అన్వేషించండి

Somu Veerraju: ప్రధాని మోదీకి నిజంగానే ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పేరు తెలియదా ! అసలేం జరిగిందంటే !

ఆ సమావేశంలో ఉన్నది కోర్ కమిటీ సభ్యులే. అందులో ఏం జరిగిందనేది మీడియాకు లీక్ చేసిందీ కోర్ కమిటీలోని నేతే. సోము వీర్రాజు అంటే గిట్టని వారే ఆయన పై ఈ రకంగా ప్రచారం చేశారని ఆ పార్టీ నేతలే అంటున్నారు.

ఏపీ రాజకీయాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష్యుడు సోము వీర్రాజు అప్పుడప్పుడు హాట్ టాపిక్‌గా మారుతుంటారు. తాజాగా ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో కూడా ఆయన రెండు సార్లు హైలెట్ అయ్యారు. ఒకటి విశాఖ కూడళ్లలో బీజేపీ జెండాలు మున్సిపల్ సిబ్బంది తీసేస్తుంటే వీర్రాజు ఆవేశంతో ఊగిపోయారు. జెండాలు తీసేయడంపై బాగా కొప్పడి, అధికారులను నాలుగు చివాట్లు కూడా పెట్టారు. ఇక రెండోది ఆయనకు తెలియకుండా ఆయన వార్తల్లోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ హైలెట్ అయ్యారు. ఇందులో అసలు సోము వీర్రాజు పాత్ర ఎంత ఉందని లోతుగా పరిశీలిస్తే అనేక అంశాలు బయటికొచ్చాయి. 

మోదీకి సోము వీర్రాజు పేరు తెలియదా ? 
ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన తర్వాత నుంచి సోము వీర్రాజు అంటే గిట్టనివారో, లేక ఆయన ప్రత్యర్థి పార్టీవారో ఆయన్ని తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. అదేంటంటే ప్రధాని మోదీకి, బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పేరు కూడా తెలియదంట, పేరు కూడా తెలియని నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడా? అని సోషల్ మీడియాలో కామెంట్స్, మీమ్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. వీటిని ఆయన శత్రు వర్గం బీభత్సంగా సర్కులేట్ చేసింది. ఈ అంశంపై అనేక చర్చలు కూడా జరిగాయి. ఇంతకీ అసలు ఏం జరిగిందని కోర్ కమిటీలో పాల్గొన్న కమలంపార్టీ నేతలతో ఏబీపీ దేశం ఫోన్ లో మాట్లాడగా వారు ఆసక్తికరమైన అంశాలను తెలిపారు.  
మొన్నటి ప్రధాని మోదీ విశాఖ పర్యటనలో మొదటి రోజు కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ కోర్ కమిటీ సమావేశంలో ప్రధాని మోదీతో పాటు రాష్ట్రానికి చెందిన పార్టీ కోర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సమావేశ స్థలం చిన్నదిగా ఉండటంతో అంతా ఇరుకు ఇరుకుగానే కూర్చున్నారు. మోదీ అందర్నీ వారికి వారే పరిచయం చేసుకోవాల్సిందిగా కోరారు. దీంతో మోదీ పక్కన కూర్చున్న వ్యక్తి సోము వీర్రాజు కావడం, ఆయనతోనే పరిచయ కార్యక్రమం ప్రారంభమైంది. సోము వీర్రాజు పరిచయం తర్వాత ప్రధాని మీరు రాజకీయాలేనా? ఇంకా ఏమైనా చేస్తుంటారా? అని ప్రశ్నించారు. ఆ తర్వాత ఒక్కొక్కరూ పరిచయ కార్యక్రమం పూర్తయింది. ఆ తర్వాతే ప్రధాని రాష్రంలోని జిల్లాల గురించి, మండలాల గురించి సోము వీర్రాజుని అడగడం ఆయన తప్పుడు సమాచారం అందించడం, తడబడటం చక చకా జరిగిపోయాయి. అయితే మోదీతో భేటిలో సోము వీర్రాజును కూడా మోదీ గుర్తుపట్టలేదు, అంటే ఆయన ఏ స్థాయిలో ఉన్నారంటూ వాట్సాప్ యూనివర్శిటీలో పోస్టులు వైరల్ అయ్యాయి. అంతే కాదు రాష్ర అధ్యక్ష్యుడుకి జిల్లాలు, మండలాలు ఎన్నో తెలియవా? అంటూ కొంత మంది ఘాటు విమర్శలు చేశారు.

Somu Veerraju: ప్రధాని మోదీకి నిజంగానే ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పేరు తెలియదా ! అసలేం జరిగిందంటే ! 

