అన్వేషించండి

Tejaswi Surya controversy: తెలంగాణ బీజేపీకి పెద్ద చిక్కు తెచ్చి పెట్టిన తేజస్వీసూర్య - ఉద్యమకారులకు ఏమి చెప్పుకుంటారు?

Tejaswisurya: తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీకి తేజస్వీ సూర్య గట్టి షాక్ ఇచ్చారు. మళ్లీ సెంటిమెంట్ రేపే వ్యాఖ్యలు చేశారు. దీన్ని బీజేపీ ఎలా ఎదుర్కొంటుంది?

Tejaswisurya created a big problem for the Telangana BJP:  లోక్‌సభలో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్‌ను విమర్శించే క్రమంలో ఆయన వాడిన పదజాలం, తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను బ్రిటీష్ పాలకులు చేసిన దేశ విభజనతో పోల్చడం.. రాష్ట్ర ప్రజల సెంటిమెంట్‌ను తాకింది. ఈ పరిణామం అటు కేంద్ర బీజేపీకి, ఇటు రాష్ట్ర బీజేపీ నేతలకు మింగుడుపడని అంశంగా మారింది.  

 తెలంగాణ సెంటిమెంట్‌పై గురితప్పిన బాణం 

రాజకీయాల్లో కొన్నిసార్లు ప్రత్యర్థిని దెబ్బకొట్టే క్రమంలో చేసే వ్యాఖ్యలు  సెల్ఫ్ గోల్ గా మారుతుంటాయి. తేజస్వీ సూర్య విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. కాంగ్రెస్ పార్టీ విభజనను అశాస్త్రీయంగా చేసిందని విమర్శించడం వరకు రాజకీయం అనిపించినా, దానిని బ్రిటీష్ వారు దేశాన్ని ముక్కలు చేసిన తీరుతో పోల్చడం తెలంగాణ ప్రజల దశాబ్దాల పోరాటాన్ని కించపరచడమేనని స్థానిక ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు అనేది ఒక చారిత్రక అవసరం , ప్రజా ఆకాంక్ష. దీనిని ప్రతికూల కోణంలో చూడటం ద్వారా బీజేపీ తన పునాదులను తానే దెబ్బతీసుకుంటుందన్న వాదన వినిపిస్తోంది.

ఏకమైన విపక్షాలు - బీజేపీపై ఉమ్మడి దాడి

ఈ వివాదాన్ని అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వదులుకోవడానికి సిద్ధంగా లేవు. సాధారణంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే ఈ రెండు పార్టీలు, ఇప్పుడు బీజేపీని కార్నర్ చేయడంలో పోటీ పడుతున్నాయి.  తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తారా అంటూ కేటీఆర్, హరీష్ రావు వంటి బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో విరుచుకుపడుతుంటే, మంత్రి పొన్నం ప్రభాకర్ వంటి కాంగ్రెస్ నేతలు క్షేత్రస్థాయిలో నిరసనలకు పిలుపునిస్తున్నారు. తెలంగాణ వ్యతిరేక పార్టీగా బీజేపీని ముద్ర వేయడానికి ఈ వ్యాఖ్యలు ఒక బలమైన ఆయుధంగా మారాయి.

 బీజేపీ నేతల డిఫెన్సివ్ స్టేట్‌మెంట్స్

తేజస్వీ సూర్య వ్యాఖ్యలతో రాష్ట్ర బీజేపీ నేతలు అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆయన మాటలను బహిరంగంగా ఖండించలేక, అలాగని సమర్థించలేక సతమతమవుతున్నారు.  ఆయన విభజన తీరునే ప్రశ్నించారు తప్ప, తెలంగాణ ఏర్పాటును కాదు అని కొందరు నేతలు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, అది ప్రజల్లోకి వెళ్లడం లేదు. గతంలో పార్లమెంటు సాక్షిగా ప్రధాని మోదీ చేసిన  తల్లిని చంపి బిడ్డను వేరు చేశారు  అనే వ్యాఖ్యలను ఈ సందర్భంగా విపక్షాలు గుర్తు చేస్తూ, బీజేపీకి మొదటి నుంచి తెలంగాణ అంటే గిట్టదనే వాదనను బలంగా వినిపిస్తున్నాయి.  కర్ణాటకకు చెందిన ఎంపీ అయి ఉండి, పొరుగున ఉన్న తెలంగాణ మనోభావాలను దెబ్బతీయడంపై మేధావి వర్గం కూడా పెదవి విరుస్తోంది.  

సవరించుకుని..కవర్ చేసుకుంటారా?

తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీకి ఇటువంటి అనాలోచిత వ్యాఖ్యలు పెద్ద అడ్డంకులుగా మారుతున్నాయి. సెంటిమెంట్ ప్రధానంగా సాగే తెలంగాణ రాజకీయాల్లో ఏ చిన్న పొరపాటు చేసినా దాని ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుంది. తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై జాతీయ నాయకత్వం వెంటనే స్పందించి వివరణ ఇవ్వకపోతే, అది రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీకి పెద్ద మైనస్‌గా మారే అవకాశం ఉంది. రాజకీయ ప్రత్యర్థులను విమర్శించే క్రమంలో ప్రజల మనోభావాలను తాకడం అనేది కత్తి మీద సాము వంటిదని ఈ ఉదంతం మరోసారి నిరూపించింది. 

 

టాప్ హెడ్ లైన్స్

Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget