Minister Botsa : సీఎం విద్యాశాఖ సమీక్షకు బొత్స డుమ్మా ! అసంతృప్తితో ఉన్నారా ?
విద్యాశాఖపై సీఎం నిర్వహించిన సమీక్షా సమావేశానికి మంత్రి బొత్స సత్యనారాయణ గైర్హాజర్ అయ్యారు. విద్యాశాఖ కేటాయించడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ( Botsa Satya narayana ) వ్యవహారశైలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ( YsrcP ) చర్చనీయాంశమవుతోంది. మంత్రి పదవుల ప్రమాణస్వీకారం అనంతరం ఆయనకు శాఖల కేటాయింపులో విద్యా శాఖ ( Education Minister ) దక్కింది. ఆ శాఖపై బుధవారం సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో విద్యాశాఖ మంత్రి కుర్చీ ఖాళీగా ఉంది. మంత్రి బొత్స సత్యనారాయణ హాజరు కాలేదు. మంత్రి ఎందుకు రాలేదో అధికారులను సీఎం జగన్ ( CM Jagan ) ఆరా తీశారు . అయినా కారణం ఏమిటో తెలియలేదు.
జగన్ మంత్రి పదవి ఇవ్వరు - వాళ్లేమో ఊళ్లోకి రానివ్వరు ! ఆ ఎమ్మెల్యే కష్టం ఎవరు తీరుస్తారు ?
విద్యాశాఖను కేటాయించడంపై మంత్రి బొత్స సత్యనారాయణ సంతృప్తిగా లేరన్న ప్రచారం వైఎస్ఆర్‌సీపీలో జరుగుతోంది. మంత్రుల ఫోర్ట్ ఫోలియోలు ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో బొత్సకు కేటాయించిన విద్యాశాఖపైనే ఎక్కువగా ట్రోలింగ్ జరిగింది. బొత్సకు ఇంగ్లిష్ , హిందీ భాషలు రావు. గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయన ఓ ఇంగ్లిష్ చానల్‌తో ఇంగ్లిష్ లో మాట్లాడే ప్రయత్నం చేశారు . అది మరీ దారుణంగా ఉంది. ఆ పాత వీడియోను బయటకు తీసిన నెటిజన్లు విస్తృతంగా ట్రోల్ చేశారు. మన విద్యా శాఖ మంత్రి ఈయనే అని... అందరూ తెలుగు, ఇంగ్లిష్‌లో మాట్లాడతారు అయితే ఇక నుంచి బొత్స భాష కూడా ప్రత్యేకంగా ఉంటందని సెటైర్లు వేశారు.
అలకపై సుచరిత ట్విస్ట్- మా అమ్మాయి వల్లే ఇదంతా జరిగిందంటూ వివరణ
ఈ సోషల్ మీడియా ట్రోలింగ్స్ చూసి బొత్స ఫీలయ్యారో లేకపోతే.. తనకు నిజంగా విద్యా శాఖ ఫిట్ కాదనుకున్నారో కానీ ఆయన బాధ్యతలు స్వీకరించలేదు. ప్రమాణస్వీకారం తర్వాత ఆయన విజయనగరం వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. మంత్రుల ప్రమాణస్వీకారం సమయంలోనూ బొత్స వ్యవహారశైలి భిన్నంగా ఉంది. ఇతర మంత్రులందరూ జగన్‌కు పాద నమస్కారం చేయడం... చేతులకు ముద్దులు పెట్టడం వంటివి చేశారు. కానీ బొత్స మాత్రం మొదట గవర్నర్ వద్దకు వెళ్లి కరచాలనం చేసి తర్వాత జగన్ వద్దకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు.
విద్యాశాఖ తనకు ఇష్టం లేదని బొత్స బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఆయితే ఆయన అసంతృప్తిగా ఉన్నారని గుర్తించాలన్నట్లుగా వ్యవహారశైలి ఉంది. విద్యాశాఖ సమీక్,కు హాజరు కాకపోవడంపై ఏబీపీ దేశం అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందించారు. పెళ్లి ఉన్నందున సమీక్షకు హాజరు కాలేదన్నారు. విద్యాశాఖపై అసంతృప్తి ఉందా అన్న ప్రశ్నకు ఎలాంటి సమాధానం చెప్పలేదు.