అన్వేషించండి

No MP Only MLA : ఎంపీ కన్నా ఎమ్మెల్యే పదవే సో బెటర్ ! లోకల్‌గానే ఉంటామంటున్న సీనియర్ లీడర్స్

ఢిల్లీ రాజకీయాల్లో కంటే రాష్ట్ర రాజకీయాల్లో ఉండేందుకే సీనియర్ నేతలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఢిల్లీకి వెళ్తే లోకల్‌గా పట్టు కోల్పోతున్నామని ఆందోళన చెందుతున్నారు.

No MP Only MLA :  రాజకీయం అంటే ఆధిపత్యం. ఎంత ఎక్కువ అధికారం చేతిలో ఉంటే అంత ఆధిపత్యం. అందుకే పెద్ద పెద్ద పదవులు కోరుకుంటారు. ఎమ్మెల్యే కంటే ఎంపీ సహజంగా పెద్ద పదవి. ఎంపీ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయి. అందుకే  గతంలో సీనియర్లు ఎంపీలుగా వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఎంపీ వద్దే వద్దంటున్నారు. ఎమ్మెల్యేగానే ఉంటామంటున్నారు. పార్టీ అధినేతలు పిలిచి చాన్సిస్తామన్నా ఎమ్మెల్యే సీటు చాలంటున్నారు. ఈ మార్పు వెనక ఉన్న మర్మమేంటీ ?

ఢిల్లీకి వెళ్తే క్యాడర్‌కు దూరమవుతున్నామని సీనియర్ల బాధ  ! 

తెలుగు రాజకీయాల్లో నిన్నటివరకు అందరి చూపు ఢిల్లీ వైపు ఉండేది. ఎంపీగా పార్లమెంటులో పాదం మోపాలని కలలు కనేవాళ్లు. కానీ ఇప్పుడు ఢిల్లీ వద్దు గల్లీనే ముద్దు అంటున్నారు. ఈ మార్పుకి కారణం లేకపోలేదు. ఎంపీగా ఉండటం వల్ల కేడర్‌ దూరమవుతోందట. ఢిల్లీలోనే ఎక్కువ సమయం గడపడం వల్ల కార్యకర్తలు, జిల్లా నేతలను కలుసుకునే సమయం లేకుండా పోతోందట. దీంతో నియోజకవర్గంలో ఏంజరుగుతుందో..జిల్లాలో ఎలాంటి రాజకీయాలు ఉన్నాయో తెలుసుకునే అవకాశం లేకుండా పోతోందని దాంతో తమ సొంత నియోజకవర్గాల్లో సైతం పట్టు జారిపోతోందని ఆందోళన చెందుతున్నారు. 

ఎమ్మెల్యేలదే డామినేషన్ ! 

మ‌రో వైపు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేల డామినేష‌న్ ఎక్కువ అయ్యింది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే మాటే చెల్లుబాటు అవుతుందని అధినేతలు తేల్చి చెప్పేశారు. ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఎంపీ లు ఏదో నామ్ కే వ‌స్తి అన్న‌ట్లు గా ఉన్నారు. తెలంగాణ‌లో మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో జ‌రిగి ఓ కార్య‌క్ర‌మంలో మంత్రి శ్రినివాస్ గౌడ్  స్థానిక ఎంపీకి మాట్లాడెందుకు మైక్ కు కూడా ఇవ్వ‌లేదు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు తెలుగు రాష్ట్రాల్లో చాలా జ‌రిగాయి. కొన్నిచోట్ల అయితే ఎమ్మెల్యేలకు - ఎంపీ ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భగ్గుమంటోంది. మరికొన్ని చోట్ల ఎడ మొహం - పెడ మొహంలాగా తాయ‌రైందంట‌. 

ఎమ్మెల్యేలుగా ఈ సారి చాన్సివ్వాలని అధినేతల్ని కోరుతున్న ఎంపీలు ! 

