అన్వేషించండి

Telangana BJP MLC Elections: ఎమ్మెల్సీ పోరులో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు బిగ్ రిస్క్ - గెలిస్తే ఓకే.. తేడా వస్తే బండి సంజయ్‌కి మళ్లీ పగ్గాలు?

Ramchandra Rao BJP MLC Candidate: తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ పడుతున్నారు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. పార్టీని నడిపిస్తున్న అధ్యక్ష స్థానంలో ఉండి పోటీ పెద్ద రిస్క్ గా మారింది.

Hyderabad Ranga Reddy Graduates MLC Polls:   తెలంగాణ రాజకీయంలో పట్టభద్రుల  ఎమ్మెల్సీ ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. హైదరాబాద్-రంగాజిల్లా-మహాబూబ్‌నగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు స్వయంగా రంగంలోకి దిగాలని భావించడం, దానికి అధిష్ఠానం ఆమోద ముద్ర వేయడం ఇప్పుడు కమలదళంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.  గతంలో ఇదే స్థానం నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన అనుభవం రామచంద్రరావుకు ఉన్నప్పటికీ, రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉండి మళ్లీ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం అత్యంత ప్రమాదకరమైన  పొలిటికల్ రిస్క్  అనడంలో ఎలాంటి సందేహం లేదు.

రాష్ట్ర అధ్యక్షుడి స్థానంలో ఉండి ఎమ్మెల్సీగా పోటీ 

సాధారణంగా ఏ రాజకీయ పార్టీలోనైనా రాష్ట్ర అధ్యక్షుడు యావత్ రాష్ట్రంపై దృష్టి సారించి పార్టీని విజయతీరాలకు చేర్చాలి తప్ప, స్వయంగా ఒక నియోజకవర్గానికే పరిమితమై ప్రచారం చేసుకోవడం అరుదు. ఒకవేళ పట్టభద్రుల పోరులో ఫలితం తేడా వస్తే, వచ్చే మొదటి సవాలు రామచంద్రరావు నాయకత్వంపైనే. గ్రాడ్యుయేట్లు, విద్యావంతులు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో ఓటమి ఎదురైతే రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సిన నైతిక బాధ్యత ఏర్పడుతుంది. ఈ విషయం తెలిసి కూడా ఆయన పోటీకి దిగుతున్నారా లేదా హైకమాండ్ ఆయనను ఈ రిస్కులోకి నెట్టిందా అనే సందేహాలు పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యాలపై దాడి చేయాల్సిన కీలక సమయంలో, రాష్ట్ర అధ్యక్షుడు ఒకే నియోజకవర్గంలో డివిజన్ల వారీగా తిరగడం బీజేపీ ప్రచార వేగానికి ఆటంకం కలిగిస్తుందనే ఆందోళన ఉంది. అయితే, రామచంద్రరావు వర్గం మాత్రం దీనిని  విశ్వాస ప్రకటన గా చూస్తోంది. పట్టభద్రుల్లో బీజేపీకి ఉన్న తిరుగులేని ఇమేజ్‌ను, సీనియర్ న్యాయవాదిగా తనకున్న గుర్తింపును నమ్ముకుని, ఓటమి భయాన్ని పక్కనపెట్టి ఫ్రంట్ ఫుట్‌లో పోరాడుతున్నట్లు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

అధ్యక్ష బాధ్యతలు మారుస్తారా? 

మరోవైపు, ఢిల్లీ వర్గాల్లోనూ, తెలంగాణ బీజేపీ వర్గాల్లోనూ ఒక ఆసక్తికరమైన ప్రచారం సాగుతోంది. ఈ ఎన్నికల వేదికగా తెలంగాణ బీజేపీలో నాయకత్వ మార్పునకు పునాది పడుతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుకూల ఫలితం రాకపోతే, ఆ సాకుతో రామచంద్రరావు స్థానంలో మళ్లీ మాస్ లీడర్, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్  కు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించేలా హైకమాండ్ పక్కా వ్యూహంతో ఉందనే ప్రచారం ఊపందుకుంది.
గతంలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తెలంగాణ బీజేపీలో కనబడిన అగ్రెసివ్ మార్క్, క్షేత్రస్థాయి శ్రేణుల్లో ఉన్న ఉత్సాహం ప్రస్తుతం కాస్త మందగించిందనే అభిప్రాయం కేడర్‌లో ఉంది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లకు గట్టి పోటీ ఇవ్వాలంటే మళ్లీ సంజయ్ వంటి దూకుడున్న నాయకుడే సరైన ఛాయిస్ అని భావిస్తున్న హైకమాండ్, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ఆధారంగా తమ అసలు పొలిటికల్ గేమ్‌ను అమలు చేయవచ్చని భావిస్తున్నారు.

 రామచంద్రరావుకు ఈ ఎమ్మెల్సీ పోటీ ఒక రకంగా  కత్తిమీద సాము లాంటిది. గెలిస్తే తన అధ్యక్ష పదవిని మరింత పటిష్టం చేసుకోవడమే కాకుండా పార్టీపై పట్టు సాధించవచ్చు, కానీ ఏమాత్రం తేడా వచ్చినా పదవిని కోల్పోవడంతో పాటు బండి సంజయ్ రీ-ఎంట్రీకి దారులు సుగమం చేసినవారవుతారు. మరి ఈ రిస్క్ పొలిటికల్ గేమ్‌లో రామచంద్రరావు గట్టెక్కుతారో లేక బీజేపీ హైకమాండ్ రాసిన స్క్రిప్ట్‌కే పరిమితమవుతారో తేలేందుకు కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.   

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Botsa Anusha: బొత్స కుటుంబానికి బిగ్ షాక్ - బొండపల్లి జెడ్పీటీసీ స్థానంలో కుమార్తె అనూష ఓటమి
బొత్స కుటుంబానికి బిగ్ షాక్ - బొండపల్లి జెడ్పీటీసీ స్థానంలో కుమార్తె అనూష ఓటమి
Telangana Graduates MLC Election : కాంగ్రెస్ సర్కార్‌కి లిట్మస్ టెస్ట్- పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరుపై విద్యావంతుల తీర్పు ఏంటి?
కాంగ్రెస్ సర్కార్‌కి లిట్మస్ టెస్ట్- పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరుపై విద్యావంతుల తీర్పు ఏంటి?
Nara Lokesh: మృత్యుంజయురాలు గోపిక - రాప్తాడు బాధితురాలి కోసం స్వయంగా లోకేశ్ వైద్య పర్యవేక్షణ !
మృత్యుంజయురాలు గోపిక - రాప్తాడు బాధితురాలి కోసం స్వయంగా లోకేశ్ వైద్య పర్యవేక్షణ !
YS Jagan AP Local Body Elections: సమరం మధ్యలో షాకింగ్ కామెంట్స్ - పల్లెల్లో పోరాడుతున్న క్యాడర్‌కు నిరాశ - జగన్ తొందపడుతున్నారా?
సమరం మధ్యలో షాకింగ్ కామెంట్స్ - పల్లెల్లో పోరాడుతున్న క్యాడర్‌కు నిరాశ - జగన్ తొందపడుతున్నారా?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fake Death Certificate: ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Arjun Rajput Century: అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
Governor Quota MLC: డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
Mahasakthi Movie OTT : ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hyderabad Crime News: హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
Israel Politics: ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
Embed widget