అన్వేషించండి

Nitish Kumar: హోం మంత్రికి కాల్‌ చేయండీ, సొంత శాఖనే మర్చిపోయిన నితీష్‌ కుమార్‌- సోషల్ మీడియాలో వైరల్

Nitish Kumar: సొంత శాఖనే మర్చిపోయిన నితీష్‌ కుమార్‌. హోం మంత్రికి కాల్‌ చేయండి అని అధికారులను కోరడంతో గందరగోళం

తను మంత్రిగా ఉన్న శాఖనే మర్చిపోయి కొద్దిసేపు గందరగోళానికి గురయ్యారు బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌. ఇటీవల పట్నాలో జరిగిన జనతా దర్బార్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ దర్బార్‌లోని ఓ సమస్య విని రాష్ట్ర హోం మంత్రికి ఫోన్‌ చేయండి అంటూ అధికారులను ఆదేశించారు. తానే హోంమంత్రిని అనే విషయం మర్చిపోవడంతో అధికారులకు ఏం చేయాలో అర్థంకాక కొద్దిసేపు తడబడ్డారు. తన శాఖను మర్చిపోవడమే కాకుండా హోం మంత్రితో నేను ఇప్పుడే మాట్లాడాలి వెంటనే ఫోన్‌ చేయండి అంటూ అధికారులకు గట్టిగా చెప్పారు. దీంతో గందరగోళం నెలకొంది.

నితీశ్‌ అలా అడిగే సరికి ఏం చేయాలో అర్థం కాని అధికారి రెండుసార్లు ఎవరికి కాల్‌ చేయాలి అని అడిగారు. దీంతో విసుగుచెందిన నితీశ్‌ కుమార్‌ పక్కన హాలులో కూర్చున్న మంత్రివైపు చూపిస్తూ తనను పిలవండి, తనకు ఫోన్‌ కలపండి అంటూ అధికారులకు చెప్పారు. సర్‌ ఆయన విజయ్‌ చౌదరి అని అధికారులు చెప్తారు. అవును ఆయనకే కాల్‌ చేయండి అని నితీశ్‌ వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో విషయం బయటకు వచ్చింది.

అయితే నితీశ్‌ పిలిచిన విజయ్‌ చౌదరి రాష్ట్ర ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ, పార్లమెంటరీ అఫైర్స్‌ మంత్రి. అయినప్పటికీ అధికారులు విజయ్‌ చౌదరికి ఫోన్‌ చేసి నితీశ్‌కు అందించారు. అప్పుడు మళ్లీ నితీశ్‌ అధికారులతో  ఎవరికి కాల్‌ చేశారు అని అడుగుతారు. వారు అక్కడ కూర్చున్న మంత్రి విజయ్‌ చౌదరికి అని చెప్తారు. అప్పుడు నితీశ్‌ మళ్లీ 'నో, ఆయన కాదు' అని అంటారు. మొత్తానికి నితీశ్‌ కుమార్‌ బాగా కన్ఫ్యూజ్‌ అయిపోయారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలోకి రావడంతో నితీశ్‌పై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. 

ముఖ్యమంత్రి సోమవారం పట్నాలో జరిగిన జనతా దర్బార్‌ లో పాల్గొని ప్రజల సమస్యలను విన్నారు. ఈ సమయంలో ఈ ఘటన జరిగింది. ఆయన దాదాపు 51 మంది సమస్యలను విని సంబంధిత అధికారులకు వాటిని పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget