అన్వేషించండి

Anirudh Reddy: సినిమాలో పవన్ గుడుంబా తాగితే తప్పు లేదు ..నేను సారా అంటే తప్పు వచ్చిందా - కాంగ్రెస్ ఎమ్మెల్యే వింత వాదన

ippasara: ఇప్పసారా వాదనకు సినిమా సీన్లను సమర్థనగా వాడుకుంటున్నారు అనిరుథ్ రెడ్డి. సినిమాలో పవన్ గుడుంబా తాగితే తప్పులేదా అని ప్రశ్నిస్తున్నారు.

ippasara Anirudh Reddy :  పవన్ కళ్యాణ్  ఖుషీ సినిమాలో గుడుంబా తాగితే తప్పులేదు కానీ, తాను సారా అంటే తప్పెలా అవుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుథ్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.  సినిమా వాళ్లు గ్లాసు పట్టుకుంటే హీరోలని, రాజకీయనాయకులు పట్టుకుంటే జీరోలని అనడంపై ఆయన మండిపడ్డారు. ఇటీవల ఆయన ఇప్పసారాను ప్రమోట్ చేస్తున్నారు. దానిపై నిషేధం ఉండటంతో దాన్ని తొలగించాలని ఉద్యమం చేస్తున్నారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పపువ్వు సాగు, దాని ద్వారా గిరిజనుల ఆర్థికాభివృద్ధిపై అనే పేరుతో ఇప్పసారాను మళ్లీ తీసుకు రావాలని ప్రయత్నిస్తున్నారు.   అనిరుధ్ రెడ్డి చేపట్టిన ఉద్యమం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రవ్యాప్తంగా అటవీశాఖ ఆధ్వర్యంలో సుమారు 10 లక్షల ఇప్పపువ్వు చెట్లు నాటాలని డిమాండ్ చేస్తూ ఆయన ఒక వినూత్న సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ప్రతిపాదనకు శాసనసభ్యుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని ఆయన చెబుతున్నారు.                   

ఇప్పటికే ఈ ఉద్యమానికి మద్దతుగా దాదాపు  52 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంతకాలు చేసినట్లు అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం ఖాళీగా ఉన్న అటవీ భూముల్లో ఇప్ప చెట్లను పెంచడం ద్వారా అటు పర్యావరణాన్ని కాపాడటంతో పాటు, ఇటు గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు శాశ్వత ఉపాధి కల్పించవచ్చని ఆయన బలంగా వినిపిస్తున్నారు. సభలోనూ, వెలుపల కూడా ఈ అంశంపై ఆయన తన వాదనను గట్టిగా వినిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.           

ఇప్పపువ్వు విశిష్టతను, దాని ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అనిరుధ్ రెడ్డి సినిమా సీన్లను వాడుకుంటున్నారు. ఖుషీ సినిమాలో పవన్ కల్యాణ్ ఓ సీన్ లో గుడుంబా తాగుతారు. దాన్ని చూపిస్తూ.. రాజకీయ నేతలు ఇప్పసారా అంటే ట్రోల్ చేస్తారా..మరి హీరోలు ఎందుకలా చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.  ఇప్పసారా అనేది కేవలం మద్యం మాత్రమే కాదని, అది గిరిజన సంస్కృతిలో ఒక భాగమని, ఎన్నో ఔషధ గుణాలు కలిగిన పానీయమని పేర్కొన్నారు.      

అడవుల్లో ఇప్ప పువ్వు సేకరణను క్రమబద్ధీకరించి, దానికి చట్టబద్ధత కల్పిస్తే ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు గిరిజనుల జీవితాల్లో వెలుగులు నిండుతాయని అనిరుధ్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, మెజారిటీ ప్రజాప్రతినిధుల మద్దతు కూడగట్టడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ సంతకాల సేకరణ కార్యక్రమం పూర్తయిన తర్వాత దీనిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. అయితే సినిమా సీన్లన్నీ పూర్తిగా కల్పితం. నిజం కాదు. అయినా నిజంగానే పవన్ గుడుంబా తాగినట్లుగా చెప్పి.. ఇప్పసారా వాదనను సమర్థించుకోవడం మాత్రం రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది.  

టాప్ హెడ్ లైన్స్

Ashada Bonalu: పాతబస్తీలో అంబరాన్నంటిన బోనాల జాతర.. లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
పాతబస్తీలో అంబరాన్నంటిన బోనాల జాతర.. లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Hyderabad Bonalu Traffic Diversions: బోనాల పండుగ.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపులు- ఈ రూట్లలో వెళ్తే జాగ్రత్త
బోనాల పండుగ.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపులు- ఈ రూట్లలో వెళ్తే జాగ్రత్త

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Embed widget