News
News
X

Dharmana Prasad : ఎసరు పెట్టే వాలంటీర్లను పీకేస్తాం - మంత్రి ధర్మాన ప్రకటన !

వైఎస్ఆర్‌సీపీకి ఎసరు పెట్టే వాలంటీర్లను పీకేస్తామని మంత్రి ధర్మాన ప్రకటించారు. శ్రీకాకుళంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

FOLLOW US: 

Dharmana Prasad :  వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న వాలంటీర్ల వ్యవస్థపై ఆ పార్టీకి చెందిన కీలక నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. మంత్రులు కూడా వీరి జాబితాలో చేరుతున్నారు. తాజాగా రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు వాలంటీర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఎసరు పెట్టే వాలంటీర్ల ను తప్పించాలన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం బైరి సింగిపురం లో జరిగిన గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. మాకు ఎసరు పెట్టే వాలంటీర్ల ను చూస్తూ ఊరుకునేది లేదన్నారు. టిడిపికి సపోర్ట్ చేసే వాలంటీర్లు మీకు మీరుగా రిజైన్ చేయండని సూచించారు. 

ఆర్జీవీ సినిమా పోస్టర్లను దగ్గరుండి చించేయించిన కలెక్టర్ - అంత అసహ్యంగా ఉన్నాయా ?

మీరు రిజైన్ చేయకపోతే మేమే తీసేస్తాం అని హెచ్చరించారు. మేము కిరీటం పెడితే మీరు మాకు ఎసరు పెడితే ఎలా అంటూ వాలంటీర్ల ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అబద్దాలు చెప్పి తిరగటం ఎందుకు బయటికి వెళ్లి టిడిపి కి ప్రచారం చేసుకోవాలని ధర్మాన హెచ్చరించారు.  మంత్రికి ఒక్క సారిగా వాలంటీర్ల మీద ఎందుకు కోపం వచ్చిందో కానీ ప్రజాధనం జీతంగా తీసుకుంటున్న వాలంటీర్లు వైఎస్ఆర్‌సీపీకే పని చేయాలన్నట్లుగా ఆయన మాటలు ఉండటంతో వివాదాస్పదమవుతున్నాయి. నిజానికి వాలంటీర్లు అంటే వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలే అన్నట్లుగా మాట్లాడటం ధర్మానతోనే ప్రారంభం కాలేదు. గడప గడపకూ మన ప్రభుత్వం ప్రారంభమైనప్పటి నుండి పలువురు వ్యాఖ్యలు చేశారు. 

ఏ రాష్ట్రంలోనూ ఇన్ని పథకాలు లేవు, బటన్ నొక్కి రూ.1.65 లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చాం- సీఎం జగన్

మంత్రులు తానేటి వనిత, దాడిశెట్టి రాజా వంటి వారు.. వాలంటీర్లు పని చేయకపోతే తీసేయమని చెప్పేశారు. వారంతా మన పార్టీ కార్యకర్తలేనని.. మనం చెప్పిన పని చేయకపోతే ఎందుకు ఉంచాలని వారు నేరుగానే చెప్పారు. గతంలో విజయసాయిరెడ్డి వాలంటీర్లలో 90 శాతం వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలేనని ప్రకటించడం కూడా వివాదాస్పదమయింది. అయితే వాలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రజాప్రతినిధులకు విలువ లేకుండా పోయిందని  ఎమ్మెల్యేలు  అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా అధికార పార్టీలో ప్రచారం జరుగుతోంది. తమకు ప్రజల్లో పలుకుబడి తగ్గిపోయిందని...  పథకాల కోసం వాలంటీర్ల దగ్గరకే వెళ్తూండటంతో వాలంటీర్లు కూడా తామే సుప్రీం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న అసంతృప్తి నేతల్లో కనిపిస్తోంది.

