అన్వేషించండి

Telangana Congress Nominated Posts: అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా పోస్టుల్లేవ్ - కాంగ్రెస్ కేడర్ నిర్లక్ష్యం వెనుక అసలు కథ!

TPCC Nominated Posts: కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ పదే పదే వాయిదా పడుతోంది. నేతలు క్యాడర్ ను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది పార్టీపై ప్రభావం చూపిస్తోంది.

Revanth Reddy Government Cadre Dissatisfaction:   తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు కావస్తున్నా, ప్రభుత్వంలో భాగస్వామ్యం కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ద్వితీయ శ్రేణి నేతలు, క్షేత్రస్థాయి కార్యకర్తలకు ఆశించిన ఫలితం దక్కడం లేదు. కార్పొరేషన్ ఛైర్మన్లు, మార్కెట్ కమిటీలు, గ్రంథాలయ సంస్థలు, దేవాలయ ట్రస్ట్ బోర్డులు, డీసీసీబీలు, పీఏసీఎస్ వంటి వందలాది నామినేటెడ్ పోస్టులు నేటికీ అరకొరగానే భర్తీ కావడం లేదా పెండింగ్‌లోనే పడి ఉండటం గులాబీ శ్రేణులను ఓడించి హస్తం జెండాను ఎగురవేసిన కేడర్‌ను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. అంతర్గత విభేదాలకు తోడు సొంత కేడర్‌ను నిర్లక్ష్యం చేయడం వల్ల కాంగ్రెస్‌లో నిరసన జ్వాలలు క్రమంగా రగులుతున్నాయి.

కార్యకర్తలకు పదవులు  ఇప్పించేందుకు ఆసక్తిగా  లేని ఎమ్మెల్యేలు

గాంధీభవన్‌లో ఇన్‌ఛార్జ్ మంత్రులు, డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో తరచుగా సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయికి వచ్చేసరికి నిర్ణయాల అమలులో తీవ్ర ఆలస్యం జరుగుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ 70% కంటే ఎక్కువ నామినేటెడ్ పోస్టులను పార్టీ కోసం కష్టపడిన పాత కార్యకర్తలకే కేటాయిస్తామని స్పష్టం చేస్తున్నప్పటికీ, ఎమ్మెల్యేలు మరియు నియోజకవర్గ ఇన్‌ఛార్జుల నుంచి సిఫార్సుల జాబితాలు సకాలంలో రాకపోవడమే ఈ ఆలస్యానికి ప్రధాన కారణమని పార్టీ వర్గాల మాట. ప్రభుత్వం సాధించిన సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన కేడర్.. పదవుల విషయంలో అలసత్వంతో తీవ్ర నిరాశలో కూరుకుపోతున్నారు. 
 
 ఎవరికి ఇస్తే ఎవరికి కోపమో అనే భయం! 

నియోజకవర్గాల్లో ముఠా రాజకీయాలు  ఉన్నాయి. ఉన్నది ఒక్క పోస్టు, ఆశావహులు పదుల సంఖ్యలో ఉంటున్నారు. ఏ ఒక్కరి పేరు సిఫారసు చేసినా మిగిలిన వర్గాలు తమకు వ్యతిరేకంగా మారతాయనే భయంతో చాలామంది ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జులు జాబితాలను పంపకుండా వాయిదా వేస్తున్నారు. గడిచిన మూడేళ్లలో బీఆర్‌ఎస్, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన చేరికల నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, విపక్షంలో ఉన్నప్పుడు కేసులు ఎదుర్కొని పోరాడిన పాత కాంగ్రెస్ కేడర్  తీవ్ర అన్యాయానికి గురవుతోందనే భావన బలంగా నాటుకుపోతోంది. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులు, స్థానిక సీనియర్ నేతలు, డీసీసీ అధ్యక్షుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఉమ్మడి జిల్లాల వారీగా ఇచ్చే పేర్లలో కూడా అధిష్ఠానం వద్ద తీవ్ర పోటీ నెలకొంటోంది.

 క్యాడర్ నిరాసక్తత – కాంగ్రెస్‌కు రాబోయే సవాళ్లు 

విపక్షాల్లో ఉన్నప్పుడు వీధిపోరాటాలు చేసి పార్టీని అధికారంలోకి తెచ్చిన కార్యకర్తలకు అధికారం దక్కిన మూడేళ్లకి కూడా  గుర్తింపు లభించకపోవడం వల్ల గ్రామ, మండల స్థాయిలో కేడర్ పూర్తిగా సైలెంట్ అయిపోతోంది. పార్టీ సభ్యత్వ నమోదు, ప్రభుత్వ పథకాల ప్రచారం లేదా రాజకీయ ప్రత్యర్థులపై ఎదురుదాడి చేయడంలో గతంలో ఉన్న ఉత్సాహం ఇప్పుడు కార్యకర్తల్లో కనిపించడం లేదు. ప్రభుత్వం సాధించిన విజయాల కంటే అంతర్గత పంచాయితీలే ఎక్కువగా వార్తల్లో నిలవడం పార్టీ ఇమేజ్‌ను కూడా మసకబారుస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ,  టీపీసీసీ నాయకత్వం ఇకనైనా రాజకీయ భయాలను పక్కనబెట్టి నామినేటెడ్ పోస్టుల భర్తీని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సి ఉందని  క్యాడర్ అంటున్నారు.  ఎమ్మెల్యేల ఒత్తిళ్లకు తలొగ్గకుండా, కష్టపడ్డ నిజమైన కార్యకర్తలకు పదవులు కట్టబెడితే తప్ప కాంగ్రెస్ శ్రేణుల్లో పూర్వ వైభవం ,  రాజకీయ ఉత్సాహం తిరిగొచ్చే అవకాశం కనిపించడం లేదని చెబుతున్నారు.  

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?
Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?
SIRపై తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్‌లో భారీ సభకు రెడీ..
SIRపై తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్‌లో భారీ సభకు రెడీ..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
Abhijeet Dipke: జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Embed widget