మోదీ - సోము వీర్రాజు గతంలో దోస్తులే...
ఆ సమావేశంలో ఉన్నది కోర్ కమిటీ సభ్యులే. అందులో ఏం జరిగిందనేది మీడియాకు లీక్ చేసిందీ కోర్ కమిటీలోని నేతలే. సోము వీర్రాజు అంటే గిట్టని వారే ఆయన పై ఈ రకంగా ప్రచారం చేశారని ఆ పార్టీ నేతలే అంటున్నారు. వాస్తవానికి ఆర్ఎస్సెస్ మీటింగ్‌లో ఎవరైనా సరే వారి పేరు, హోదా పరిచయం చేసుకోవాలి. అదే సాంప్రదాయం ఆ రోజూ కూడా జరిగింది. అయితే ఇక్కడ సోము వీర్రాజు ముందు వరసలో ఉండటం. ఆయన  దగ్గర నుంచే పరిచయ కార్యక్రమం ఉండటం, ఆయన కూడా అమాయకంగా ఐ ఆమ్ సోము వీర్రాజు, ఏపీ ప్రెసిడెంట్ అని చెప్పారంట. అలా చెప్పొచ్చా? చెప్పకూడదా? అంటే రెండు కరెక్ట్. మరి ఆ మాటకు వస్తే  సీఎం రమేష్ కూడా పరిచయం చేసుకున్నారు. పురందశ్వేరి, జీవీఎల్, సుజనా చౌదరి కూడా పరిచయం చేసుకున్నారు. వీళ్లు మోదీకి తెలియని వారా? అనే వారూ లేకపోలేదు. ప్రధాని మోదీకి ఏపీ బీజేపీ ఛీప్ సోము వీర్రాజుకి గతంలో చాలా పరిచయం ఉందని, ఎన్నో ఏళ్లనుంచి ఎన్నో కార్యక్రమాల్లో వారు కలిసి పాల్గొన్నారని ఏపీ బీజేపీ నేతలు అంటున్నారు. అంతేకాదు మోదీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కాకముందే సోము వీర్రాజుతో పరిచయం ఉందంటూ ఒక ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

సోము వీర్రాజును బలహీన పర్చేందుకే - జీవీఎల్ 
ఇక ఈ విషయంపై బీజేపీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ కూడా స్పందించారు.  "కోర్ కమిటీ సమావేశంలో జరిగిన విషయాలు బయటకు చెప్పం. కానీ కొన్ని మీడియాలు అక్కడ ఏదేదో జరిగిందని కొందర్ని టార్గెట్ చేస్తూ అసత్యాలు రాశారు.  సోము వీర్రాజు గార్ని మీ పేరేమిటి అని అడిగారని రాశారు. ఇది వీర్రాజును బలహీన పరచటానికి బురద చల్లటానికి రాసిన రోత. మోదీ వద్దకు వెళ్లిన వారు మొదట సంప్రదాయం ప్రకారం తమ పేర్లు హోదాలు చెప్తారు. అంతకు ముందు ఎయిర్ పోర్టులో సోము వీర్రాజు స్వాగతం పలికి రోడ్ షోలో పాల్గొన్నారు కదా?  సోమూజీ మీరు ఏం చేస్తుంటారు అని మోదీజీ అడిగితే 42 ఏళ్లుగా పార్టీకి అంకితం అయ్యానని సోము వీర్రాజు చెప్పారు. నా మాదిరిగానేనా! అని మోదీ వ్యాఖ్యానించారు. ఇంత మంచి అభినందన‌ ఇక ఎవరికైనా లభిస్తుందా? " - ఎంపీ జీవీఎల్ 

రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదల సంగతి ఏమో కానీ కనీసం పార్టీని వార్తల్లో ఉంచకపోయినా తమ రాష్ట్ర అధ్యక్షుడు అప్పుడప్పుడు వార్తల్లో హాట్ టాపిక్ మారడం మంచిదే అనే నేతలు కూడా ఉన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..
చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి ChatGPT ప్రిడిక్షన్ ఇదే..
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Manmohan Singh: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
TG TET 2024 Halltickets: తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP DesamPushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP DesamPir Panjal Rail Tunnel | ఇండియాలో లాంగెస్ట్ రైల్వే టన్నెల్ ఇదే | ABP Desamరాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్‌ ప్రారంభం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..
చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి ChatGPT ప్రిడిక్షన్ ఇదే..
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Manmohan Singh: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
TG TET 2024 Halltickets: తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
Osamu Suzuki : భారత్‌కు మారుతీ కారు పరిచయం చేసిన వ్యక్తి మృతి- సంతాపం తెలియజేసిన ప్రధాని
భారత్‌కు మారుతీ కారు పరిచయం చేసిన వ్యక్తి మృతి- సంతాపం తెలియజేసిన ప్రధాని
Rohit Sharma News: రోహిత్ కెప్టెన్సీపై మాజీల మండిపాటు - ఆ విషయంలో విఫలమయ్యాడని విమర్శలు, టెస్టు కెరీర్ ముగింపునకు వచ్చేసినట్లేనా?
రోహిత్ కెప్టెన్సీపై మాజీల మండిపాటు - ఆ విషయంలో విఫలమయ్యాడని విమర్శలు, టెస్టు కెరీర్ ముగింపునకు వచ్చేసినట్లేనా?
Charith Balappa Arrested: లైంగిక వేధింపులకు పాల్పడిన టీవీ నటుడు - అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో అరెస్ట్
లైంగిక వేధింపులకు పాల్పడిన టీవీ నటుడు - అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో అరెస్ట్
Embed widget