అన్వేషించండి

TDP Action On MLAs: ఎమ్మెల్యేల ‘కోటరీ’ రాజకీయంపై టీడీపీ అధిష్ఠానం ఉక్కుపాదం - పక్కనబెట్టే దిశగా టీడీపీ ప్లాన్.. త్వరలోనే మార్పులు?

Chandrababu Warning : ఏపీ స్థానిక ఎన్నికల్లో జడ్పీటీసీ, మేయర్ స్థానాల ఓటమికి కారణమైన టీడీపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతర్గత మార్పులపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు.

Chandrababu Naidu Action On TDP MLAs 2026: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల  మున్సిపల్, జడ్పీటీసీ ఎన్నికలలో ఎన్డీయే కూటమి  అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని జయకేతనం ఎగురవేసినప్పటికీ, కొన్ని కీలకమైన జడ్పీటీసీ స్థానాలతో పాటు ఒక ప్రతిష్టాత్మక మేయర్ పీఠాన్ని సైతం చేజార్చుకోవడం తెలుగుదేశం పార్టీ అధినాయకత్వాన్ని  దిగ్భ్రాంతికి గురిచేసింది. ఓటమి పాలైన ప్రాంతాల్లో నిర్వహించిన ప్రాథమిక సమీక్షల అనంతరం.. ఈ పరాజయాలకు ప్రధాన కారణం ప్రత్యర్థుల బలం కాదని, స్థానిక ఎమ్మెల్యేల ఏకపక్ష, బాధ్యతారహిత వ్యవహారశైలేనని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒక స్పష్టమైన నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యేల తీరు వల్ల కొన్ని చోట్ల ఓటమి           

నియోజకవర్గాల్లో కొందరు ఎమ్మెల్యేలు ప్రదర్శించిన  స్వయంకృత అపరాధాలు  పార్టీ గెలుపు అవకాశాలను దారుణంగా దెబ్బతీశాయన్న వాస్తవాన్ని అధిష్ఠానం  తీవ్రంగా పరిగణిస్తోంది. టికెట్ల కేటాయింపు ప్రక్రియలో క్షేత్రస్థాయిలో అసలైన ప్రజామోదం ఉన్న గెలుపు గుర్రాలను, ఏళ్ల తరబడి పార్టీ జెండా మోసి శ్రమించిన నిబద్ధత కలిగిన విధేయులను పూర్తిగా పక్కనబెట్టారు. దీనికి బదులుగా, తమ వ్యక్తిగత ప్రయోజనాలకు, ఆర్థిక లావాదేవీలకు అనుకూలంగా ఉండే సొంత కోటరీ నాయకులకే పెద్దపీట వేయడం వల్ల పలు కీలక స్థానాల్లో తీవ్ర ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయి. ఎమ్మెల్యేల ఈ ఏకపక్ష వైఖరి కారణంగా దశాబ్దాలుగా పార్టీకి అండగా నిలిచిన ద్వితీయ శ్రేణి నేతలు, కేడర్ తీవ్ర నిరాశకు గురయ్యారు. కొన్ని చోట్ల ఈ అసంతృప్తి రెబల్ అభ్యర్థులు బరిలోకి దిగడానికి దారితీయగా, మరికొన్ని చోట్ల క్షేత్రస్థాయి నేతలు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండి నిశ్శబ్ద నిరసన తెలిపారు. పార్టీ అంతర్గత వర్గపోరు ,  నియోజకవర్గ స్థాయి కోటరీ గ్రూపుల వల్లే హస్తగతమవ్వాల్సిన పీఠాలు చేజారిపోయామని, అధికారంలో ఉన్నామనే అహంకారంతో ప్రవర్తించిన ఎమ్మెల్యేలే ఈ నష్టానికి బాధ్యులని సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ఎమ్మెల్యేల లెక్కలు తీస్తున్న చంద్రబాబు     

