అన్వేషించండి

Komatireddy Rajgopal Reddy : మునుగోడు నుంచి తాడేపల్లి మీదుగా హైదరాబాద్‌ - తెలంగాణలో వైఎస్సార్‌సీపీకి రాజగోపాల్ రెడ్డి ఊపిరి పోస్తారా?

YSRCP Telangana Entry: రాజగోపాల్ రెడ్డి సొంత కుంపటి పెట్టుకుంటానని గట్టిగా సంకేతాలిస్తున్నారు. వైఎస్ఆర్ సీపీని తెలంగాణలో పునరుద్ధరించే ప్లాన్‌లో ఉన్నారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

YSRCP Telangana Reopen Strategy:    మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చుట్టూ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా తిరుగుతున్నాయి. ఇటీవల ఆయన వైఎస్సార్‌సీపీ శ్రేణులతో సన్నిహితంగా మెలుగుతుండటం, ట్విట్టర్  స్పేస్‌లలో చర్చలు జరపడం, తన రాజకీయ ప్రయాణం వైఎస్సార్ ఆశయాల బాటలోనే సాగుతుందని బహిరంగంగా సంకేతాలు ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. కొన్నాళ్ల కిందట మునుగోడు నుంచి తాడేపల్లికి భారీ ర్యాలీగా వెళ్లినప్పుడు ఆయన ఇచ్చిన వివరణ కేవలం ఒక వేడుక పరిమితమేనని చెప్పినప్పటికీ, ఆ ఘటన తర్వాత నుంచి క్షేత్రస్థాయి పరిణామాలు ఊహాగానాలకు బలాన్నిచ్చాయి. మరి నిజంగానే రాజగోపాల్ రెడ్డి తెలంగాణలో వైఎస్సార్‌సీపీ బాధ్యతలు తీసుకోగలరా? ఆ ధైర్యం చేయగలరా? 

ఇటీవల సొంత పార్టీ ఆలోచనలు చేస్తున్న రాజగోపాల్ రెడ్డి 

రాజగోపాల్ రెడ్డి రాజకీయ ప్రయాణాన్ని పరిశీలిస్తే.. ఆయన నిత్యం ఒక సొంత ఇమేజ్, అగ్రెసివ్ మార్క్ రాజకీయం కోరుకునే నాయకుడు. గతంలో కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి, మళ్లీ అక్కడ నుంచి కాంగ్రెస్‌లోకి రావడం వెనుక ఆయన ఆశించిన రాజకీయ ప్రాధాన్యతే ముఖ్యం. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ నిరంతరం ఆలస్యం కావడం, తనకు మంత్రి పదవి దక్కకపోవడం పట్ల ఆయన వర్గం తీవ్ర తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి నాయకత్వానికి పోటీగా లేదా తన ఉనికిని చాటుకునేందుకు వైఎస్సార్ భావజాలాన్ని ప్లాట్‌ఫారమ్‌గా ఎంచుకోవడం ఆయన వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. వైఎస్సార్ పేరు తెలంగాణలో ఇప్పటికీ కొంతమంది ఓటర్లలో సానుభూతిని నింపగలదని ఆయన భావిస్తున్నారు.  
 

వైఎస్సార్‌సీపీ రీ-ఓపెనింగ్ 

 తెలంగాణలో ఇప్పటికీ ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో వైఎస్సార్‌పై ఉన్న అభిమానం అంతరించిపోలేదు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లలో అసంతృప్తిగా ఉన్న ద్వితీయ శ్రేణి నేతలను, పాత వైఎస్సార్‌సీపీ క్యాడర్‌ను ఒక తాటిపైకి తెచ్చి సొంత సైన్యాన్ని నిర్మించుకోవడానికి రాజగోపాల్ రెడ్డికి ఇది ఉపయోగపడవచ్చు.  ఏ నిర్ణయమైనా ధైర్యంగా తీసుకునే  ఫైటింగ్ నెచర్ రాజగోపాల్ రెడ్డి సొంతం. సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడని ఆయన నైజం.. తెలంగాణలో ఒక ప్రాంతీయ ప్రత్యామ్నాయాన్ని నిర్మించడానికి కావాల్సిన ఆర్థిక, రాజకీయ సత్తాను ఇస్తుంది. ఏపీకి చెందిన వైఎస్సార్‌సీపీ జెండాతో తెలంగాణలో రాజకీయం చేయడం ఎంత ప్రమాదకరమో షర్మిల  అనుభవాలు నిరూపించాయి. ఏపీ కేంద్రీకృత పార్టీగా ముద్రపడిన వైఎస్సార్‌సీపీని తెలంగాణలో రీ-ఓపెన్ చేస్తే, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు ఆయనపై  ఆంధ్రా పార్టీ  అనే బలమైన తెలంగాణ సెంటిమెంట్ దాడిని విసిరే అవకాశం ఉంది.

 నిజంగానే ఆ ధైర్యం చేస్తారా? 

