Raghurama Letter : సీఎం జగన్ నుంచి ప్రాణహానీ - ఎంపీలు అందరికీ లేఖలు రాసిన రఘురామ !
సీఎం జగన్ వల్ల తనకు ప్రాణహాని ఉందని ఎంపీలదంరికీ రఘురామ లేఖ రాశారు. ఇటీవల జరిగిన పరిణామాలను అందులో వివరించారు.
Raghurama Letter : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని దేశంలోని ఎంపీలందరికీ .. వైఎస్ఆర్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ ద్వారా తెలిపారు. కొన్నాళ్లును తనను చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయని లేఖలో వివరించారు. సీబీసీఐడీతో కల్పిత కేసు పెట్టించి తనపై జరిగిన దాడి చేశారని లేఖలో పేర్కొన్నారు. ఇటీవల తనను హత్య చేసేందుకు తన ఇంటిపై రెక్కీ జరిగిందన్నారు. రైల్లో తన నియోజకవర్గం నర్సాపురానికి వెళ్తున్న సమయంలో తన ట్రైన్‌ను తగులబెట్టేందుకు ప్రయత్నించారని రఘురామ ఆరోపించారు. లేఖలో ఇటీవల జరిగిన పరిణామాలన్నింటినీ రఘురామ ఎంపీలకు వివరించారు.
Letter to all my Esteemed Parliamentary Colleagues about the life threat that I’m having from Andhra Pradesh CM Mr. YS Jagan Mohan Reddy. pic.twitter.com/jDlA0YpULJ
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) July 7, 2022
రఘురామ ఎంపీలందరికీ లేఖ రాయడం ఇదే మొదటి సారి కాదు. తన పుట్టిన రోజు నాడు హైదరాబాద్‌లో అరెస్ట్ తదనంతర పరిణామాలను వివరిస్తూ ఆయన లేఖ రాశారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో పార్టీలకు అతీతంగా తనకు మద్దతివ్వాలని లేఖలో కోరారు. దేశంలో తొలిసారి ఓ ఎంపీపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని తెలిపారు. అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని తాను సీబీఐ కోర్టులో పిటిషన్ వేశానన్న కక్షతోనే తనపై అక్రమ కేసులు బనాయించారని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు రఘురామ ఫిర్యాదు చేశారు.
గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో రఘురామకృష్ణరాజు అనూహ్యం ఎన్నికలకు ముందు వైఎస్ఆర్‌సీపీలో చేరి నర్సాపురం టిక్కెట్ తెచ్చుకున్నారు. విజయం సాధించారు. అయితే ఆరు నెలలకే ఆయన సొంత పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. దీంతో ఆయనను వైఎస్ఆర్‌సీపీ దూరం పెట్టింది. ఆ తర్వాత కొన్ని కక్ష సాధింపు చర్యలు చేపట్టడంతో ఆయన రివర్స్‌లో ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రారంభించారు. పార్టీకి బద్దుడినేనని సలహాలిస్తున్నానని ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వానికి కోపం తెప్పించాయి.
పార్టీతో విభేదించినప్పటి నుండి రఘురామకృష్ణరాజు తన నియోజకవర్గంలో అజుగు పెట్టలేకపోయారు. పలు రకాల కేసులు నమోదయ్యాయి. ఇటీవల తన నియోజకవర్గంలో అల్లూరి సీతారారామరాజు విగ్రహం ఆవిష్కరణ జరిగినా హాజరు కాలేకపోయారు. ఎంపీగా ప్రోటోకాల్ కూడా ఆయనకు దక్కలేదు. ఈ పరిణామాలతో వైఎస్ఆర్‌సీపీ అగ్రనాయకత్వంతో వివాదం మరింత ముదిరినట్లయింది.