అన్వేషించండి

Konda Surekha : గీత దాటిన తెలంగాణ రాజకీయ భాష - ఏపీ పరిస్థితులే రిపీట్ అవుతున్నాయా?

Telangana : తెలంగాణ రాజకీయాల్లో భాష, ఆరోపణలు గీత దాటిపోతున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. గతంలో ఏపీలో ఇలాంటి రాజకీయాలు నడిచేవి ఇప్పుడు తెలంగాణకు విస్తరించాయి.

Telangana Politics :  తెలంగాణ రాజకీయాల్లో ఒక్క సోషల్ మీడియా పోస్టు సునామీ తీసుకు వచ్చింది. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, మంత్రి కొండా సురేఖకు ఓ కార్యక్రమంలో నూలు పోగులతో చేసిన దండ వేసిన ఫోటోను తీసుకుని బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త ఒక్కరు జుగుప్సాకరమైన కామెంట్‌తో పోస్ట్ పెట్టారు. ఈ పోస్టును చూసి మంత్రి కొండా సురేఖ కంట తడి పెట్టుకున్నారు. కాంగ్రెస్ నేతలు ఫైరయ్యారు. ఆ పోస్టు అభ్యంతరకరంగా హరీష్ రావు విచారం వ్యక్తం చేశారు. ఇక పరిస్థితి సద్దుమణుగుతుందని అనుకునేంతలో కేటీఆర్ చిట్ చాట్‌లో రాహల్ గాంధీ, కొండా సురేఖపై చేసిన కామెంట్స్‌తో మొత్తం వ్యవహారం చేయిదాటిపోయింది. 

మీడియా ప్రతినిధుల చిట్ చాట్‌లో కేటీఆర్ తీవ్ర విమర్శలు 

బుధవారం ఉదయం మీడియా ప్రతినిధుల చిట్ చాట్‌లో కేటీఆర్ కాస్త ఘాటుగా మాట్లాడారు. మూసి కూల్చివేతలతో పేదలు చస్తూంటే.. రాహుల్ గాంధీ ఎక్కడ సచ్చాడని కూడా ప్రశ్నించారు. కొండా సురేఖ ఏడుపులు, పెడబొబ్బలు అన్నీ డ్రామాలేనని అన్నారు. అవి కెమెరాల ముందు చేసిన వ్యాఖ్యలు కావు. కానీ మీడియా ప్రతినిధులు యాజిటీజ్ గా రిపోర్టు చేశారు. ఫలితంగా కొండా సురేఖ మరో అడుగు ముందుకేశారు. 

మంత్రి కొండా సురేఖ ఆరోపణల్ని ఖండించిన నాగార్జున, అసలేం జరిగిందంటే!

వ్యక్తిగత విమర్శలు తారస్థాయికి ! 

కొండా సురేఖ కేటీఆర్ ను టార్గెట్ చేయడానికి నాగార్జున కుటుంబాన్ని, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విషయాన్ని కూడా ప్రస్తావించారు. వారి పేర్లు ప్రస్తావించకపోతే రాజకీయ విమర్శలుగానే ఉండేవి. కానీ ఆ కుటుంబాలకు రాజకీయాలతో సంబంధం  లేదు అయినా వారి విషయాన్ని తీసుకు రావడంతో వివాదం అయింది. కొండా సురేఖపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నాగార్జున ఆ విమర్శలు వెనక్కి తీసుకోవాలని కోరారు. ఇక బీఆర్ఎస్ నేతలు కొండా సురేఖపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.  

కొండా సురేఖ ఫోన్ కాల్ ఆడియో లీక్ 

కొండా సురేఖ వ్యాఖ్యలు చేసిన వెంటనే బీఆర్ఎస్ సోషల్ మీడియా ఓ ఆడియోను లీక్ చేసింది. వేరొక మహిళతో కొండా సరేఖ మాట్లాడుతున్న ప్రైవేటు సంభాషణ అది. అందులో అసభ్యకరమైన మాటలు ఉన్నాయి. లకానీ అది రాజకీయం కాదు. ఆయినా బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ క్రిషాంక్ దాన్ని ఆన్ లైన్ లో పెట్టారు. ఆ ఆడియో ఎక్కడి నుంచి వచ్చింది.. ట్యాపింగ్ చేసినప్పుడు రికార్డింగ్ చేసిందా అని కాంగ్రెస్న నేతలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కొండా సురేఖకు అండగా నిలుస్తున్నారు. బీఆర్ఎస్ నేతలే మొదట ప్రారంభించారని అంటున్నారు. 

Also Read: Konda Surekha : డ్రగ్స్ అలవాటు చేసి హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారు - కేటీఆర్‌పై కొండా సురేఖ సంచలన ఆరోపణలు

ఏపీ తరహా రాజకీయాలు !

ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఇలాంటి అసభ్యకరమైన బూతు రాజకీయాలు చాలా ఎక్కువగా ఉండేవి. వైసీపీ తరపున తెర ముందుకు వచ్చే పేర్ని నాని, కొడాలి నాని, రోజా , పోసాని ఇలా ప్రతి ఒక్కరూ తమదైన భాషతో ఐదేళ్ల పాటు దడదడలాడించారు. వారికి కౌంటర్ ఇవ్వాడనికి టీడీపీ నేతలు అదే్ పని చేశారు. కుటుంబాలని కూడా సోషల్ మీడియాకు ఎక్కించుకుని ఆరోపణలు చేసుకున్నారు. అందరూ అందరి కుటుంబాలపై ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెట్టుకున్నారు. ఇదే రాజకీయం అనుకున్నారు. అయితే ఎన్నికల తర్వాత ఏపీలో మార్పు వచ్చింది. ఇప్పుడు అక్కడ రాజకీయ విమర్శలు వినిపిస్తున్నాయి కానీ బూతులు మాట్లాడటం లేదు. వైసీపీ అధికారంలో లేకపోవడంతో తమ అధికార భాషను వాడే ప్రయత్నం చేయడం లేదు. టీడీపీ నేతలు గీత దాటడం లేదు. కానీ తెలంగాణలో మాత్రం పరిస్థితి మారిపోయింది. ఏపీ రాజకీయాలు తెలంగాణలో కనిపిస్తున్నాయి. 

 

టాప్ హెడ్ లైన్స్

Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
YS Jagan Political Strategy: బాధితుల కంటే నిందితులకు అభయం - వైఎస్ జగన్ లాయల్టీ కార్డ్ రాజకీయాల వెనుక అసలు లెక్కలు ఇవే!
బాధితుల కంటే నిందితులకు అభయం - వైఎస్ జగన్ లాయల్టీ కార్డ్ రాజకీయాల వెనుక అసలు లెక్కలు ఇవే!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Embed widget