అన్వేషించండి

ABP Desam Asking : "దేశం" అడుగుతోంది.. దేశ సంస్కృతిపై ఎందుకీ రాజకీయ "మాటల" దాడి !?

అసభ్యకరంగా విమర్శించుకుంటూ దేశ సంస్కృతిపై దాడి చేస్తున్నారు రాజకీయ నేతలు. ప్రత్యర్థులను కించ పర్చడానికి.. ప్రజల మధ్య విభజన తేవడానికీ ఈ మాటలనే వాడుకుంటున్నారు. దీన్నే ప్రశ్నిస్తోంది " ఏబీపీ దేశం "

మాట మంత్రం లాంటిది..! దానిని జాగ్రత్తగా పలకాలి..! ఏం పోగొట్టుకున్న వెనక్కి తెచ్చుకోవచ్చేమో కానీ మాట జారితే మాత్రం సాధ్యం కాదని పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు. అందుకే అక్షరాన్ని ఆయుధంగా కూడా చెబుతూ ఉంటారు.  అందుకే జాగ్రత్తగా వాడాలి. లేకపోతే.. దానివల్ల ఎదుటి వాళ్లకి ప్రాబ్లమ్.. సరిగ్గా వాడకపోతే.. మనకే ప్రాబ్లమ్..! ఇప్పుడు ఈ మాట గురించి ఎందుకు అంటే.. ప్రస్తుతం రాజకీయాల్లో  మాటల మ్యాటర్ మీటర్ దాటిపోయింది. మాట అదుపుతప్పి.. ఆమడదూరం వెళ్లిపోయింది. మాట ఎవరికైనా అదుపులో ఉండాలి. అందులోనూ ప్రజా జీవితంలో ఉన్నవాళ్లకి ఇంకా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే వారు ప్రజలకు ప్రతినిధులు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వాళ్లు. కానీ.. ఇక్కడేంటంటే.. అదుపు చేయాల్సిన వాళ్లే... అడ్డగోలుగా మాట్లాడేస్తున్నారు. ఇది ఈ మధ్య కాలంలో చాలా సాధారణం అయిపోయింది. ఇంకా చెప్పాలంటే.. కావాలనే చేస్తున్నట్లుగా అర్థం అవుతోంది.  

పుట్టుకనూ ప్రశ్నించే వాళ్లూ పాలకులవుతారని ఊహించామా ? ఆ దుస్థితి వచ్చేసింది !

అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్‌గాంధీపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. అందరూ తలదించుకునే మాటలు అవి. దేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఏ స్థాయికి దిగజారిపోయాం.. అనుకునేలా ఉన్నాయి. మాట అదుపు తప్పటం మాట అంటుంచితే.. దానిని తప్పు అని కూడా ఒప్పుకోలేని పరిస్థితికి వచ్చాం. హేమంత తన వ్యాఖ్యలకు బాధపడకపోగా.. సమర్థించుకున్నారు. అదేమంటే దానికి దేశభక్తిని ముడిపెడతారు. ఒక ప్రభుత్వ ప్రకటనపై ఆ పార్టీకి అనుమానం ఉందనుకుందాం.. లేదా రాజకీయం చేసిందనుకున్నాం.. దానికి సమాధానం అదేనా.. ? నిజంగా సైనిక శక్తిని పాటవాన్ని కించపరిస్తే.. దానికి తగిన సమాధానం చెప్పొచ్చు. కానీ ఇక్కడ పరిస్థితి ఎలా తయారైందంటే..  " ఈ దేశంలో అయితే నేషనలిస్టుగానూ.. లేకపోతే యాంటీ నేషనలిస్టుగానే ఉండాలి. మామూలు మనుషిగా ఎవరూ ఉండకూడదు." అన్న పరిస్థితి ఏర్పడింది. అంతలా డివిజన్ వచ్చేసింది... కాదు తెచ్చేశారనుకోవాలి.

అలా అన్నా పశ్చాత్తాపం లేకపోవడమే అసలైన పతనానికి నిదర్శనం  ! 
 
