News
News
X

Rahgurama : నీ దారిలో నువ్వు రా... నా దారిన నేను వస్తా - సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ సలహా !

భీమవరం సభకు రాకుండా సీఎం జగన్ తనపై కుట్ర చేస్తున్నారని ఎంపీ రఘురామ ఆరోపించారు. తన దారిలో తాను వస్తానన్నారు.

FOLLOW US: 

 

Rahgurama :  భీమవరంలో ఈ నెల నాలుగవ తేదీన జరిగే అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి నా దారిలో నేను వస్తా... నీ దారిలో నువ్వు రా అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణంరాజు సూచించారు. ప్రధాని మంత్రి పాల్గొనే సభలో ఒక ఎంపీ ని పాల్గొనకుండా అడ్డుకునేందుకు కుట్ర చేయడం సరికాదని హితవు పలికారు. చెప్పటం తన ధర్మమని, వినకపోతే 18వ తేదీ తర్వాత మీ కర్మం అంటూ వ్యాఖ్యానించారు.  

తన లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని భీమవరంలో, అది తన ఇంటికి కూతవేటు దూరంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధానమంత్రి హాజరవుతుంటే, ఎంపీగా ఆ కార్యక్రమంలో పాల్గొనడం తన బాధ్యత అని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. తాను సభలో పాల్గొంటే ముఖ్యమంత్రికి వచ్చిన ఇబ్బంది ఏమిటో.. అర్థం కాలేదన్నారు. తాను ఆయన కంటే పొడుగ్గా ఉన్నానని భావిస్తే, దూరంగా నిలుచుంటానని... సంస్కారవంతుడిని కాబట్టి ముఖ్యమంత్రి ఎదురుపడితే నమస్కారం పెడతానని వెల్లడించారు. నమస్కారం పెట్టిన వారికి ప్రతి నమస్కారం పెట్టడం సంస్కారమని, ఆ సంస్కారాన్ని కూడా తాను పాటించలేనని ముఖ్యమంత్రి తనకు ఎవరితోనైనా చెప్పిస్తే... ఆయన ఎదురుపడినా కూడా నమస్కారం పెట్టనని తెలిపారు. ప్రధాని సభకు కష్టపడి డ్వాక్రా మహిళలను పిలువ వలసిన అవసరం లేదని, తాను సభలో పాల్గొంటున్నానంటే ప్రజలు హాజరవుతారని చెప్పారు. ముఖ్యంగా ప్రపంచ దేశాలు నాయకుడిగా కీర్తిస్తున్న ప్రధానమంత్రిని చూడడానికి వస్తారన్నారు. 

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో, డిజిపి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి నేతృత్వంలో తనని భీమవరం సభలో పాల్గొనకుండా అడ్డుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ప్రధానమంత్రి పాల్గొనే సభలో, ఒక ఎంపీకి భద్రత కల్పించ లేకపోతే... వీళ్లే తప్పుడు కేసులు పెట్టారని అందరికీ అర్థమైతే, ఇప్పటికే ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సున్నా... లా అండ్ ఆర్డర్ జీరో, ఇక ఈ రాష్ట్రం వైపు ఎవ్వరు కన్నెత్తి కూడా చూడారని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. ఇంతటి నిరంకుశ , ఆటవిక, అనాగరిక పరిపాలనను భూమి పుట్టాక ఎప్పుడు లేదన్నారు. అర్ధరాత్రి పోలీసులు ఇంటికి వచ్చి తలుపులు బద్దలు కొట్టి, అదేమని ప్రశ్నిస్తే... విధి నిర్వహణకు అడ్డుకున్నారని అదనంగా మరో కేసు పెట్టడమే ప్రజాస్వామ్యమా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. 

ఇంటిదగ్గర నిరసన తెలిపిన వారిపై అత్యాచార కేసు, ఎవరితో మాట్లాడకుండా ఇంట్లో కూర్చున్న వారిపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయడం ఈ రాష్ట్ర పోలీసుల ధమనకాండ కు ప్రత్యక్ష సాక్షాలని రఘురామకృష్ణం రాజు వీడుచుకపడ్డాడు. రాష్ట్ర పోలీసులు ఇప్పటికే ప్రజల దృష్టిలో చులకనయ్యారని, కోర్టు సహకరించమని ఆదేశాలు జారీ చేసిన తుగ్లకు వేషాలు వేస్తే కచ్చితంగా ప్రజల దృష్టిలో మరింత చులకన అవుతారని హెచ్చరించారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణలు సృష్టించి, ఆ ఘర్షణలకు తానే కారణమని కేసులు పెట్టాలని ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో పోలీసులు పథక రచన చేసినట్లు తెలిసిందన్నారు.  

