అన్వేషించండి

Tamil Nadu CM Vijay Working Style: సూటు, బూటు సీఎం - తమిళనాడులో దళపతి మార్కు పాలన.. అధికారులకు చెమటలు పట్టిస్తున్న విజయ్ !

Thalapathy Vijay as CM: తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా విజయ్ రోజువారీ కార్యకలాపాలు ఎలా ఉన్నాయి? అధికారులతో ఆయన వ్యవహరిస్తున్న తీరు, ఫైళ్లపై సంతకాల వేగంపై ఒక ప్రత్యేక ఇన్‌సైడ్ స్టోరీ.

CM Vijay Working Style:  తమిళనాడు రాజకీయాల్లో  దళపతి విజయ్ శకం మొదలైనప్పటి నుండి సెక్రటేరియట్  వాతావరణం పూర్తిగా మారిపోయింది. సినీ రంగంలో తన క్రమశిక్షణతో అందరినీ ఆశ్చర్యపరిచే విజయ్, ఇప్పుడు అదే  షూటింగ్ స్పాట్ డిసిప్లిన్ ను పరిపాలనలోనూ అమలు చేస్తున్నారు.ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్, తన పనితీరుతో ఐఏఎస్ అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. సాధారణంగా సినిమా షూటింగ్‌ల సమయంలో ఉదయాన్నే సెట్‌కు చేరుకునే అలవాటున్న విజయ్, ఇప్పుడు అదే పద్ధతిని  కోటగా పిలిచే సెక్రటేరియట్‌లోనూ   పాటిస్తున్నారు. ఉదయం సరిగ్గా  9:00 గంటలకు ఆయన తన కార్యాలయంలో ప్రత్యక్షమవుతున్నారు. ఆయన రావడమే కాదు, తన టీమ్ ,  సంబంధిత శాఖల అధికారులు కూడా సమయపాలన పాటించేలా కఠిన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆలస్యానికి తావులేదన్న సంకేతం బలంగా వెళ్ళింది.

 ఫైళ్లపై సంతకాల వేగం - క్లియర్ కట్ అప్రోచ్ 

విజయ్ పరిపాలనలో  పెండింగ్ అనే పదానికి చోటు లేకుండా చూస్తున్నారు. సినిమా స్క్రిప్ట్‌ను ఎలాగైతే క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుంటారో, అదే విధంగా ప్రతి ఫైలును లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఏదైనా పథకం లేదా నిర్ణయం వల్ల సామాన్యుడికి కలిగే లాభం ఏమిటనేది ఆయన మొదటి ప్రశ్నగా ఉంటోంది. ఒకసారి విషయం అర్థమయ్యాక, నిర్ణయం తీసుకోవడంలో ఏమాత్రం ఆలస్యం చేయడం లేదు. గతంలో వారాల తరబడి నలిగే ఫైళ్లు ఇప్పుడు 24 నుంచి 48 గంటల్లోపే క్లియర్ అవుతుండటం సెక్రటేరియట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

 అధికారులతో  డైరెక్ట్ టాక్ 

విజయ్ అధికారులతో వ్యవహరించే తీరు చాలా ప్రశాంతంగా, అదే సమయంలో చాలా సీరియస్‌గా ఉంటోంది. అనవసరమైన హంగులు, ఆర్భాటాలకు తావులేకుండా  టు ద పాయింట్  మాట్లాడటం ఆయన శైలి. క్షేత్రస్థాయిలో సమస్యలపై అధికారుల నుంచి కేవలం రిపోర్టులు తీసుకోవడమే కాకుండా, తానే స్వయంగా వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా కలెక్టర్లతో మాట్లాడుతున్నారు. అధికారులకు స్వేచ్ఛను ఇస్తూనే, జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తున్నారు. పని చేసే వారికి గుర్తింపు ఉంటుందని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన ముందే స్పష్టం చేశారు. పాలనలో అనుభవం లేదన్న విమర్శలను తిప్పికొట్టేలా, విజయ్ తన చుట్టూ అనుభవజ్ఞులైన మాజీ ఐఏఎస్ అధికారులు,  నిపుణులతో కూడిన ఒక  కోర్ టీమ్ ను ఏర్పాటు చేసుకున్నారు. వీరు ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌ను తీసుకుంటూనే, ప్రతి శనివారం ప్రజల నుంచి నేరుగా అర్జీలు తీసుకునేలా ఒక వ్యవస్థను రూపొందించారు. సినిమాల్లో మాదిరిగా అద్భుతాలు చేయాలని కాకుండా, వాస్తవానికి దగ్గరగా ఉంటూ పారదర్శకమైన పాలన అందించాలనేది ఆయన తాపత్రయం.

షూటింగ్ స్పాట్ డిసిప్లిన్ - రిజల్ట్ ఓరియెంటెడ్ 

ఒక సినిమాను నిర్ణీత సమయంలో పూర్తి చేయడానికి విజయ్ ఎలాగైతే కష్టపడతారో, ఇప్పుడు తన  మేనిఫెస్టో లోని హామీలను కూడా ఒక  షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని టార్గెట్లు పెట్టుకున్నారు.  మనం ప్రజలకు జవాబుదారీ, సమయం వృధా చేసే హక్కు మనకు లేదు  అని ఆయన తరచూ తన కేబినెట్ సహచరులకు గుర్తు చేస్తున్నారు. ఈ క్రమశిక్షణే ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వ యంత్రాంగంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. విపక్షాల విమర్శలకు తన పనితీరుతోనే సమాధానం చెప్పాలనేది దళపతి ప్లాన్. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
Advertisement

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Embed widget