Telangana Alluri BJP : అదంతా వాట్సాప్ యూనివర్శిటీ సైడ్ ఎఫెక్ట్స్ - అమిత్ షాపై కేటీఆర్ సెటైర్లు ! ఏ విషయంలో అంటే
తెలంగాణ విముక్తి పోరాటంలో అల్లూరి పాల్గొన్నారంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ సెటైర్లు వేశారు. అదంతా వాట్సాప్ యూనివర్శిటీ సైడ్ ఎఫెక్ట్స్ అన్నారు.
Telangana Alluri BJP : తెలంగాణ బీజేపీ నేతలు అల్లూరి సీతారామరాజును తెలంగాణ సాయుధ పోరాట యోధునిగా చెబుతూండటం వివాదాస్పదమవుతోంది. స్వయంగా హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడమే కాకుండా .. అమరవీరుల జాబితాలో ఫోటోలను కూడా ప్రదర్శించడం ఇప్పుడు రకరకాలుగా చర్చలకు కారణం అవుతోంది. ఇదంతా వాట్సాప్ యూనివర్శిటీ సైడ్ ఎఫెక్టులని కేటీఆర్ వంటి నేతలు బీజేపీపై సెటైర్లు వేస్తున్నారు.
This is why Education is important , otherwise Idiots will not hesitate to distort History.
— krishanKTRS (@krishanKTRS) June 2, 2022
Our whole Telangana Struggle was for our Identity.
With all due respect what has Alluri garu to do with Hyderabad or Telangana ?
This is what happens if BJP wants to make Films as History pic.twitter.com/wHtAIqBUG0
తెలంగాణ సాయుధ పోరాటంలో మన్యం వీరుడు !
అల్లూరి సీతారామరాజు తెలంగాణ విముక్తి కోసం రాంజీగోండు, కొమురంభీంతో కలిసి నిజాంపై పోరాటం చేశారని ప్రకటించారు. నిజానికి ఎక్కడా అల్లూరి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారని ఇంత వరకూ ఎవరూ చెప్పలేదు. ఎలాంటి చరిత్ర లేదు. రు. ఇది తెలంగాణ చరిత్రను, అల్లూరి వీరత్వాన్ని రెండింటినీ కించపర్చడమేనని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. వాట్సాప్ యూనివర్శిటీ సైడ్ ఎఫెక్టులని కేటీఆర్ విమర్శించారు.
The side affects of being coached at WhatsApp university 😁
— KTR (@KTRTRS) June 3, 2022
BJP is a party that has no history of democratic struggle; neither in India’s freedom nor in Telangana formation. Their only strength is the double engine of Jhoot & Jhumla https://t.co/1xTxEeBuL8
మన్యంలోనే అల్లూరి పోరాటం !
బ్రిటీష్ పాలకుల దాస్య శృంఖలాల నుంచి ఆదివాసీలను విముక్తులను చేయడమే లక్ష్యంగా అల్లూరి సీతారామరాజు నడిపించిన సాయుధ పోరాటానికి స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రత్యేక స్థానముంది. మన్యంలోనే అల్లూరిపోరాటం సాగినట్లుగా అందరికీ తెలుసు. గిరిజనులపై బ్రిటీష్ పాలకుల దౌర్జన్యాలు పెచ్చుమీరుతుండడంతో ఇక శాంతియుత పోరాటంతో లక్ష్యం చేరలేమని భావించిన అల్లూరి సీతారామరాజు సాయుధ పోరాటానికి సన్నద్ధమయ్యారు. ఆయుధ సేకరణే లక్ష్యంగా 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై తొలి మెరుపుదాడి చేశారు. ఆ దాడులు విజయవంతం కావడంతో పోలీస్ స్టేషన్‌లపై దాడుల పరంపరను కొనసాగించారు. సీతారామరాజు మే7 1924న బ్రిటీష్ సేనలకు పట్టుబడ్డారు. అంటే ఇరవై ఆరేళ్లకే చనిపోయారు.
తెలంగాణ చరిత్రనూ వక్రీకరిస్తున్నరనే విమర్శలు !
ఇటీవలి కాలంలో బీజేపీ చరిత్రను తిరగరాస్తోందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో తెలంగాణ చరిత్రలోకి కొత్తగా అల్లూరిని తీసుకు వస్తున్న వైనంపై విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ సాయుధ పోరాటం చరిత్రను కూడా మారుస్తున్నారా అని టీఆర్ఎస్ సపోర్టర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మీమ్స్ తో ట్రోల్ చేస్తున్నారు.
ఇన్ని రోజులు దేశం కోసం పోరాడావు అని మాత్రమే తెలుసు,
— Mutha Ganesh (@TelanganaGanesh) June 2, 2022
తెలంగాణ కోసం పోరాటం చేసావా నాకు చెప్పనే లేదే.😭😭 pic.twitter.com/Zg8YVtfPnx
— Latha (@LathaReddy704) June 3, 2022