అన్వేషించండి

Kesineni Nani Vijayawada Metro Rail: అందరూ మెట్రో కావాలంటారు.. నాని మాత్రం వద్దంటున్నారు - విజయవాడ రాజకీయాల్లో కేశినేని వ్యూహం వెనుక అసలు కథేంటి?

Kesineni Nani Political Comeback Strategy: కేశినేని నాని విజయవాడకు మెట్రో వద్దని ఉద్యమం చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇది పొలిటికల్ గేమ్ ప్లానా?

Kesineni Nani Just Asking Social Media Campaign:  సాధారణంగా ప్రతిపక్షాలు లేదా ప్రజాప్రతినిధులు తమ నగరానికి మెట్రో రైలు ప్రాజెక్టులు కావాలని, వేల కోట్ల నిధులు కేటాయించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తారు. కానీ విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన దారిలో నడుస్తున్నారు.  విజయవాడకు అసలు మెట్రో రైలు ప్రాజెక్టు అవసరమా? ఇది బెజవాడ ప్రజలకు వరమా? లేక శాపమా?  అంటూ ఆయన ఇటీవల సోషల్ మీడియా వేదికగా లేవనెత్తిన ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ, బెజవాడ వ్యాపార, రవాణా వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

విజయవాడకు మెట్రో అక్కర్లేదంటున్న కేశినేని నాని

కేశినేని నాని వాదన ప్రకారం.. విజయవాడ నగరానికి బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు అనే రెండే రెండు ప్రధాన రవాణా కారిడార్లు ఉన్నాయి. రూ.12,000 కోట్లతో ప్రారంభమయ్యే మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి 10 నుంచి 15 ఏళ్లు పడుతుందని, అప్పటికి దాని ఖర్చు రూ.24,000 కోట్లకు చేరుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఈ మెట్రో ప్రాజెక్టుకు అయ్యే మొత్తం ఖర్చులో కేవలం 25 శాతం నిధులు వెచ్చిస్తే.. నగరాన్ని డ్రైనేజీ సమస్య రహితంగా, పచ్చదనం, తాగునీరు, అగ్నిమాపక సదుపాయాలు మరియు ట్రాఫిక్ నిర్వహణ కలిగిన మోడల్ నివాస యోగ్య నగరంగా మార్చవచ్చని ఆయన సలహా ఇస్తున్నారు.విజయవాడ ప్రాథమిక మౌలిక వసతుల సాధనను సాకుగా చూపి మెట్రోను వద్దనడం.. క్షేత్రస్థాయిలో ప్రజల సెంటిమెంట్‌ను పట్టుకుని తన రాజకీయ రీ-ఎంట్రీకి స్థిరమైన పునాది వేసుకోవడానికేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం ఏ పార్టీలో లేని కేశినేని నాని

అయితే నాని వినిపిస్తున్న ఈ వాదన వెనుక పొలిటికల్ గ్రౌండ్ రియాలిటీ వేరే ఉందనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. గత సాధారణ ఎన్నికల ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరి ఓటమి చవిచూసిన కేశినేని నాని, ఆ తర్వాత వైసీపీకి దూరమయ్యారు. ప్రస్తుతం ఏ పార్టీలోనూ క్రియాశీలకంగా లేని ఆయన.. బెజవాడ ప్రజా సమస్యలపై జస్ట్ ఆస్కింగ్ పేరుతో వినూత్న ఉద్యమాన్ని ప్రారంభించి, తిరిగి విజయవాడ రాజకీయాల్లో ప్రాబల్యం సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విమర్శల్లో సాంకేతిక లోపం కూడా ఉందనేది నిపుణుల మాట. మెట్రో రైలు వంటి  మాస్ ట్రాన్సిట్ సిస్టమ్స్ కు విదేశీ సంస్థల నుంచి సాఫ్ట్ లోన్లు, కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సబ్సిడీలు అందుతాయి. ఈ ప్రత్యేక నిధులను స్థానిక రోడ్లు, డ్రైనేజీ లేదా మౌలిక వసతుల కోసం మళ్లించడం కుదరదు. పైగా అమరావతి రాజధాని నిర్మాణం ఊపందుకుంటున్న తరుణంలో.. గుంటూరు, అమరావతి, విజయవాడలను అనుసంధానించే మెట్రో వ్యవస్థ భవిష్యత్తుకు అత్యంత అవసరమని పారిశ్రామిక వేత్తలు భావిస్తున్నారు.

ముందు ముందు మరింతగా స్పందిస్తారా? 

ఇంకోవైపు, కేశినేని కుటుంబానికి రవాణా రంగం తో సుదీర్ఘ అనుబంధం ఉండటంతో, పట్టణ రవాణాలో మెట్రో వ్యవస్థ వస్తే అది సొంత వ్యాపార ప్రయోజనాలకు భంగం కలిగిస్తుందనే నెపంతోనే ఆయన వ్యతిరేకిస్తున్నారంటూ నెటిజన్ల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ఏది ఏమైనా.. మెట్రో నిధులను మౌలిక వసతులతో పోల్చుతూ కేశినేని నాని లేవనెత్తిన ఈ విచిత్ర విమర్శలు, విజయవాడ వేదికగా ఆయన రాజకీయ పునరాగమనానికి  ఎంచుకున్న ఒక వ్యూహాత్మక అడుగుగానే కనిపిస్తున్నాయి. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Municipal Elections: పోలింగ్‌కు ముందే 17 చైర్‌పర్సన్ స్థానాల్లో కూటమి ఏకగ్రీవం.. విజేతల పూర్తి వివరాలు
పోలింగ్‌కు ముందే 17 చైర్‌పర్సన్ స్థానాల్లో కూటమి ఏకగ్రీవం.. విజేతల పూర్తి వివరాలు
Karnataka Political Sting Operation 2026: కర్ణాటక రాజకీయాల్లో స్టింగ్ కలకలం - సొంత పార్టీ నేతలపై సిద్ధరామయ్య ఆరోపణలు.. అసలేం జరుగుతోంది?
కర్ణాటక రాజకీయాల్లో స్టింగ్ కలకలం - సొంత పార్టీ నేతలపై సిద్ధరామయ్య ఆరోపణలు.. అసలేం జరుగుతోంది?
Telangana El Nino: ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
AIMIM AP Local Body Elections: ఏపీ స్థానిక పోరులో ఎంఐఎం - కడప, హిందూపురంలో బరిలోకి ఒవైసీ.. వైసీపీకి ఊహించని దెబ్బ?
ఏపీ స్థానిక పోరులో ఎంఐఎం - కడప, హిందూపురంలో బరిలోకి ఒవైసీ.. వైసీపీకి ఊహించని దెబ్బ?
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Embed widget