ఈ ఒక్క సారే కాదు చాలా సందర్భాల్లో ఇలాగే జరుగుతోంది. కొన్ని నెలల కిందట ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరిగిందో చూశాం..! చంద్రబాబునాయుడి కుటుంబం గురించి.. అసెంబ్లీలోనే అనుచిత వ్యాఖ్యలు చేశారు.  దేశంలోని సీనియర్ రాజకీయ నేతల్లో ఒకరైన  చంద్రబాబు బహిరంగంగానే కంటతడి పెట్టారు. హిమంత విషయంలోనూ.. అప్పుడు చంద్రబాబు విషయంలోనూ అవతలి వైపు నుంచి తప్పు చేశాం అనే సమాధానం రాలేదు. ఒకవేళ ఆవేశంలో మాటతూలారేమో.. అనుకున్నా.. తర్వాత కూడా వాళ్లు స్పందించడం లేదంటే.. అది ఇంటెన్షనల్‌గా చేస్తున్నట్లే అని అర్థం చేసుకోవచ్చు. 

కుల, మతాల మధ్య చిచ్చు పెట్టే మరో రకమైన  భాషా ప్రయోగాలూ అధికమే ! 

తెలంగాణలో కుటుంబాలను అనకపోయినా.. వ్యక్తిగత దూషణలు తక్కువేం కాదు. అధికార , ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు గట్టిగా మాటలు విసురుకునే వాళ్లే.  అయినా రాహుల్‌గాంధీ పై చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసన వచ్చింది. తెలంగాణలో కూడా కేసులు నమోదు అయ్యాయి. బీజేపీ సైలెంట్‌గా ఉన్నప్పటికీ మిగిలిన పార్టీలు ఖండించాయి. కాంగ్రెస్ తో దూరంగా ఉండే కేసీఆర్‌ కూడా వ్యతిరేకించారు.  సాధారణంగా ఈ ద్వేషం రెండు రకాలుగా ఉంటోంది.  ఒకటి ఇలా అడ్డూ అదుపూ లేకుండా నోటికొచ్చింది.. మాట్లాడ్డం ..రెండోది ప్రాంతాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టేలా ద్వేషపూరిత ప్రసంగాలు చెయ్యడం. ఈ మధ్య కాలంలో ఇది ఎక్కువైంది. 

రెండో విషయంలోఅంటే మతాల మధ్య చిట్టు పెట్టే అంశాల్లోనూ రెండు దారులున్నాయి. ఒక వర్గంలో అతివాద గ్రూపు.. తమ మతం , తమ రాజ్యం కోసం నేరుగా ఉగ్రవాద కార్యకలాపాలే నడుపుతున్నాయి. అందులో కొంచం తీవ్రత తక్కువుగా ఉన్నవాళ్లు.. తమ ప్రార్థనామందిరాల్లో.. మత సభల్లో విద్వేష ప్రసంగాలు చేస్తుంటారు. ఇవన్నీ ఎలాగూ నివేధం కాబట్టి.. దానిని ఎదుర్కొంటారు.  అయితే డెమాక్రటిక్ ఫ్రేమ్‌వర్క్‌లో జరుగుతున్న దాడి గురించి ఇప్పుడు ఎక్కువ చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత..మెజారిటీయే .. అధారిటీగా చెల్లుబాటు అవుతోందనే విమర్శలు ఎక్కువయ్యాయి. దానికి దాఖలాలు ఎక్కడ పడితే అక్కడ కనబడుతుంటాయి. కిందటి డిసెంబర్‌లో హరిద్వార్‌లో  చూస్తే .. ఓ ఆధ్యాత్మిక సభలో ఆ సాధువు.. ఓ వర్గాన్ని పూర్తిగా నిర్మూలించాలన్నారు.  జనవరిలో ఈసారి చత్తీస్‌గడ్.. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం  రాయ్‌పూర్‌లో  ఓ సమ్మోళనంలో ఓ వ్యక్తి ఇదే మాట వాడారు. రాజకీయాలకొచ్చేసరికే. అన్ని పార్టీలకు ఓట్లే ముఖ్యం. కొన్ని పార్టీలు.. అచ్చంగా ఇదే అజెండాతో రాజకీయం నడుపుతుంది. కొన్నిపార్టీలు ప్రాంతాలను బట్టి.. సందర్భాన్ని అవసరాన్ని బట్టి నడుపుతాయి. ఇక్కడ బీజేపీనే విమర్శించడం లేదు..  కాంగ్రెస్ కూడా ఏమీ తక్కువ కాదు. చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ కూడా బీజేపీ తరహా హిందూ రాజకీయాలు చేస్తోందని అక్కడి కార్యక్రమాలు చూసేవారికి తెలుస్తూనే ఉంది.  