ప్రస్తుతానికి రాజగోపాల్ రెడ్డి వేస్తున్న అడుగులు కాంగ్రెస్ అధిష్ఠానంపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగమని కొందరు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్  కేబినెట్ పదవి ఇవ్వకపోతే, ఆయన కాంగ్రెస్‌ను వీడి సొంత దారి చూసుకోవడం ఖాయం. కానీ నేరుగా వైఎస్సార్‌సీపీ జెండా పట్టుకుంటారా లేక వైఎస్సార్ పేరుతో కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేసి వైఎస్సార్‌సీపీ మద్దతు తీసుకుంటారా అనేది వేచి చూడాలి. తెలంగాణ రాజకీయాల్లో వాక్యూమ్  ఉందనే భావనలో రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. వైఎస్సార్‌సీపీ ని తెలంగాణలో పునరుద్ధరించడం అత్యంత సాహసోపేతమైన అడుగు. ఈ రిస్క్ చేసి ఆయన తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీస్తారా లేదా మంత్రివర్గ విస్తరణ వరకు వేచి చూస్తారా అన్నదే రాబోయే రోజుల్లో తేలనుంది.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Congress Politics: జడ్చర్ల ఎమ్మెల్యేపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్.. అనిరుద్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ క్లాస్
జడ్చర్ల ఎమ్మెల్యేపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్.. అనిరుద్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ క్లాస్
UP Politics BJP Challenges: యూపిలో బిజెపికి గడ్డు కాలం - ఎస్పీ జోరుకు యోగి బ్రేకులు వేయగలరా?
యూపిలో బిజెపికి గడ్డు కాలం - ఎస్పీ జోరుకు యోగి బ్రేకులు వేయగలరా?
KTR Praises Chandrababu: చంద్రబాబుకు కేటీఆర్ కితాబు - తెలంగాణ పొలిటికల్ గేమ్‌లో నలిగిపోతున్న మిత్రుడు జగన్!
చంద్రబాబుకు కేటీఆర్ కితాబు - తెలంగాణ పొలిటికల్ గేమ్‌లో నలిగిపోతున్న మిత్రుడు జగన్!
Amit Shah Telangana BJP Padayatra: తెలంగాణపై అమిత్ షా కన్ను - హైదరాబాద్ పాదయాత్రతో బీజేపీ గేర్ మార్చబోతుందా?
తెలంగాణపై అమిత్ షా కన్ను - హైదరాబాద్ పాదయాత్రతో బీజేపీ గేర్ మార్చబోతుందా?
Advertisement

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Urban Local Bodies Polling: ఏపీలో 13 పోలింగ్ కేంద్రాల్లో ముగిసిన రీపోలింగ్.. ఈ 3న ఓట్ల లెక్కింపు
ఏపీలో 13 పోలింగ్ కేంద్రాల్లో ముగిసిన రీపోలింగ్.. ఈ 3న ఓట్ల లెక్కింపు
Cyclone Musuru Helpline Numbers: ఏపీకి తుపాను ముప్పు.. మనమిత్ర వాట్సాప్ సహా జిల్లాలవారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు
ఏపీకి తుపాను ముప్పు.. మనమిత్ర వాట్సాప్ సహా జిల్లాలవారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు
Hyderabad Baby Dies: ఛీ ఇంత దారుణమా! పాప చనిపోయినా.. ట్రీట్మెంట్ చేస్తూ బతికున్నట్టు డాక్టర్లు డ్రామా !
ఛీ ఇంత దారుణమా! పాప చనిపోయినా.. ట్రీట్మెంట్ చేస్తూ బతికున్నట్టు డాక్టర్లు డ్రామా !
Congress Politics: జడ్చర్ల ఎమ్మెల్యేపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్.. అనిరుద్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ క్లాస్
జడ్చర్ల ఎమ్మెల్యేపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్.. అనిరుద్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ క్లాస్
Raptadu Girl Attack Case: రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
Upcoming Cars: ఈ నెలలో రాబోతున్న 4 కార్లు.. లగ్జరీ EVల నుంచి తొలి 'ఫ్లెక్స్ ఫ్యూయల్ హైబ్రిడ్' వరకు!
ఈ నెలలో లాంచ్‌ కానున్న 4 కొత్త కార్లు.. ఒక్కో కారుది ఒక్కో ప్రత్యేకత
Viral News: అమ్మా.. నన్ను తీసుకెళ్లు భయమేస్తుంది.. జగిత్యాలలో శిశు సంరక్షణ కేంద్రంలో పసివాడి నరకం
అమ్మా.. నన్ను తీసుకెళ్లు భయమేస్తుంది.. జగిత్యాలలో శిశు సంరక్షణ కేంద్రంలో పసివాడి నరకం
Diwali Home Decoration : దీపావళికి ఇంటిని ఈ లైట్లతో డెకరేట్ చేయండి.. ఆ తప్పులు చేయకండి, కరెంట్ బిల్ తగ్గుతుంది
దీపావళికి ఇంటిని ఈ లైట్లతో డెకరేట్ చేయండి.. ఆ తప్పులు చేయకండి, కరెంట్ బిల్ తగ్గుతుంది
Embed widget