Mega Family Fund Janasena : జనసేనకు మెగా ఫ్యామిలీ రూ. 35 లక్షల విరాళం - కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలిచేందుకే !
జనసేన పార్టీకి రూ. 35 లక్షల విరాళం ఇచ్చారు మెగా ఫ్యామిలీ సభ్యులు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు సాయం చేసేందుకు ఈ మొత్తం వినియోగించనున్నారు.
Mega Family Fund Janasena : ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు అండగా ఉంటున్న పవన్ కల్యాణ్‌కు మద్దతుగా మెగా కుటుంబం కూడా ముందుకు కదిలి వచ్చింది. తమ వంతుగా రూ. 35 లక్షల విరాళం చెక్కును జనసేన నేత నాదెండ్ల మనోహర్‌కు అందించారు. వరుణ్ తేజ్ రూ. పది లక్షలు.. సాయి ధరమ్ తేజ్ రూ. పది లక్షలు, నిహారిక రూ. ఐదు లక్షలు, వైష్ణవ్ తేజ్ రూ. ఐదు లక్షలు ఇచ్చారు. ఇతర కుటుంబసభ్యులు మరో రూ. పదిహేను లక్షలు ఇచ్చారు. మొత్తంగా రూ. 35 లక్షలను జనసేనకు విరాళంగా ఇచ్చారు.
జనసేనాని బాట... కుటుంబ సభ్యుల చేయూత
— JanaSena Party (@JanaSenaParty) June 13, 2022
Link: https://t.co/F2tpb3L1T6 pic.twitter.com/crS4BFiGcT
ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలబడేందుకు ముందకు వచ్చి రైతులకు విరాళాలు ఇచ్చి అండగా నిలబడినందుకు అందరికీ మనస్ఫూర్తిగా పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.
సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నీహారిక, నాగబాబు గారు, మాధవి గారు, డాక్టర్ రాజు గారు వీరంతా కౌలు రైతులకు విరాళాలు ఇచ్చి అండగా నిలబడినందుకు అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. - JanaSena Chief Sri @PawanKalyan@IamSaiDharamTej @IAmVarunTej @IamNiharikaK @NagaBabuOffl pic.twitter.com/upFSfSYL47
— JanaSena Party (@JanaSenaParty) June 13, 2022
జనసేనకు విరాళం ఇచ్చిన మెగా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం రాజకీయంగా తటస్థంగా ఉంటారని.. కానీ రైతులకు సాయం చేయాలన్న ఉద్దేశంతో విరాళం వచ్చిన వారు ఎంతో గొప్ప అని పవన్ ప్రశంసించారు.
ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు సాయం అందించేందుకు పవన్ కల్యాణ్ ఇప్పటికే రైతు భరోసా యాత్ర చేస్తున్నారు. ఒక్కో కుటుంబానికి రూ. లక్ష చొప్పున సాయం అందిస్తున్నారు. ఇప్పటికే మూడు జిల్లాల్లో ఆత్మహత్య చేసుకున్న కౌలురైతుల కుటుంబాలకు సాయం చేశారు. త్వరలో మరికొన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ రూ. ఐదు కోట్ల భారీ మొత్తాన్ని సొంత ఆదాయం నుంచి ఇచ్చారు. ఈ క్రమంలో పవన్ పట్టుదలకు కుటుంబ సభ్యులు కూడా అండగా నిలిచారు. మెగా కుటుంబ సభ్యుల ఔదార్యాన్ని అభిమానులు ప్రశంసిస్తున్నారు.