KCR Sketch : కేసీఆర్ సైలెంట్ స్కెచ్.. ఇంకా ఏం క్లిప్పులు బయటకొస్తాయో ?
తెలంగాణ రాజకీయ చదరంగంలో కేసీఆర్ ఎవరూ ఊహించని ఎత్తులు వేస్తున్నారు. ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. కేసీఆర్ తర్వాత స్టెప్ ఏమిటనేది ప్రత్యర్థులకు అంతు చిక్కకుండా ఉంది.
KCR Sketch : కేసీఆర్ మాటల మనిషని మనందరికీ తెలుసు... అవి ఏ రేంజ్ లో పేలుతుంటాయో కూడా తెలుసు. సాధారణంగా మనుషులు సైలంట్.. పనులు వైలంట్ అని మనం చెప్పుకుంటాం.. కానీ కేసీఆర్ మాటలు.. చేతలు రెండూ వయలెంటే.. అంటే.. ఇంకేదో అనుకోకండి.. అగ్రెషన్ గురించి చెబుతున్నా.. అసులు ఇప్పుడిదంతా ఎందుకంటే.. మూడు రోజుల కిందట ఓ బాంబు పేలింది. టీఆరెఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు స్కెచ్ వేస్తున్నారంటూ.. ఓ వార్త బయటకొచ్చింది. ముగ్గురు వ్యక్తులను ఆన్ ది స్పాట్ అరెస్ట్ కూడా చేశారు. అంతపెద్ద ఇన్సిడెంట్ తర్వాత.. పొలిటికల్ గా ప్రకంపనలొస్తాయని అంతా అనుకున్నారు. కానీ ఆ రాత్రి హడావిడి తప్ప.. కేసీఆర్ క్యాంప్ నుంచి అందరూ సైలంట్. ఆ రోజు మాత్రం.. ఇది బీజేపీ చేయించిందని ఒక ఫీలర్ అంతే. అప్పటి నుంచి బీజేపీ హడావిడి పడుతోంది.. తప్ప టీఆరెస్ పెద్దగా రియాక్టవలేదు. పైగా ఎవరినీ మాట్లాడొద్దంటూ కేటీఆర్ అందరికీ ఆదేశాలు కూడా ఇచ్చారు.
కేసీఆర్ మౌనం వెనుక వయోలెంట్ వ్యూహం ఉందా ?
బుధవారం రాత్రి ప్రగతి భవన్ కు వెళ్లిన ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, హర్షవర్థన్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజు బయటకు కూడా రాలేదు. వాళ్లు బయట ఎక్కడా కనిపించకపోవడంతో మూడు రోజులుగా ప్రగతిభవన్ లోనే ఉన్నారని భావిస్తున్నారు. కేసీఆర్ మౌనం వెనుక ఏదో వ్యూహం ఉందని.. అదును చూసి దెబ్బ కొడతారని అంతా అనకున్నారు. అనుకన్నట్లుగానే ఓ ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. బయటకు రానివి ఇంకేమున్నాయో తెలీదు కానీ..ఇది మాత్రం బీజేపీని కలవరపెట్టింది. ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ పేరు అధికారికంగా బయటకు రాలేదు. 25 రాత్రి ముగ్గురు వ్యక్తులను అదుపలోకి తీసుకున్నారు. అందులో ఢిల్లీకి చెందిన స్వామీజీ రామచంద్ర భారతి, లోకల్ గా ఉన్న మరో స్వామీజీ సింహయాజి, స్థానిక వ్యాపారి నందకుమార్ ఉన్నారు. వీళ్ల పేర్లు బయటక వచ్చిన కొన్ని నిమిషాల్లోనే వీల్లు బీజేపీ నేతలతో కలసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాకు వచ్చేశాయి. అంటే తెరవెనుక చేస్తోంది బీజేపీ అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు.
బీజేపీ ఎదురుదాడిలో కంగారు !