ఇక యూపీలో ఓటు వేయకపోతే.. బుల్డోజర్లతో తొక్కిస్తాం అన్న రాజాసింగ్‌ కు ఈసీ నోటీసులు ఇచ్చింది. ఇదే హైదరాబాద్‌కు చెందిన ఓ పార్టీ నేత  అక్బరుద్దీన్ ... కొన్నాళ్ల కిందట నిజామాబాద్‌లో చేసిన మత పరమైన విద్వేష ప్రసంగం చూశాం. అది కేసు నడుస్తోంది. దీనిని అదుపు చేసే అవకాశం లేదా.. అంటే.. ఉంది.  కానీ పవర్‌ మళ్లీ రాజకీయం దగ్గరే ఉంది. రాజకీయమే తప్పు చేస్తూ.. ఆ తప్పుకు శిక్ష వేసే పవర్‌ను కూడా తమ దగ్గరే ఉంచుకుంది. అందుకే అధికారంలో ఉన్న వారే తప్పులు చేస్తున్నారు. ఇతరులకు ఆ అవకాశం లేదు. ఇవాళ అధికారంలో ఉన్న వారు అలా అంటే.. రేపు అధికారంలోకి వచ్చే వారు అంతకు మించి చేస్తారు. నువ్ బ్యాడ్ అయితే ఐ యామ్ యువర్ డాడ్ అని నిరూపిస్తారు. లేకపోతే చేతకాని వాళ్లంటారు. ఈ పరిస్థితి ఎలా మారిపోతుంటే.. చివరికి పతనావస్థకు చేరుతుంది తప్ప.. మెరుగైన పరిస్థితికి వచ్చే అవకాశమే ఉండదు. 

ఓసారి మిస్‌ కాండక్టుకు ఏం శిక్షలు ఉన్నాయో చూద్దాం.. 


· Section 153B IPC  జాతీయ సమగ్రతకు భంగం కలిగేలా ప్రసంగాలు చేస్తే..  Section 295A IPC   , 298 IPC ఉద్దేశ్య పూర్వకంగా మత విద్వేషాలు రెచ్చగొట్టిన మత పరమైన నమ్మకాలను అవమానించినా చర్యలు తీసుకోవచ్చు. . ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం రైట్టూ స్పీచ్కు అడ్డంకి కలిగిస్తే.. 8 ఏళ్లు పోటీకి అనర్హులు. 123,125 సెక్షన్లు మత పరమైన రెచ్చగొట్టే ధోరణులను అవి నిరోధిస్తున్నాయి.  కేబుల్ టివి, సినిమాటోగ్రఫీ చట్టాలు నియంత్రిస్తాయి. CRPCలో పలు సెక్షన్లు జిల్లా మెజిస్ట్ట్రేట్లు, ఎమ్మార్వోలకు కూడా పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్అయితే..  చర్యలు తీసుకునే అధికారం ఇచ్చింది. అసలు ఎవరి పర్మిషన్ లేకుండా... సెక్షన్ 155 CRPC ప్రకారం పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 

ఎన్నో శిక్షలున్నా .. చట్టం అధికారంలో ఉన్న వారికి చుట్టమే ! 

