NTR centenary celebrations : తొలి ఎన్నికల్లో ఎన్టీఆర్ సాధించిన విజయాల విశేషాలు ఇవిగో !
తొలి ఎన్నికల్లో ఎన్టీఆర్ సాధించిన విజయాల విశేషాలు ఇవే
NTR centenary celebrations : 1983 జనవరి 5వ తేదిన జరిగిన పోలింగ్ లో తెలుగుదేశం సూపర్ హిట్ అయింది. నిలుచున్న అబ్యర్లులను చూసి ఎవరూ ఓటు వేయలేదు. ప్రతి ఓటరు తాను ఎన్స్‌టి.ఆర్. కే ఓటు వేస్తున్నాననుకుని వేశారు. ప్రతిపక్షం వారి అంచనాలను, ఇతరుల నెగెటివ్ అంచనాలను మించి ఆ ఎన్నికల్లో తెలుగుదేశం 203 స్పానాలను గెలుచుకుంది. చాలా ప్రాంతాల్లో ఎన్నికల్లో ఎన్.టి.ఆర్. నిలబెట్టిన రాజకీయ అనుభవం లేని నాయకులు కూడా గెలిచారు. అభ్యర్తుల్లో మూడు వంతులకు పైగా కొత్తవారే. ప్రజాస్వామ్య చరిత్రలో ఇదో అపూర్వఘట్టం. చాలా నియోజకవర్గాలలో వారెవరో కూడా తెలియని నాయక్తులు గెలిచారు.
తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన వారిలో అత్యధికులు కొత్తవారు
టీడీపీ తరపున పోటీ చేసిన వారిలో అత్యధికులు యువకులు, విద్యాధికులు, 125 మంది పట్టభుద్రులు, 20 మంది వైద్య పట్టభద్రులు, 8మంది ఇంజనీర్లు, 28మంది పోస్తు గ్రాడ్యుయేట్లు, కేవలం 9 నెలల [ప్రాయంగల ప్రాంతీయ పార్టీ, వందేంద్ల చరిత్రగల జాతీయపెర్తీని చిత్తు చిత్తుగా ఓడించింది. ఎన్.టి.ఆర్. విశ్వవిఖ్యాత ఎన్నికల విజేతగా విరాజిల్లారు. కనివిని ఎరుగని ప్రజారాజకీయాలకు ఎన్.టి.ఆర్. నాంది పలికారు. రాజ్‌భవన్ ను ప్రజలమధ్యకు తెచ్చారు. రాజకీయాలకు కొత్త నిర్వచనం పలికారు, ఆంధ్రప్రదేశ్ లో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. అశేష ప్రజల సమక్షంలోనే ఎన్.టి.ఆర్. మంత్రి వర్గం ముందెన్నడూ లేనివిధంగా లాల్ బహదూర్ స్టేడియంలో 15మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేస్తుంటే స్టేడియం, లక్షలాది ప్రజల ఆనందేతిరేకంతో దద్దరిల్లింది.
కౌంటింగ్ రోజు టెన్షన్ టెన్షన్ !
కౌంటిం రోజు సాయంత్రం మొదటి ఫలితం షాద్ నగర్... కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ శ్రేణుల ఉత్సాహంగా ఉన్నారు. రేడియో వార్తల్లో ఫలితాల సరళి వెల్లడవుతున్నది. ఒక్కో జిల్లా వారీగా వరుసగా ఆధిక్యతలు చెబుతూ వస్తున్నారు. జిల్లాలకు జిల్లాలు తుడుచిపెట్టుకుపోయాయి. ఎన్టీవోడి దెబ్బకు వేళ్ళూనుకున్న కాంగ్రెస్ మహావృక్షాలు కూలిపోయాయి. ఒక్కో నియోజక వర్గం ఆధిక్యతలు చెబుతుంటే జనం స్పందన జేజేలు..ప్రత్యర్ధుల హాహాకారాలు..ఆర్తనాదాలు. ఎన్టీఆర్ ప్రభంజనాన్ని ...ఈ రీతి విజయాన్ని వారు ఊహించలేదు. దాదాపు అర్ధరాత్రికే మూడింట రెండొంతులు పైగా స్దానాలు కైవసం చేసుకుంది తెలుగు దేశం పార్టీ. డాక్టర్లు..ఇంజినీర్లు.. లాయర్లు..పట్టభద్రులు.. బడుగుబలహీన వర్గాలకు చెందిన కొత్తరక్తం రాజకీయాల్లో అరంగేట్రం చేసారు. ఆంధ్రప్రదేశ్ ఫలితం అప్పుడు దేశ వ్యాప్తంగా పెను సంచలనం. లెక్కింపు మొత్తం పూర్తయ్యేసరికి తెలుగు దేశ పార్టీ 202 స్థానాలు గెలుచుకుని ఘన విజయం సాధించింది.
అప్పట్లో రేడియోల్లోనే సమాచారం
ఎన్టీఆర్ ప్రభంజనంతో కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది పాట రేడియోలో వేశారు. అన్నగారి పాటలతో హోరెత్తించారు. వేషాలు వేసుకునేవాడంటూ హేళన చేసిన ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఏపీ ఫలితాలు చూసి షాకయ్యారు. 1983 జనవరి 9న ఆంధ్రప్రదేశ్ లో తొలి కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నందమూరి తారకరామారావు. దీంతో తెలుగురాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ తో నవశకం ప్రారంభమయింది.బడుగుబలహీన వర్గాల వేదికయింది. తెలుగు వాడి ఆత్మగౌరవానికి..ఆత్మవిశ్వాసానికి ప్రతీక అయింది. ఇప్పటి లాగే అప్పుడు కూడా విషపుత్రికలు అబద్దపు పత్రికలు ఉండేవి. దాదాపు అన్ని పత్రికలు..ప్రధాన శీర్షికలు..తెలుగుదేశం ప్రభంజనం..తెలుగుదేశం సూపరు హిట్టు అని పెడితే..ఒకటి రెండు పత్రికలు..ఇంకా లెక్కింపు కొనసాగుతున్నట్టు.. టీడీపి ఘనవిజయాన్ని తక్కువ చేసి చూపించటానికి ప్రయత్నం చేసారు.
లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షం
1982లో ఎన్టీఆర్ తన చైతన్య రధంపై సుడిగాలి పర్యటన జరిపి ఎన్నికల ప్రచారం కొనసాగించారు. సినిమా రంగంలో సాధించిన అనితరసాధ్యమైన ఆదరణతో ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. సినిమావాళ్ళకు రాజకీయాలేమి తెలుసన్న అప్పటి ప్రధాని "ఇందిరా గాంధీ" హేళనకు గట్టి జవాబు చెప్పారు. ఏకంగా 202 అసెంబ్లీలో స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చారు. అంతే కాదు అప్పట్లో ఉన్న 42 లోక్‌సభ స్థానాలకుగాను 35 స్థానాలను గెలుచుకుని ప్రత్యర్థులను మట్టికరిపించింది తెలుగు దేశం పార్టీ. 1983లో దేశం మొత్తం మీద 544 లోక్‌సభ స్థానాలకుగాను 400 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెసు హవా కొనసాగుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించింది. అప్పటి లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షమయింది.