అన్వేషించండి

Ippasara Anirudh Reddy: ఇప్పసారా రాజకీయం - అనిరుధ్ రెడ్డి హెల్తీ ప్రచారం వెనుక అసలు వ్యూహమేంటి?

Anirudh Reddy: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇప్పసారా అంశం ఒక హాట్ టాపిక్. అనిరుధ్ రెడ్డి ఈ అంశాన్ని భుజానికెత్తుకోవడం, దీనిపై అసెంబ్లీలో చర్చ జరగడం వెనుక ప్లాన్ ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Anirudh Reddy Ippasara Promotion:తెలంగాణలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేస్తున్న  ఇప్పసారా  ప్రచారం ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. సాధారణంగా మద్యం నియంత్రణపై మాట్లాడాల్సిన పాలకపక్ష ఎమ్మెల్యే, ఏకంగా సారాను ప్రోత్సహించాలని, దానికోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.  దీనికి మద్దతుగా సుమారు 52 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంతకాలను సేకరించి చాలా మద్దతు ఉందని  నిరూపించే ప్రయత్నం చేస్తూంటే..  ఇది కేవలం ఒక్క ఎమ్మెల్యే వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కాదని, దీని వెనుక ప్రభుత్వ పెద్దల మద్దతు ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి.

 ఆరోగ్య ప్రదాయిని.. కోట్లలో ఆదాయం 

అనిరుధ్ రెడ్డి తన వాదనను చాలా తెలివిగా వినిపిస్తున్నారు. విదేశీ విస్కీలు, బ్రాందీలు తాగి జనం 60 ఏళ్లకే చనిపోతున్నారని, అదే ఇప్పసారా తాగితే  100 ఏళ్లు  బతుకుతారని ఆయన పేర్కొంటున్నారు. దీన్ని  తెలంగాణ టెకిలా గా అభివర్ణిస్తూ, గిరిజనుల ఆర్థికాభివృద్ధికి ఇది దోహదపడుతుందని, ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం తెచ్చిపెడుతుందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాల్లో హీరోలు తాగితే లేని తప్పు, తాను ప్రజల మేలు కోసం మాట్లాడితే తప్పా అని ఆయన ప్రశ్నిస్తున్నారు.

 బీజేపీ సెటైర్లు - ఇందిరమ్మ పేరు వద్దంటూ చలోక్తులు 

అసెంబ్లీలో ఈ చర్చ జరుగుతున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వేసిన సెటైర్లు నవ్వులు పూయించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పథకానికి ఇందిరమ్మ పేరు పెడుతోందని, రేపు పొద్దున్న ఈ సారా బ్రాండ్‌కు కూడా ఆ పేరు పెట్టి గౌరవనీయ నేతను అవమానించవద్దని ఆయన ఎద్దేవా చేశారు. దీనిపై సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం కూడా చోటుచేసుకుంది. ప్రభుత్వ ఇప్పసారాని తీసుకొచ్చే ఉద్దేశంలో ఉందని ఇలాంటి అనుమానాల్ని బలపరుస్తున్నాయి. 

ఇప్పసారాను ఎప్పుడు.. ఎందుకు నిషేధించారు?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సారా అనేది ఒక పెను శాపంగా మారింది. 1990వ దశకంలో గ్రామీణ ప్రాంతాల్లో సారా వల్ల కుటుంబాలు చితికిపోయాయి. మహిళల పోరాటాల ఫలితంగా  1993లో ఎన్.టి. రామారావు ప్రభుత్వం  సారాను పూర్తిగా నిషేధించింది.  సారా తయారీలో నాణ్యత లేకపోవడం, మిథనాల్ వంటి ప్రమాదకర రసాయనాలు కలపడం వల్ల కల్తీ సారా మరణాలు సంభవించేవి. పేద కుటుంబాల్లో సంపాదన అంతా సారాకే ఖర్చవ్వడం వల్ల సామాజిక సమస్యలు తలెత్తాయి. అప్పటి నుండి ప్రభుత్వాలు మద్యం అమ్మకాలను తమ నియంత్రణలోకి తీసుకున్నాయి.

 ప్రభుత్వ  ప్రయోగాత్మక  వ్యూహం? 

రాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా, కొత్త ఆదాయ వనరుల కోసం ప్రభుత్వం అనిరుధ్ రెడ్డితో ఈ  బెలూన్ టెస్ట్  చేయిస్తుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రజల నుంచి వ్యతిరేకత రాకపోతే, దీన్ని ఒక  హెల్త్ డ్రింక్, ఆర్గానిక్ లిక్కర్' పేరుతో మార్కెట్లోకి తెచ్చే అవకాశం ఉంది. ఒకవేళ విమర్శలు వస్తే, అది ఎమ్మెల్యే వ్యక్తిగత అభిప్రాయమని సర్దిచెప్పే వెసులుబాటు కూడా ప్రభుత్వానికి ఉంటుంది. ఏది ఏమైనా, నిషేధిత సారాకు వైద్యం రంగు పూసి తిరిగి తీసుకురావాలన్న ప్రయత్నం మాత్రం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. 

టాప్ హెడ్ లైన్స్

Telangana Graduate MLC Elections: తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?
తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
AP Employee Unions: ఏపీ ఉద్యోగ సంఘాల సంచలన నిర్ణయం - పీఆర్‌సీ, ఐఆర్‌ కోసం పోరాటం.. కూటమి ప్రభుత్వానికి సవాలు!
ఏపీ ఉద్యోగ సంఘాల సంచలన నిర్ణయం - పీఆర్‌సీ, ఐఆర్‌ కోసం పోరాటం.. కూటమి ప్రభుత్వానికి సవాలు!
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget