అన్వేషించండి

Congress High Command: కాంగ్రెస్ సీఎంలను హైకమాండ్ కించ పరుస్తుందా? కనీస గౌరవం కూడా ఇవ్వదా?

Congress High Command : ఢిల్లీ ర్యాలీలలో రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్‌లను సెక్యూరిటీ నెట్టివేసిన వీడియోలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. కాంగ్రెస్ హైకమాండ్‌ది అహంకారమన్న విమర్శలు వస్తున్నాయి.

Revanth Reddy Ramlila Maidan Security Push: రాజకీయాల్లో కొన్నిసార్లు అనుకోకుండా జరిగే పరిణామాలు, పొరపాట్లు విపక్షాలకు పెద్ద రాజకీయ ఆయుధాలుగా మారిపోతాయి. కర్ణాటక  ముఖ్యమం  డీకే శివకుమార్ , తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిలకు సభలు, నిరసన ర్యాలీల వేదికగా ఎదురైన కొన్ని సంఘటనలు ఇప్పుడు జాతీయ , రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ పాల్గొన్న నిరసన ర్యాలీలలో  ఈ ఇద్దరు అగ్రనేతలను పక్కకు తోసివేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

ఇద్దరు సీఎంలకు చేదు అనుభవం 

ముఖ్యంగా ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగిన  ఓట్ బచావో.. దేశ్ బచావో  ఆందోళన సందర్భంగా ప్రియాంకా గాంధీ వెనుకాల వస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని భద్రతా సిబ్బంది వెనక్కి నెట్టివేయడం, ఆయన కొద్దిసేపు ఇబ్బంది పడటంపై ప్రత్యర్థి పార్టీలు తీవ్రస్థాయిలో దాడి ప్రారంభించాయి. అంతకుముందు ఢిల్లీ మార్చ్‌లోనే డీకే శివకుమార్‌ను కూడా ఇదే తరహాలో రాహుల్ గాంధీ సెక్యూరిటీ పక్కకు జరపడంపై  కాంగ్రెస్ అధిష్ఠానానికి సొంత ముఖ్యమంత్రులు అంటే కనీస గౌరవం లేదు, ప్రాంతీయ నేతలను ఢిల్లీ పెద్దలు అవమానిస్తున్నారు  అంటూ బిజెపి, బిఆర్ఎస్ శ్రేణులు డిజిటల్ వేదికగా ప్రచారాన్ని హోరెత్తించాయి.

కావాలని అవమానించినట్లుగా లేని దృశ్యాలు

అయితే, ఈ విమర్శల వెనుక ఉన్న అసలు నిజా నిజాలను లోతుగా పరిశీలిస్తే.. ఇది అధిష్ఠానం చేసిన  కావాలని అవమానం కాదని, భారీ స్థాయిలో జనాలు గుమిగూడినప్పుడు భద్రతా యంత్రాంగం   వల్ల తలెత్తే కమ్యూనికేషన్ గ్యాప్ మరియు క్రౌడ్ మేనేజ్‌మెంట్ చిక్కులని స్పష్టమవుతోంది. ఢిల్లీ రక్షణ విభాగం , అగ్రనేతల జెడ్ ప్లస్ సెక్యూరిటీ సిబ్బంది ప్రాథమికంగా తమ ప్రొటోకాల్స్ ప్రకారమే నడుచుకుంటారు. తొక్కిసలాట జరిగే వాతావరణంలో వేదికపైకి లేదా గాంధీ కుటుంబ సభ్యుల చుట్టూ ఉన్న రక్షణ వలయంలోకి పరిమితికి మించి జనాలు నెట్టుకొచ్చినప్పుడు, సెక్యూరిటీ ఏజెంట్లు ఆ సమయంలో ముందెనకా చూడకుండా తోసివేస్తుంటారు. విషయం తీవ్రతను పసిగట్టిన డీకే శివకుమార్ స్వయంగా రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చారు.  నన్ను ఎవరూ నెట్టివేయలేదు, విపక్షాలు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయి. తీవ్రమైన రద్దీ కారణంగా రాహుల్ గాంధీ స్వయంగా నన్ను కాపాడేందుకు ముందుకొచ్చి వాహనం ఎక్కమన్నారు అంటూ ఆయన ఆ వార్తలను ఖండించారు. అలాగే, రేవంత్ రెడ్డి విషయంలోనూ స్థానిక పోలీసుల రక్షణ వలయం, ఢిల్లీ కేడర్ల తోపులాటల నడుమ భద్రతా సిబ్బంది వ్యవహరించిన శైలే దానికి కారణం తప్ప, కాంగ్రెస్ జాతీయ నాయకత్వం సీఎం రేవంత్‌ను తక్కువ చేసి చూపిందనడంలో ఎలాంటి వాస్తవం లేదని హస్తం శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి.

