అన్వేషించండి

Pawan Kalyan Home Minister Portfolio: పవన్ కల్యాణ్ ఆఫీసులో సోషల్ మీడియా కేసులపై స్పెషల్ టాస్క్ ఫోర్స్.. హోంశాఖ బాధ్యతలకు ఇది సంకేతమా?

Pawan Kalyan Social Media Task Force: ఏపీలో సోషల్ మీడియా అరాచకాలను కట్టడి చేసేందుకు పవన్ కళ్యాణ్ తన ఆఫీసులోనే ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ పరిణామం ఆయనకు హోంశాఖ దక్కబోతోందనే సంకేతమా?

Andhra Pradesh Cabinet Reshuffle 2026:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం సోషల్ మీడియా అరాచకాల కట్టడి  అత్యంత హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్నేళ్లుగా భావప్రకటన స్వేచ్ఛ  పేరుతో నకిలీ ఖాతాల వెనుక దాక్కుని మహిళల వ్యక్తిత్వాలను కించపరచడం,  చంపుతామని హెచ్చరించడం,  మతవిద్వేషాలు రగల్చడం వంటి ధోరణులపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అయితే, ఈ మొత్తం వ్యవహారాన్ని హోంశాఖ పరిధిలో కాకుండా.. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేరుగా తన చేతుల్లోకి తీసుకోవడం ,  తన అధికారిక కార్యాలయంలోనే ఒక ప్రత్యేక  టాస్క్ ఫోర్స్  విభాగాన్ని ఏర్పాటు చేయడం   ఆసక్తి రేకెత్తిస్తోంది.  ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూజ్ కాదు అని పవన్ స్పష్టం చేస్తూ, ఈ విభాగాన్ని సైబర్ క్రైమ్ పోలీసులతో సమన్వయం చేస్తుండటం ఏపీ పాలిటిక్స్‌లో సరికొత్త చర్చకు దారితీసింది.

హోంశాఖ కోరుకుంటున్న పవన్ 

పవన్ కళ్యాణ్ గత రెండేళ్లలో అనేక బహిరంగ సభల్లో.. "నేనే గనుక హోంమంత్రిని అయితే శాంతిభద్రతలు ఎలా ఉంటాయో చూపిస్తా" అని వ్యాఖ్యానించారు.  ఆయనకు హోంశాఖ నిర్వహించాలనే బలమైన ఆకాంక్ష ఉందనేది ఓపెన్ సీక్రెట్. ప్రస్తుతం ఆయన వద్ద పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ-పర్యావరణ శాఖలు ఉన్నప్పటికీ.. శాంతిభద్రతలకు సంబంధించిన అత్యంత కీలకమైన సోషల్ మీడియా వింగ్ యాక్షన్‌ను ఆయన లీడ్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం ఆఫీసులో ఏర్పాటైన ఈ నిఘా విభాగం క్షేత్రస్థాయి నుండి డేటాను సేకరిస్తూ, లీగల్ ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదులు పంపుతుండటంతో.. ఇప్పటికే హైదరాబాద్, ఏపీ వ్యాప్తంగా పలువురు జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ వంటి వారి అరెస్టుల పర్వం ప్రారంభమైంది.
 
 చంద్రబాబు ఫుల్ సపోర్ట్ 

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారాన్ని పవన్ కళ్యాణ్‌కు పూర్తిగా అప్పగించడం వెనుక ఒక పెద్ద రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. వైసీపీ సోషల్ మీడియా వింగ్ గతంలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని, ఆయన కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తున్నందున  ఆ అరాచక నెట్‌వర్క్‌ను కూకటివేళ్లతో పాతరేసే బాధ్యతను పవన్‌కే ఇస్తే వంద శాతం ఫలితం ఉంటుందని బాబు భావించి ఈ ఛాన్స్ ఇచ్చారని టాక్. ఈ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ద్వారా పవన్ కళ్యాణ్ కొత్త భారతీయ న్యాయ సంహిత, ఐటీ చట్టం 2000 లోని కఠినమైన సెక్షన్లను ఉపయోగించి సైబర్ నేరగాళ్ల ఆట కట్టిస్తున్నారు. నేరస్థులకు కులం, మతం, రాజకీయ అనుబంధం ఉండదని.. తప్పు చేసి తప్పించుకోవడానికి పొలిటికల్ స్క్రీన్స్ వెనుక దాక్కుంటే ఊరుకునేది లేదని ఆయన ఇచ్చిన వార్నింగ్ క్షేత్రస్థాయిలోకి బలంగా వెళ్లింది. ఒక రకంగా హోంశాఖ అధికారికంగా తన వద్ద లేకపోయినా.. డిప్యూటీ సీఎం హోదాలోనే ఒక పవర్ ఫుల్ హోంమంత్రి తరహాలో పవన్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు.

కేబినెట్ మార్పు చేర్పులు జరిగితే పవన్ కు హోంశాఖ 

 త్వరలోనే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్‌లో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది.   ప్రస్తుతం శాంతిభద్రతల విషయంలో పవన్ చూపిస్తున్న అగ్రెసివ్ అప్రోచ్ వల్ల  రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్‌కు అధికారికంగానే హోంశాఖ  ను అప్పగించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన ఆఫీస్ వేదికగా నడుపుతున్న ఈ యాంటీ-సైబర్ అబ్యూస్ డ్రైవ్ కేవలం సోషల్ మీడియా క్లీనింగ్‌కే పరిమితం కాలేదు. ఇది ఆయన భవిష్యత్తు పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్‌కు, ముఖ్యంగా హోంశాఖ బాధ్యతలను స్వీకరించడానికి ఒక లీట్‌మస్ టెస్ట్ లాంటిదని అనుకోవచ్చు.  ఒకవేళ వచ్చే మంత్రివర్గ విస్తరణలో పవన్‌కు హోంశాఖ దక్కితే.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్, సైబర్ క్రైమ్ నియంత్రణ మరింత కఠినంగా మారడం ఖాయం. ప్రస్తుతం ఆయన ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ సృష్టిస్తున్న ప్రకంపనలు.. ఆయన అధికారిక హోంమంత్రి పదవికి బలమైన పునాదిగా మారుతున్నాయని  జనసైనికులు భావిస్తున్నారు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
BJP All Cells Joint Coordinator: విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !
విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?
Embed widget