ఇక ఎంపీగా ఉంటే ప్రజలు, కార్యక్తలు, పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండలేకపోతున్నారట. ఫలితంగా ప్రజలకు దూరమవుతున్నారట. వర్గ రాజకీయాలను నడపలేకపోతున్నారట. అంతేకాదు క్రమక్రమంగా పార్టీ, కార్యకర్తల్లో పట్టును కోల్పోవాల్సి వస్తోందట. అందుకే ఎంపీగా ఉండటం కంటే ఎమ్మెల్యేగా ఉండాలన్న ఆలోచనకు వచ్చారట. అలా ఏపీ టీడీపీలో మార్పు మొదలైందంటున్నారు. ఎంపీగా ఉన్న నేతలంతా రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారట. వారిలో ముందుగా ఎంపీ  రామ్మెహన్‌ నాయుడు పేరు వినిపిస్తోంది. శ్రీకాకుళం లోక్‌ సభ ఎంపీగా ఉన్న రామ్మోహన్‌నాయుడు వచ్చే ఎన్నికల్లో నరసన్నపేట నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని చూస్తున్నారట. నాట్‌ ఓన్లీ రామ్మోహన్‌ నాయుడు మిగిలిన ఎంపీలు కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో ఎంపీలంతా అసెంబ్లీకి  పోటీ ఖాయమే !

ఇటు తెలంగాణలో కూడా బీజేపీ ఎంపీలు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. బండి సంజయ్‌ వేములవాడ, కిషన్‌ రెడ్డి  అంబర్‌ పేట, సోయం బాబురావు బోథ్‌, అరవింద్‌ ఆర్మూర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలన్న ప్రతిపాదనకు వచ్చారట. వీరితో పాటు ఈమధ్యనే పార్టీలో చేరిన కొండావిశ్వేశ్వరరెడ్డి తాండూరు , మహేశ్వరంలలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతారన్న వార్తలున్నాయి. ఇక విజయశాంతి గ్రేటర్ హైదరాబాద్‌ లేదంటే మెదక్‌, గల్లా అరుణ గద్వాల్‌ నుంచి పోటీకి దిగాలనుకుంటున్నారట. మాజీ ఎంపీ వివేక్‌ చెన్నూరు నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి తెలుస్తోంది. ఇలా సిట్టింగ్‌ ఎంపీలు, మాజీలు అందరూ కూడా ఎమ్మెల్యేలుగా ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. 

ఢిల్లీ కన్నా గల్లీనే బెటరని ఫైనల్ ! 

స్థానికంగా ఉండటంతో పాటు కార్యకర్తలు, ఆయా సామాజిక వర్గాల్లోనూ పట్టుసాధించవచ్చనే ఆలోచనతోనే ఎంపీకి బైబై చెప్పి ఎమ్మెల్యేగా పిలిపించుకోవాలనుకుంటున్నారట. బీజేపీ అధిష్టానం మాత్రం గెలుపు గుర్రాల‌న్నింటినీ అసెంబ్లీ బ‌రిలోకే దింపాల‌ని చూస్తోంద‌ట‌. ఎందుకంటే తెలంగాణ‌లో లోక్ స‌భ కంటే అసెంబ్లీకే ముందుగా ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది కాబ‌ట్టి ఈ నిర్ణ‌యం అంట‌. మ‌రి మిగ‌లిని  పార్టీలు ఏం చేస్తాయి, పార్ల‌మెంట్ గేట్ నుంచి అసెంబ్లీ గేట్ రావ‌ల‌నుకునే వారిని ఏం చేస్తారో చూడాలి.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కామెంట్స్ మీద అల్లు అర్జున్ రియాక్షన్ - ప్రెస్‌మీట్‌లో ఏం చెప్పారంటే?
అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కామెంట్స్ మీద అల్లు అర్జున్ రియాక్షన్ - ప్రెస్‌మీట్‌లో ఏం చెప్పారంటే?
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కామెంట్స్ మీద అల్లు అర్జున్ రియాక్షన్ - ప్రెస్‌మీట్‌లో ఏం చెప్పారంటే?
అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కామెంట్స్ మీద అల్లు అర్జున్ రియాక్షన్ - ప్రెస్‌మీట్‌లో ఏం చెప్పారంటే?
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
Bajaj Chetak 35: కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ వచ్చేసింది - ధర ఎంతంటే?
కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ వచ్చేసింది - ధర ఎంతంటే?
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Smartphones Under Rs 15000: రూ.15 వేలలోపు బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయి?
రూ.15 వేలలోపు బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయి?
Sandhya Theatre Incident: రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి ప్రకటన
రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి ప్రకటన
Embed widget