సోషల్ మీడియాలో మాత్రం వ్యతిరేక ప్రచారం

 పొలిటికల్ నెరేటివ్స్ పరంగా చూస్తే.. ఆ దృశ్యాలు సామాన్య ప్రజా బాహుళ్యంలోకి వెళ్లినప్పుడు ఒక ప్రతికూల అభిప్రాయాన్ని సులువుగా కలిగిస్తాయి.  కాంగ్రెస్ హైకమాండ్ అహంకారంతో వ్యవహరిస్తోంది, తమ పార్టీ తరఫున గెలిపించి రాష్ట్రాన్ని ఏలుతున్న ముఖ్యమంత్రులను కూడా బౌన్సర్ల తరహాలో పక్కకు నెట్టివేయిస్తున్నారు  అనే నెగెటివ్ ఇంప్రెషన్‌ను ప్రతిపక్షాలు నెట్టింట చొప్పించడంలో కొంతమేర విజయవంతమయ్యాయి. ఢిల్లీ వేదికపై ఇతర రాష్ట్రాల అగ్రనేతలకు దక్కాల్సిన సరైన ప్రొటోకాల్ మర్యాదలు లభించకపోవడం డిజిటల్ ప్రచారంలో పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది.  జాతీయ స్థాయిలో నిర్వహించే భారీ ర్యాలీలలో ఇటువంటి సెక్యూరిటీ విఫలాలు తరచూ జరుగుతుంటాయి. అయితే, ప్రతిపక్షాలు ప్రతి చిన్న అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్న ప్రస్తుత డిజిటల్ యుగంలో కాంగ్రెస్ హైకమాండ్ , వారి భద్రతా విభాగం మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. తమ సొంత ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలకు వేదికల వద్ద కనీస ప్రొటోకాల్ గౌరవం లభించేలా చూసుకోకపోతే, అది రాబోయే రోజుల్లో 'ఆత్మగౌరవం' అనే నినాదంతో దెబ్బకొట్టేందుకు ప్రత్యర్థులకు నిరంతరం ఆయుధంగా మారుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

 రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్‌లకు ఎదురైన అనుభవాలు కేవలం ర్యాలీల రద్దీలో భద్రతా సిబ్బంది అతిజాగ్రత్త వల్ల జరిగిన యాదృచ్ఛిక సంఘటనలే   తప్ప కాంగ్రెస్ అధిష్ఠాన అహంకారం కావు. అయినప్పటికీ, విపక్షాలు చేస్తున్న సంచలన ప్రచారాన్ని తిప్పికొట్టడంతో పాటు, రాబోయే రోజుల్లో భారీ బహిరంగ సభల్లో సొంత సీనియర్ నేతల గౌరవానికి, ప్రొటోకాల్‌కు ఎలాంటి భంగం కలగకుండా కాంగ్రెస్ నాయకత్వం తగిన ప్లానింగ్ చేసుకోవడం చాలా ముఖ్యం. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Municipal Elections 2026: ఏపీ పుర ఫలితాల్లో టీడీపీ-జనసేన ఐక్యత సూపర్ - బీజేపీకి ఓట్ ట్రాన్స్‌ఫర్‌లోనే సమస్యలు - ఎలా అధిగమిస్తారు?
ఏపీ పుర ఫలితాల్లో టీడీపీ-జనసేన ఐక్యత సూపర్ - బీజేపీకి ఓట్ ట్రాన్స్‌ఫర్‌లోనే సమస్యలు - ఎలా అధిగమిస్తారు?
MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీల మద్దతుపై కాంగ్రెస్ ఫోకస్.. రేవంత్ వ్యూహం ఏంటి?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీల మద్దతుపై కాంగ్రెస్ ఫోకస్.. రేవంత్ వ్యూహం ఏంటి?
Congress Dissidence: కాంగ్రెస్‌లో నిధుల మంటలు, పదవుల రగడ - సీఎం రేవంత్‌కు సొంత పార్టీ అసంతృప్తుల సవాల్.. నిర్లక్ష్యం చేస్తే ముప్పేనా?
కాంగ్రెస్‌లో నిధుల మంటలు, పదవుల రగడ - సీఎం రేవంత్‌కు సొంత పార్టీ అసంతృప్తుల సవాల్.. నిర్లక్ష్యం చేస్తే ముప్పేనా?
Amit Shah Hyderabad Padayatra: అమిత్ షా హైదరాబాద్ వాక్ సక్సెస్ - గ్రూపు తగాదాలకు చెక్ - బీజేపీ నెక్ట్స్ ప్లాన్ ఏంటి?
అమిత్ షా హైదరాబాద్ వాక్ సక్సెస్ - గ్రూపు తగాదాలకు చెక్ - బీజేపీ నెక్ట్స్ ప్లాన్ ఏంటి?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Elections 2026: ఏపీ పుర ఫలితాల్లో టీడీపీ-జనసేన ఐక్యత సూపర్ - బీజేపీకి ఓట్ ట్రాన్స్‌ఫర్‌లోనే సమస్యలు - ఎలా అధిగమిస్తారు?
ఏపీ పుర ఫలితాల్లో టీడీపీ-జనసేన ఐక్యత సూపర్ - బీజేపీకి ఓట్ ట్రాన్స్‌ఫర్‌లోనే సమస్యలు - ఎలా అధిగమిస్తారు?
Virat Kohli  Storm: అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
Ongole Mayor Result: కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
RTC Conductor Dies: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
Medical College Ragging: కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
Embed widget