అన్వేషించండి

Khammam Congress: ఖమ్మం కాంగ్రెస్‌లో ఆసక్తికరంగా రాజకీయాలు.. దాని కోసం ఇప్పటి నుంచే నేతల విశ్వప్రయత్నాలు

ఖమ్మం కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తమ సత్తాను చాటుకుని సీటు సాదించాలనే వ్యూహంతో కొందరు నేతలు పరితపిస్తున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో ఆధిపత్య పోరు మొదలైంది. శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గాల్లో తమ సత్తాను చాటుకుని సీటు సాదించాలనే వ్యూహంతో కొందరు నేతలు పరితపిస్తున్నారు. ప్రధానంగా కొత్తగూడెం నియోజకవర్గంపై దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఇటీవల వనమా రాఘవ ఉదంతం నేపథ్యంలో కొత్తగూడెం సీటు సాధిస్తే తమ గెలుపు సునాయసమని భావిస్తున్న కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు అక్కడే పాగా వేయడంతో నియోజకవర్గంలో ఇప్పుడు పార్టీలో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా ఉంది. ప్రస్తుతం నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న వనమా వెంకటేశ్వరరావు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి విజయం సాదించారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. గతంలో సైతం కాంగ్రెస్‌ పార్టీకి ఈ నియోజకవర్గం కంచుకోటగా ఉండేది. ఎలాగైనా కొత్తగూడెం సీటు సాదించాలనే ఉద్దేశంతో కొంత మంది కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడు నియోజకవర్గంపై పోకస్‌ చేస్తుండటంతో స్థానికంగా ఉన్న నేతల మద్య వర్గ విభేదాలు నెలకొంటున్నాయి.

మాజీ ఎమ్మెల్సీ పోట్ల ప్రయత్నాలు..
టీడీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్సీగా ఎన్నికైన పోట్ల నాగేశ్వరరావు 2018కి ముందు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్‌ రాలేదు. ఇటీవల కాలంలో తరుచూ కొత్తగూడెం నియోజకవర్గంలో పర్యటించడంతోపాటు ఇక్కడ కార్యకలాపాలపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. దీంతోపాటు 2018లో కాంగ్రెస్‌ టిక్కెట్‌ ఆశించి భంగపడ్డ ఎడవల్లి కృష్ణ ఆ ఎన్నికల్లో బీఎల్‌ఎఫ్‌ నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత వనమా వెంకటేశ్వరరావు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరడంతో తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరితోపాటు 2018 ఎన్నికల్లో టిక్కెట్‌ ఆశించిన నాగా సీతారాములు కొత్తగూడెం సీటును ఆశిస్తున్నారు. 

భట్టిని ప్రసన్నం చేసుకునేందుకు..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క ఆశీస్సులు ఉంటేనే జిల్లాలో టిక్కెట్‌ లభిస్తుందనే నేపథ్యంలో భట్టిని ప్రసన్నం చేసుకునేందుకు నాయకులు తంటాలు పడుతున్నారు. టిక్కెట్ల కేటాయింపుల్లో భట్టి విక్రమార్క చెప్పిన వారికి టిక్కెట్‌ లభిస్తుందని భావించి మాజీ ఎమ్మెల్సీ పోట్ల సైతం భట్టి వెంటే నడవడం గమనార్హం. కాగా భట్టి మొదటిసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన 2015 ఎన్నికల్లో ఆయనకు ప్రత్యర్థిగా పోట్ల నాగేశ్వరరావు ఉండటం గమనార్హం. పోట్ల నాగేశ్వరరావు టీడీపీలో కీలక నేతగా ఉండటంతో వీరి మధ్య 2018 వరకు రాజకీయ వైరం ఉండేది. ప్రస్తుతం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు భట్టి వెన్నంటి పోట్ల ఉంటున్నారు.
ఆది నుంచి ఉన్న వారిలో అసంతృప్తి..
కాంగ్రెస్‌ పార్టీలో ఆది నుంచి ఉన్న వారికి ప్రస్తుత పరిణామాలు రుచించడం లేదు. వలస వచ్చిన నాయకులకు ప్రాధాన్యత లభించడంతోపాటు పార్టీలు మారిన వారు పెత్తనాలు చేయడం, పార్టీలో గ్రూపులు పెంచుతుండటంతో ఎన్ని అవాంతరాలు వచ్చినా పార్టీలోనే ఉన్న నాయకులు ఇప్పుడు వెనుకంజ వేస్తున్నారు. ఆది నుంచి పార్టీ జెండాను మోసిన నాయకులకు ప్రాధాన్యత కల్పించడం లేదనే భావన స్థానిక నాయకుల్లో నెలకొంది. ఏది ఏమైనా ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో ఇప్పటి నుంచే టిక్కెట్లను ఆశిస్తున్న నాయకులు పెద్దల ఆశీస్సుల కోసం పాట్లు పడుతున్నారు.

టాప్ హెడ్ లైన్స్

KTR vs Kavitha political war: కవిత వర్సెస్ కేటీఆర్ - ఈ రాజకీయం బీఆర్ఎస్ పునాదుల్ని కదిలించబోతోందా?
కవిత వర్సెస్ కేటీఆర్ - ఈ రాజకీయం బీఆర్ఎస్ పునాదుల్ని కదిలించబోతోందా?
BJP To Change Madhya Pradesh Rajasthan Chief Ministers: మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో సీఎంల మార్పు ఖాయమా? మోదీ-షా కొత్త ప్రయోగం వికటించిందా!?
మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో సీఎంల మార్పు ఖాయమా? మోదీ-షా కొత్త ప్రయోగం వికటించిందా!?
Hyderabad Old City Minority Voters: పాతబస్తీలో ఓటరు సంక్షోభం - SIRపై మైనారిటీల్లో అభద్రతా భావం.. కర్ణాటక మోడల్ డిమాండ్‌పై రేవంత్ సర్కార్ సైలెన్స్!
పాతబస్తీలో ఓటరు సంక్షోభం - SIRపై మైనారిటీల్లో అభద్రతా భావం.. కర్ణాటక మోడల్ డిమాండ్‌పై రేవంత్ సర్కార్ సైలెన్స్!
TDP BJP Silence On Ravan Issue: రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs ENG 4th T20I: భారత్‌పై తొలి టీ20ఐ సిరీస్‌ గెలుచుకున్న ఇంగ్లండ్! నాలుగో మ్యాచ్‌ గెలుచుకోవడంలో టీమిండియా విఫలం!
భారత్‌పై తొలి టీ20ఐ సిరీస్‌ గెలుచుకున్న ఇంగ్లండ్! నాలుగో మ్యాచ్‌ గెలుచుకోవడంలో టీమిండియా విఫలం!
MS Raju vs Thopudurthi Prakash Reddy: అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
Konda Surekha vs Kadiam Srihari: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Telangana Crime News: నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Sai Pallavi : కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Embed widget