దీనిపై బీజేపీ కూడా తీవ్రంగా రియాక్టైంది. వాళ్ల గెస్ట్ హౌస్ లో కొంటారా.. వాళ్లని కొంటారా.. వాళ్లు అర్థరూపాయకు పనికిరారు.. వందలకోట్లా.. ఇలా మూడు రోజులు ఇదే నడిచింది. అయినా టీఆరెస్ నుంచి అధికారిక స్పందన రాలేదు. ఆ ఎమ్మెల్యేలూ మాట్లాడలేదు. ముఖ్యమైన లీడర్లు.. కేటీఆర్, కేసీఆర్, హరీష్ వంటి వాళ్లు రెస్పాండ్ కాలేదు. ఇంకో వైపు ఎమ్మెల్యేలు బయటకు కూడా రావడం లేదు. అంతా పోలీసులే చూసుకుంటార ని టీఆరెస్ చెబుతూ వచ్చింది. ఎప్పుడైతే.. ఏసీబీ కోర్టు వాళ్ల రిమాండ్ ను తిరస్కరించిందో... ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. ముందు బీజేపీ నేతలతో ఉన్న ఫోటోలు పెట్టిన టీరెఎస్.. ఈ సారి.. దానిని మరింత ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసింది. రెండు ఆడియో క్లిప్పుల్లో బీజేపీ ప్రస్తావన వచ్చింది. ఈ క్లిప్పుల్లో ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకుంటున్న సంబాషణ ఉంది. రోహిత్ రెడ్డితో రామచంద్రభారతి సంప్రదింపులు జరిపితే...నందకుమార్ మీడియేషన్ చేస్తున్నట్లుగా ఆ గొంతులున్నాయి. బయటా అదే ప్రచారం జరుగుతోంది. జనరల్ గా ఇలాంటి విషయాలపై టీఆరెస్ చాలా మాటల్లో చాలా తీవ్రంగా స్పందిస్తుంటుంది. కానీ ఈ సారి అలా లేదు. కేసీఆర్ అసలు నోరుతెరవడం లేదు. కనీసం కేటీఆర్ మాట్లాడటం లేదు. సైలెంట్ గా షాకులిస్తున్నారు.
రేవంత్ రెడ్డి ఇరుక్కున్న తరహాలో సైలెంట్ ఆపరేషన్ !
ఇదంతా చూస్త్తుంటే.. 2015లో రేవంత్ రెడ్డి ఇష్యూ* గుర్తుకొస్తోంది కదా.. ఇదీ అలాగే జరిగింది. చాలా సైలంట్ ఆపేరేషన్ అది.. కానీ ఇప్పడేం జరిగింది అని అప్పుడే తెలీడం లేదు. అవతలి వాళ్లు ట్రై చేస్తే.. వీళ్లు ట్రాప్ చేశారా.. లేక అవతలి వారికి ఫీలర్లు వదిలి వాళ్లనే అప్రోచ్ అయ్యారో తెలీదు కానీ.. తెలంగాణలో ఈ రాజకీయం రక్తి కట్టిస్తోంది. తాజాగా లీకైన ఆడియోలో సంభాషణల్లో నేరుగా లేకపోయినా పెద్దల ప్రస్తావన ఉంది.ఈడీ, ఐటీ అని చెబుతున్నారు. దీనిని లీగల్ వ్యాలిడిటీ ఏముంది.. పబ్లిక్ ఎలా తీసుకుంటున్నారన్నవి పక్కన పెడితే.. రాజకీయంగా ఈ విషయంలో టీఆరెస్ మాత్రం పై చేయి సాధించింది. బీజేపీ ఇందులో విక్టిమ్స్, ప్రిడేటర్సూ ఒక్కరే అని చెప్పడానికి ట్రై చేస్తోంది. ఎందుకంటే అలాంటి డీల్స్ బహిరంగంగా చేస్తారా.. వాళ్ల ఫామ్ హౌసుల్లోనే చేస్తారా అంటోంది. కానీ తాజాగా వచ్చిన ఆడియో క్లిప్స్ తో ఆ పార్టీ ఒకింత డిఫెన్సులో పడిపోయింది. ఎందుకంటే.. బీజేపీ ఇలాంటి డీలింగ్స్ చాలా చేసే అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను మార్చింది అనే ఆరోపణలు ఎదుర్కొంటోంది.
కేసీఆర్ తర్వాత ఏం చేయబోతున్నారు ?
కేసీఆర్ ఇంకా ఏం చేస్తారో.. ఎప్పుడు ఏం బయటకు వదులుతారో తెలీదు. కానీ ఈలోగా చాలా రియాక్లన్లు వచ్చేస్తున్నాయి. బండిసంజయ్ అయితే.. యాదిగిరి గుట్టకు పైగా తడిబట్టలతో ప్రమాణం కూడా చేసేశారు. కేసును సీబీఐకు ఇవ్వమని కిషన్ రెడ్డి చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ అయితే ఈ రెండు పార్టీలకు ఇది అలవాటే అని చెబుతోంది. ఎందుకంటే.. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి వెళ్లినోళ్లే. రాహుల్ గాంధీ అందుకే ఈ రెండు పార్టీలు చేసే పనే ఇదన్నారు. ముందున్న మునుగోడు బెనిఫిట్ సాధించడానికి ఎమ్మెల్యేలను లాగేందుకు ప్రయత్నించారా.. లేకే అదే ఎన్నికలను తేల్చేందుకు మొత్తం ఇదొక సెటప్ లా చేశారా అన్నది ఇప్పుడే తేలదు కానీ.. ఇప్పటికైతే.. ఆట ఆకట్టుకుంటూనే ఉంది. అన్నింటికన్నా కేసీఆర్ రియాక్షన్ కోసం మొత్తం పోలిటికల్ ఎరేనా ఎదురుచూస్తోంది. ఆయన టైమూ... టైమింగ్ చూసుకుని వస్తారు కదా.. సో ఘడియ కోసం చూడాలి..!