ఉడతలు 11 కెవి, 33 కెవి వైర్లను కొరుకుతున్నాయని, ఎలుకలు నాణ్యమైన మద్యం ను తాగుతున్నాయని... ఆంధ్రప్రదేశ్ లోని జంతువుల ప్రాశస్త్యం ఏమిటో అంతుచిక్కడం లేదని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 11 కెవి, 33 కెవి వైర్లను కోరిక గలిగే ఉడతలు ఉన్నాయంటే, అది ఉడతల గొప్పతనం?, లేకపోతే వైర్ల లోపమా?? అంటూ ప్రశ్నించారు. ఏపీలో జరిగిన ఆటో విద్యుత్ ఘాతం ప్రమాదంపై సాక్షి దినపత్రిక కథనంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆటోపై ఇనుప మంచం ఉన్నట్లు... ఆటోలో కూర్చున్న ఒక వ్యక్తి నేలపై కాలు పెట్టినట్టు సాక్షి దినపత్రిక కథనాన్ని ప్రచురించిందని, దానికి ఉడత వచ్చి సాక్షి దినపత్రికకు సాక్ష్యం చెప్పిందా? అంటూ అపహాస్యం చేశారు.  మీరు ఎన్ని కథలు చెప్పినా నమ్ముతామని... ఎందుకంటే మీ పార్టీలో ఉన్నాము కదా అంటూ రఘురామ సెటైర్లు వేశారు. 

Published at : 01 Jul 2022 06:04 PM (IST) Tags: cm jagan mp raghurama Raghurama's accusations against Raghurama Bhimavaram Sabha

సంబంధిత కథనాలు

Pawan Kalyan: పదవులపై పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు, 2009లోనే ఎంపీ అయ్యేవాడినన్న జనసేనాని

Pawan Kalyan: పదవులపై పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు, 2009లోనే ఎంపీ అయ్యేవాడినన్న జనసేనాని

Vijayawada TDP MP : బెజవాడ బరిలో నిలిచేదెవరు? టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కొత్త పేరు!

Vijayawada TDP MP : బెజవాడ బరిలో నిలిచేదెవరు? టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కొత్త పేరు!

KTR On MODI : పథకాలన్నీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారా ? - ప్రధాని మోదీకి కేటీఆర్ సవాల్ !

KTR On MODI :  పథకాలన్నీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారా ? - ప్రధాని మోదీకి కేటీఆర్ సవాల్ !

Priyanka Gandhi For South : దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్‌గా ప్రియాంకా గాంధీ - కాంగ్రెస్ కీలక నిర్ణయం !

Priyanka Gandhi For South :  దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్‌గా ప్రియాంకా గాంధీ -  కాంగ్రెస్ కీలక నిర్ణయం !

Revant Corona : రేవంత్‌కు మరోసారి కరోనా - పాదయాత్రకు దూరం ! నల్లగొండ సీనియర్ల పంతం నెగ్గిందా ?

Revant Corona :  రేవంత్‌కు మరోసారి కరోనా - పాదయాత్రకు దూరం ! నల్లగొండ సీనియర్ల పంతం నెగ్గిందా ?

టాప్ స్టోరీస్

Horoscope Today 16th August 2022: ఈ రెండు రాశులవారికి అదృష్టం, ఆ రాశివారికి విజయం, ఆగస్టు 16 రాశిఫలాలు

Horoscope Today  16th August 2022:  ఈ రెండు రాశులవారికి అదృష్టం, ఆ రాశివారికి విజయం, ఆగస్టు 16 రాశిఫలాలు

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

ఈ విమానం రెప్పపాటులో గమ్యానికి చేరుస్తుంది, టికెట్ జస్ట్ రూ.1,645 మాత్రమే!

ఈ విమానం రెప్పపాటులో గమ్యానికి చేరుస్తుంది, టికెట్ జస్ట్ రూ.1,645 మాత్రమే!