ఇలాంటి స్వార్థపూరిత పరిస్థితుల్లో ఆయా నియోజకవర్గాల్లో సదరు ఎమ్మెల్యేలను రానున్న రోజుల్లో పక్కన పెట్టడం దాదాపు ఖాయమనే ప్రచారం పార్టీ వర్గాల్లో తీవ్ర ఊపందుకుంది.  కేవలం హెచ్చరికలు జారీ చేసి వదిలేసే సంప్రదాయానికి ఈసారి స్వస్తి పలకాలని చంద్రబాబు గట్టిగా నిర్ణయించుకున్నారు. ప్రజాభిప్రాయాన్ని తక్కువగా అంచనా వేసి, పార్టీ ప్రతిష్టకు మచ్చతెచ్చిన ప్రాంతాల్లో తక్షణమే ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని  సిద్ధం చేసే దిశగా అధిష్ఠానం తన అంతర్గత ప్రక్రియకు తెరతీసింది. ఈ క్రమంలోనే ఓటమి పాలైన నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలతో ప్రత్యక్షంగా మాట్లాడేందుకు, ఇన్ఛార్జులను నియమించేందుకు ప్రత్యేక నివేదికలు సేకరిస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఇప్పట్నుంచే పనితీరు సరిగా లేని, సొంత అజెండాతో పనిచేసే ఎమ్మెల్యేలకు ప్రత్యామ్నాయంగా బలమైన ఇన్ఛార్జులను లేదా సమన్వయకర్తలను రంగంలోకి దించనున్నారు. 

ఓటమి నుంచి వెంటనే పాఠాలు నేర్చుకుంటున్న టీడీపీ                  

అధికారంలో ఉన్నాం కదా అని ఏకపక్షంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో సీటు ఊడుతుందనే కఠిన సందేశాన్ని ఈ చర్య ద్వారా సమగ్రంగా పంపాలని భావిస్తున్నారు.  స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు టీడీపీ అధిష్ఠానానికి ఒక రకమైన హెచ్చరిక లాంటివి. విజయాల ఉత్సాహంలో మునిగిపోకుండా, ఓటమికి కారణమైన ఎమ్మెల్యేలపై నిరక్షరస్యంగా ఉక్కుపాదం మోపడం ద్వారా మాత్రమే పార్టీ క్రమశిక్షణను పునరుద్ధరించగలరు. కష్టకాలంలో నిలబడిన విధేయులకు స్థానం కల్పిస్తూ, స్వార్థ రాజకీయాలు చేసే ఎమ్మెల్యేలకు చెక్ పెడితేనే రాబోయే రోజుల్లో టీడీపీ తన క్షేత్రస్థాయి పునాదులను మరింత పటిష్టం చేసుకోవాలని నిర్ణయించుకుంది.    

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
Tamil Nadu CM Vijay TVK MLAs Controversy: సీఎం విజయ్‌కు సొంత ఎమ్మెల్యేల సెగ - 108 మ్యాజిక్ ఫిగర్ భయంతో కన్ఫెషన్ రూమ్ వ్యూహం - పట్టు కోల్పోయారా?
సీఎం విజయ్‌కు సొంత ఎమ్మెల్యేల సెగ - 108 మ్యాజిక్ ఫిగర్ భయంతో కన్ఫెషన్ రూమ్ వ్యూహం - పట్టు కోల్పోయారా?
AP Municipal Elections 2026: 4 కార్పొరేషన్లలో టీడీపీ ఒక్క చోటే పోటీ.. పుంజుకోవడానికి వైసీపీకి ఇది మరో సువర్ణావకాశమా?
4 కార్పొరేషన్లలో టీడీపీ ఒక్క చోటే పోటీ.. పుంజుకోవడానికి వైసీపీకి ఇది మరో సువర్ణావకాశమా?
Why Close Aides Are Leaving YS Jagan: విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు? అసలు తప్పు ఎక్కడుంది?
విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు? అసలు తప్పు ఎక్కడుంది?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy About Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
Vizag CII Summit: రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
AP Panchayat Elections: ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
Matt Henry Sixer: కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
Ravi Babu Scary Picture : బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
Telangana Congress: భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
KFC and Dominos Outlets: ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
Embed widget