ఎన్నికలు దగ్గరనపడుతున్ననసమయంలో వాలంటీర్లు తమకు మద్దతు ఇవ్వకుండా.. తాము చెప్పిన పని చేయకుండా ఇతర పార్టీలకు మద్దతిస్తున్నారని వైఎస్ఆర్‌సీపీ నేతలు అనుమానం పెంచుకుంటున్నారు. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

Published at : 21 Jul 2022 06:44 PM (IST) Tags: srikakulam news ap volunteers Minister Dharmana Prasad Minister angry with volunteers

సంబంధిత కథనాలు

Nitish PM Plan : మోదీకి దీటుగా ప్రధాని అభ్యర్థి కావడమే లక్ష్యం !  నితీష్ మాస్టర్ ప్లాన్ అదే !

Nitish PM Plan : మోదీకి దీటుగా ప్రధాని అభ్యర్థి కావడమే లక్ష్యం ! నితీష్ మాస్టర్ ప్లాన్ అదే !

BJP Vishnu : కొద్ది సెకన్ల వీడియోతో దుష్చ్రచారం - జాతీయ జెండాను తిరగేసి పట్టుకున్న అంశంపై బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి క్లారిటీ !

BJP Vishnu :  కొద్ది సెకన్ల వీడియోతో దుష్చ్రచారం - జాతీయ జెండాను తిరగేసి పట్టుకున్న అంశంపై బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి క్లారిటీ !

Warangal: ‘లాహిరి లాహిరిలో’ మూవీ సీన్ రిపీట్! ఎదురుపడ్డ ప్రత్యర్థులు - చివరికి ఎవరు నెగ్గారంటే?

Warangal: ‘లాహిరి లాహిరిలో’ మూవీ సీన్ రిపీట్! ఎదురుపడ్డ ప్రత్యర్థులు - చివరికి ఎవరు నెగ్గారంటే?

తెలంగాణ బీజేపీకి మరింత సినీ జోష్- పార్టీలో చేరనున్న జయసుధ!

తెలంగాణ బీజేపీకి మరింత సినీ జోష్- పార్టీలో చేరనున్న జయసుధ!

భలే మంచి రోజు, రండీ కండువా కప్పుకోండీ- నేతలకు బీజేపీ ఆఫర్‌

భలే మంచి రోజు, రండీ కండువా కప్పుకోండీ- నేతలకు బీజేపీ ఆఫర్‌

టాప్ స్టోరీస్

Asia Cup, India's Predicted 11: పాక్‌ మ్యాచ్‌కు భారత జట్టిదే! ఆ మాజీ క్రికెటర్‌ అంచనా నిజమవుతుందా?

Asia Cup, India's Predicted 11: పాక్‌ మ్యాచ్‌కు భారత జట్టిదే! ఆ మాజీ క్రికెటర్‌ అంచనా నిజమవుతుందా?

SR Sekhar : నేను మహేష్ ఫ్యాన్, పవన్ సినిమాకు పని చేశా - కుల వ్యాఖ్యల వివాదంపై నితిన్ 'మాచర్ల' దర్శకుడు

SR Sekhar : నేను మహేష్ ఫ్యాన్, పవన్ సినిమాకు పని చేశా - కుల వ్యాఖ్యల వివాదంపై నితిన్ 'మాచర్ల' దర్శకుడు

Bihar New CM: టీమ్ మారింది, కానీ కెప్టెన్ ఆయనే- బిహార్‌ సీఎంగా 8వ సారి నితీశ్ కుమార్ ప్రమాణం!

Bihar New CM: టీమ్ మారింది, కానీ కెప్టెన్ ఆయనే- బిహార్‌ సీఎంగా 8వ సారి నితీశ్ కుమార్ ప్రమాణం!

Election For Congress Chief: కాంగ్రెస్‌ కార్యకర్తలకు గుడ్ న్యూస్- త్వరలోనే పార్టీకి కొత్త అధ్యక్షుడు!

Election For Congress Chief: కాంగ్రెస్‌ కార్యకర్తలకు గుడ్ న్యూస్- త్వరలోనే పార్టీకి కొత్త అధ్యక్షుడు!