ఇన్ని ఉన్నా.. మనం చెప్పుకున్నట్లు అసలు పవర్‌ వాళ్ల దగ్గరే ఉంది. కీ వాళ్లదగ్గరే.. ఉంది. రాజకీయ అజెండాలకు తగ్గట్లుగా ఈ ప్రసంగాలు మారిపోతున్నాయి. దేశంలోని నిజమైన ప్రజాస్వామిక వాదులను కలవరపరిచే విషయం ఇది. దేశవ్యాప్తంగా ఇలాంటి ధోరణి పెరిగి పోతుందని లా కమిషన్ ఎప్పుడో ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి అడ్డుకట్ట వేయాలని కూడా సూచనలు చేసింది. అయినా ఎలాంటి ప్రయోజనం లేదు. ఆ సూచనలు చేసినప్పటి నుంచే ఇవి బాగా పెరిగిపోయాయి 2015-2020 మధ్య .. నాలుగురెట్లు .. హేట్‌ స్పీచ్‌ కేసులు పెరిగాయి. అంటే పరిస్థితి ఎలా ఉందో చూసుకోవచ్చు.  భిన్నత్వంలో ఏకత్వం అని మనం ప్రపంచానికి సందేశం ఇస్తున్నాం.. అనేక మతాలు, కులాలు వర్గాలు కలిసి ఉంటున్నాయంటున్నాం.  కానీ ఎక్కడిక్కకడ కొట్టుకు చస్తున్న పరిస్థితి ఉంది. 

ఒక మత రాజ్యం చేయాలని.. కొన్ని మతాలు అనుకోవడం..  మెజారిటీ పెత్తనం ఉండాలని ఇంకొకరు అనుకోవడం..  పార్టీకి మేలు చేయడానికి ... ఏదైనా మాట్లాడటం..పార్టీలో తమ నేతకు మేలు చేయడానికి మళ్లీ వ్యక్తిగతంగా మాట్లాడటం.. ఒక మతంలో ఒక శాఖను అవమానించడం..  ఇలాంటి వికృతాలన్నీ ఇప్పుడు చోటు చేసుకుంటున్నాయి. రీసెంట్ గా హైదరాబాద్‌లో భారీ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్వామీజీ చూడండి.. చివరి రోజు ఆయన మాట్లాడిన మాటలు ఒక వర్గాన్ని బాధించాయి. ఒక శాఖను కించపరిచినట్లుగా ఉన్నాయి. సద్బావన, సమతా, మమతా అన్నీ ఆ మాటలతో గాలికి కొట్టుకుపోయాయి. రాజకీయ పార్టీలు ఎలాగూ దారితప్పాయి. ప్రజల్లో పరివర్తన ఒక్కటే మార్గం.. మన దేశంలో పరిస్థితి ఏంటంటే.. కులం, మతం పేరుతో ప్రజలను ఇన్ఫ్యూయెన్స్ చేయడం తేలిక . 

ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడే అసలైన మార్పు !

నిజానికి అక్షరాస్యత లేని వారిలోనే చైతన్యం ఎక్కువ ఉంది.  దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలోనే కులాలు, మతాలకు అతీతంగా ఉద్యమాలు నడిచాయి. ఎంత భారీగా నడిచాయి అంటే.. చదువు లేకపోయినా అభ్యుదయ భావాలు మాత్రం మెండుగా ఉండేవి. కానీ ఇప్పుడు చదువుకున్న వారు ఎక్కువయ్యారు. కానీ అభ్యుదయభావాలు ఉన్న వారు లేరు. అంతా కుల, మత జాడ్యాలతో కునారిల్లిపోతున్ారు.  గంగా మైదానంలోని రాష్టాల్లో అక్షరాస్యత, ఆదాయం తక్కువ. ఆర్థికాభివృద్ధి అక్కడ జరగాల్సి ఉంది. ప్రపంచంలోనే ఎక్కువ మంది పేదలు నివసించే ప్రాంతాలు ఇవి. అక్కడ ప్రజల ఆలోచనలు .. ఆర్థికంగా ఎదగడం అన్నదానిపై ఉండనే ఉండవ్.. ఈ రాజకీయ అజెండాలు అలా సెట్‌ చేశాయి. విద్యా పరమైన , ఆర్థిక పరమైన ఎదుగదల లేనంత కాలం అలాగే ఉంటుంది. ఈ రాజకీయాలు మారవని తెలుసు.. అయినా సరే.. ప్రజల ఆకాంక్షను తెలియజేసేలా దేశం అడుగతోంది. రాజకీయ నాయకులని నిగ్గదీసి అడుగుతోంది.. మారతారా ? మారరా ? 

ఏబీపీ దేశం అడుగుతోంది.. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Embed widget