Nara Lokesh: టీడీపీ - జనసేన 'జెండా' సభతో వారి గుండెల్లో రైళ్లు - స్పెషల్ వీడియో షేర్ చేసిన నారా లోకేశ్
AP Politics: టీడీపీ - జనసేన జెండా సభ కోట్లాది ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఈ క్రమంలో ఓ ప్రత్యేక వీడియోను షేర్ చేశారు.
Nara Lokesh Special Video on TDP And Janasena Jenda Meeting: తాడేపల్లిగూడెంలో బుధవారం జరిగిన టీడీపీ - జనసేన 'జెండా' సభ అరాచక పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. కోట్లాది ఆంధ్ర ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇచ్చిందని చెప్పారు. ఈ క్రమంలో సభకు సంబంధించి ట్విట్టర్ వేదికగా ఓ ప్రత్యేక వీడియోను పోస్ట్ చేశారు. 'ప్రజా అజెండా.. రాష్ట్ర ప్రగతి అజెండా.. టీడీపీ - జనసేన 'జెండా' సభ..' అని లోకేశ్ పేర్కొన్నారు.
ప్రజా అజెండా.. రాష్ట్ర ప్రగతి అజెండా.. టిడిపి-జనసేన 'జెండా' సభ. అరాచక పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన సభ. కోట్లాది జనాల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇచ్చిన సభ.#TeluguJanaVijayam #TDPJSPWinning #TDPJSPTogether #TDPJSPAlliance #AndhraPradesh pic.twitter.com/1RTj4KHmI9
— Lokesh Nara (@naralokesh) February 29, 2024
కాగా, బుధవారం టీడీపీ - జనసేన సభ అటు టీడీపీ ఇటు జనసేన శ్రేణులు, అభిమానుల్లో జోష్ నింపింది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు ఒకే వేదికపై ఉంటూ తమదైన శైలిలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. జనసేనకు 24 సీట్లేనా అంటూ విమర్శలు చేస్తున్న వారిపైనా పవన్ తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చారు. తనకు సలహాలు ఇచ్చేవాళ్లు వద్దని.. యుద్ధం చేసే వాళ్లే తనతో రావాలని పిలుపునివ్వడంతో స్పష్టమైన సందేశం పంపారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అలాగే, వైసీపీ ఇంఛార్జీల జాబితాపైనా లోకేశ్ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'తిక్కోడు తిరునాళ్లకు పోతే.. ఎక్కాదిగా సరిపోయిందట. అలా ఉంది వైసీపీ సమన్వయకర్తల జాబితాలు.' కన్ఫ్యూజన్ జగన్ అంటూ హ్యాష్ ట్యాగ్ తో లోకేశ్ ట్వీట్ చేశారు.
తిక్కొడు తిరునాళ్లకు పోతే.. ఎక్కా దిగా సరిపోయిందట..
— Lokesh Nara (@naralokesh) February 29, 2024
అలా ఉంది వైసీపీ వరుస సమన్వయకర్తల జాబితాలు.#ConfusionJagan #YCPAntham pic.twitter.com/shIOqeAdSD
లోకేశ్‍ను కలిసిన జలీల్ ఖాన్
టీడీపీ నేత జలీల్‍ఖాన్ గురువారం నారా లోకేశ్ ను కలిశారు. జలీల్ ను వెంట పెట్టుకుని కేశినేని చిన్ని ఆయన్ను కలిశారు. జలీల్ పార్టీ మారుతున్నారంటూ ఇటీవల ప్రచారం జరగ్గా.. దీనిపై ఆయన లోకేశ్ ను కలిసి క్లారిటీ ఇచ్చారు. టీడీపీలోనే ఉంటానని జలీల్ ఖాన్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింల మద్దతు కూడగట్టి తెలుగుదేశం పార్టీకి అండగా నిలబెడతానని చెప్పారు. జలీల్ రాజకీయ భవిష్యత్తుకు తనది హామీ అంటూ లోకేశ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఆలయాల సందర్శన
నారా లోకేష్ గురువారం మంగళగిరి నియోజకర్గంలోని పలు ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళగిరి పట్టణంలోని శ్రీశ్రీశ్రీ భద్రావతి సమేత శ్రీ భావనాఋషి స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట, ధ్వజ స్తంభం ప్రతిష్ట మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. పూజల అనంతరం అర్చకులు ఆయనకు తీర్ధప్రసాదాలు అందించారు. అంతకు ముందు తాడేపల్లి పట్టణంలోని ఆంజనేయ స్వామిని దర్శించుకుని లోకేష్ పూజలు చేశారు.
Also Read: Fake News Alert: ఏపీ ఎన్నికలపై ‘ఏబీపీ-సీఓటర్’ సర్వే పేరుతో నకిలీ పోస్ట్ - అది పూర్తిగా ఫేక్