By: ABP Desam | Updated at : 16 May 2022 01:26 PM (IST)
అంబటి , అయ్యన్న మధ్య ట్వీట్ వార్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జోరు మీదున్నాయి. నేరుగా మీడియా ముందుకు వచ్చి చేసుకునే విమర్శలు మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా దుమ్మెత్తి పోసుకోవడం ఇప్పుడు కామన్‌గా మారింది. మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మధ్య ఈ ట్విట్టర్ యుద్ధం నెక్ట్స్ లెవల్‌కు చేరుకుంది. కుటుంబసభ్యులను సైతం చొప్పించి రాజకీయంగా ఆరోపణలు చేసుకుంటూడటంతో ఈ వ్యవహారం రెండు పార్టీల్లోనూ చర్చనీయాంశమవుతోంది. మొదట టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అంబటి రాంబాబు ఓ యూట్యూబ్ చానల్ మహిళా జర్నలిస్టును వేధించారని పోస్ట్ పెట్టారు.
సార్ మీ ఇంటర్వ్యూ కావాలి అంటూ కాంబాబు కి వాట్సాప్ లో మెసేజ్ చేసింది యూట్యూబ్ ఛానల్ యాంకర్...ఇంటర్వ్యూ ఇస్తా నాకేం ఇస్తావ్ అంటూ రిప్లై ఇచ్చాడు కాంబాబు. అక్కడితో ఆ వ్యవహారం ఆగలేదు...త్వరలో ఆ వివరాలు ప్రపంచానికి. మహిళా జర్నలిస్ట్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన కాంబాబు బూతు పురాణం 1/2
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) May 12, 2022
దీనికి కౌంటర్‌గా అంబటి రాంబాబు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌పై ఆరోపణలు చేస్తూ ట్వీట్ చేశారు.
స్విమ్మింగ్ పూల్ లో చిల్ అయ్యే చినబాబు
— Ambati Rambabu (@AmbatiRambabu) May 14, 2022
పక్కలేసి పార్టీని లాక్కున్న పెదబాబు
చింతకాయల సోంబేరి,వంకాయల బనిత
ఈనాడు+ఆంధ్రజ్యోతి+టీవీ5
నా క్యారెక్టర్ మీద
ఎంత రాసిన..ఎంత కూసినా.. ఎంత మొరిగినా
నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు !
మీరందరూ నా వెంట్రుకతో సమానం !!@AyyannaPatruduC
అక్కడ్నుంచి ఇద్దరి మధ్య ట్వీట్ వార్ మరో రేంజ్‌కు చేరుకుంది. తనకు సంస్కారం ఉందంటూ ఓ ఫేస్ కనిపించని ఫోటోను అయ్యన్న ట్వీట్ చేశారు.
అడడైతే చాలు సొంత కూతురిని కూడా వంకర చూపులు, వంకర మాటలు మాట్లాడే రకం నువ్వు... కాంబాబు ఎవరు అని అడిగావ్ కదా సదరు యూట్యూబ్ యాంకర్ త్వరలోనే సిఎం ని కలవబోతుంది. అప్పుడు జగన్ రెడ్డి చెబుతాడు నీకు కాంబాబు అంటే ఎవరో. దయచేసి నన్ను సంస్కార హీనుడిగా మర్చొద్దు... @AmbatiRambabu pic.twitter.com/AYm0lmfyfs
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) May 14, 2022
ఆ తర్వాత అంబటి రాంబాబు మరింత అభ్యంతరకంగా పోస్టులు పెట్డడంతో అయ్యన్నపాత్రుడు... అంబటి రాంబాబు మాట్లాడినట్లుగా చెబుతున్ ఓ ఆడియోను ట్వీట్ చేశారు.
అరేయ్ కాంబాబు నీ బూతు పురాణం సిఎం కి చేరింది. భర్తరఫ్ చేస్తారో అన్ని తెలిసే కదా ఈ బోగ్గాడికి పదవి ఇచ్చాం అనుకుంటారో వాళ్ళ ఇష్టం. ఎవరెవరికి మెసేజ్ చేశావో నీకు తెలిసి కూడా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడం అది నా వాయిస్ కాదు...నా మెసేజ్ కాదు అనడం కామనే గా !. @AyyannaPatruduC pic.twitter.com/0aSz4O9CBE
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) May 15, 2022
వీరిద్దరి మధ్య ట్వీట్ వార్ ఇంకా కొనసాగుతోంది. అంబటి రాంబాబు రాసలీలలన్నీ సీఎం జగన్ దగ్గరకు చేరాయని.. చర్యలు తీసుకుంటారో లేదో వారిష్టమని అయ్యన్నపాత్రుడు చెబుతున్నారు.
ఎవడో పెట్టుకున్న పార్టీని, మీ వాడు శ్రేయస్కరంగా లాగినట్టు కాంబాబు! నువ్వు ఎన్ని డ్రామాలు వేసినా శ్రావ్యంగా సిఎంకి నీ వెధవ పనులు ఫిర్యాదు త్వరలోనే.. @AmbatiRambabu
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) May 15, 2022
పార్టీ నేతలు, వారి అధినేతలు కుటుంబసభ్యుల వ్యక్తిత్వాలను సైతం కించ పరిచేలా ఇలా పోస్టులు చేసుకోవడంతో రెండు పార్టీల్లోనూ ఈ అంశం చర్చనీయాంశం అయింది.
Telangana Elections 2023 : వైన్ షాపుల్లో సరుకంతా ఖాళీ - ముందుగానే మందుబాబుల జాగ్రత్త !
Telangana Elections 2023 : కేటీఆర్ ప్రచార వ్యూహాలతో బీఆర్ఎస్ దూకుడు - అంతా తానై నడిపించిన వర్కింగ్ ప్రెసిడెంట్ !
Chandrababu case : రాజకీయ ర్యాలీల్లో పాల్గొనేందుకు లైన్ క్లియర్ - చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా
Andhra News : అనంతపురంలో బీజేపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ ! టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుపై వివాదం
Telangana Elections 2023 : కామారెడ్డి రైతుల భూములు కాపాడటానికే కేసీఆర్‌పై పోటీ - గెలిపించాలని రేవంత్ విజ్ఞప్తి
Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!
Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్
Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి
/body>