !

టాప్ స్టోరీస్

Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!

Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!

YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పు

YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పు

AP News: సొంత సామాజిక వర్గం జగన్ కి ఎందుకు దూరమవుతోంది?

AP News: సొంత సామాజిక వర్గం జగన్ కి ఎందుకు దూరమవుతోంది?

Uttam Kumar Reddy to visit Medigadda: మేడిగడ్డ సందర్శించాలని మంత్రి ఉత్తమ్ నిర్ణయం, వెంట వాళ్లు ఉండాలని అధికారులకు ఆదేశాలు

Uttam Kumar Reddy to visit Medigadda: మేడిగడ్డ సందర్శించాలని మంత్రి ఉత్తమ్ నిర్ణయం, వెంట వాళ్లు ఉండాలని అధికారులకు ఆదేశాలు