చంద్రబాబు టూర్ టైంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని నుంచి పార్టీ శ్రేణులకు మెసేజ్- బిత్తరపోయిన నేతలు
చంద్రబాబు టూర్‌కు మొదటి రోజు డుమ్మా కొట్టిన నాని రెండో రోజు షెడ్యూల్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు. మొదటి రోజులు ఎందుకు డుమ్మా కొట్టారు రెండో రోజు ఎందుకు పాల్గొంటున్నారు.
బెజవాడ తెలుగు దేశం పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని అధినేత చంద్రబాబు టూర్‌కు హజరు కాకపోవటం సంచలనంగా మారింది. అయితే విజయవాడ టూర్‌కు మొదటి రోజు దూరంగా ఉన్న నాని మిగిలిన మూడు రోజుల షెడ్యూల్‌లో పాల్గొనేందుకు రెడీ కావటం చర్చనీయాశంగా మారింది.
బెజవాడ పర్యటకు కేశినేని దూరం..
తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల పాటు ఉమ్మడి కృష్ణాజిల్లాలో పర్యటించనున్నారు. విజయవాడలో చంద్రబాబు పర్యటించిన సమయంలో కేశినేని నాని నందిగామ, జగ్గయ్యపేటలో పలు కార్యక్రమాల్లో హజరు అయ్యారు. జగ్గయ్యపేటలోని ఆలయంలో జరిగిన కార్యక్రమానికి ఎంపీ కేశినేని నాని హజరు కాగా, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగు దేశం పార్టీకి చెందిన వర్గాల మధ్య వివాదం తలెత్తింది. రెండు వర్గాలు కూడా గొడవ పడ్డాయి. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తొలి రోజున అధినేత బెజవాడ పర్యటనలో కనిపించని నాని రెండో రోజున జరిగే పర్యటలో పాల్గోనటంపై పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది.
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శ్రీనివాస్ మధ్యాహ్నం ఒంటిగంటకు కేశినేని భవన్ నుంచి బయలుదేరి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో కలిసి నిమ్మకూరు, గుడివాడ పర్యటనలో పాల్గొంటారు. నిమ్మకూరులో చంద్రబాబుతో కలిసి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు హాజరవుతారు. అనంతరం గుడివాడ రోడ్ షో, బహిరంగసభలోనూ పార్టిసిపేట్ చేస్తారు అంటూ పార్టి నాయకులకు ప్రత్యేకంగా మెసేజ్‌లు అందాయి.
మొదటి రోజు టూర్‌కు ఎందుకు దూరం అయ్యారు.
చంద్రబాబు పర్యటనలోపార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని మొదటి రోజు కనిపించకుండాపోయారు. చంద్రబాబు విజయవాడ పర్యటలో ఉండగా ఆయన తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే ఉండి కూడా వేరొక కార్యక్రమానికి హజరు కావటం చర్చనీయాంశమైంది. దీంతో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న నేత చంద్రబాబు వెనుక లేకపోవటంపై పార్టీలో పుకార్లకు దారి తీసిందది.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో చంద్రబాబు మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. మూడు నియోజవకర్గాల పరిధిలో మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటన జరుగుతుంది. చంద్రబాబు తొలి రోజు పర్యటన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో స్టార్ట్ అయింది. వాస్తవానికి పార్లమెంట్ సభ్యుడి హోదాలో కేశినేని నాని చంద్రబాబుకు స్వాగతం పలకాల్సి ఉంది. అయినా ఆయన మాత్రం కనిపించలేదు. స్థానిక శాసన సభ్యుడు గద్దె రామ్మోహన్ మాత్రమే, చంద్రబాబుకు స్వాగతం పలికారు. నియోజకవర్గంలో పలువురు నేతలు తెలుగు దేశం పార్టీలో చేరటంతో వారికి చంద్రబాబు కండువా కప్పి పార్టిలోకి ఆహ్వనించారు.
మొదటి నుంచి కేశినేని వివాదం..
పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని నాని తొలి నుంచి తనదైన శైలిలో వ్యవహరించటం పార్టీలో చర్చనీయాశంగా మారింది. ఎన్నికల సమయంలో అదినేతను సైతం లెక్కచేయకుండా నాని వ్యాఖ్యలు చేశారు. దీంతో కార్పోరేషన్ ఎన్నికల్లో కూడా పార్టికి తీరని నష్టం వచ్చింది. అయినా అధినేత చంద్రబాబు మాత్రం కేశినేని నానికి ప్రత్యేక స్థానం ఇచ్చారు. అయితే అధినేత చంద్రబాబు నానిని పక్కన పెట్టారంటూ ప్రచారం జరిగిన సమయంలో చంద్రబాబు స్వయంగా నాని కుటుంబ వేడుకల్లో పాల్గొనటంతో అంతా సైలెంట్ అయ్యారు. ఇప్పడు మరోసారి చంద్రబాబు పర్యటలో నాని కనిపించకపోవటం,రెండో రోజు షెడ్యూల్‌లో పాల్గొనటం పై చర్చ జరుగుతుంది.