BRS Chief KCR : 20కిపైగా ఎమ్మెల్యేలకు ఈ సారి మొండి చేయే - అభ్యర్థులపై కేసీఆర్ క్లారిటీకి వచ్చేసినట్లేనా ?
ప్రజలను మెప్పించేవిధంగా పని చేసిన ఎమ్మెల్యేల జాబితాను కేసీఆర్ రెడీ చేసుకున్నారు. ఈ సారి 20 మంది ఎమ్మెల్యేలకు గడ్డు పరిస్థితేనని చెబుతున్నారు.
BRS Chief KCR : తెలంగాణలో ఎన్నికలు ఏడాది చివరిలో జరగనున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్ కల్లా అభ్యర్థుల్ని ప్రకటించాలని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు ఆయన వివిధమార్గాల ద్వారా సర్వేలు తెప్పించుకుని కసరత్తు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేల గురించి సమాచారం సేకరించారు. ఇటీవల కార్యవర్గ సమావేశంలో కొంత మంది ఎమ్మెల్యేలు చేస్తున్న దందాపై నేరుగానే హెచ్చరికలు జారీ చేశారు. ఇలా ప్రతీ ఒక్కరి పనితీరుతో పాటు నియోజకవర్గంలో వారి కుటంబసభ్యల జోక్యం వారి వ్యాపారాలు, ప్రజల పట్ల వారు వ్యవహరిస్తున్న తీరు, లబ్ధిదారుల ఎంపికలో వారి పాత్ర మొత్తంసేకరించి అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు.
నలుగురు మంత్రులతో పాటు 20 మంది ఎమ్మెల్యేలకు టిక్కెట్లు కష్టమే !
బీఆర్ఎస్ వర్గాల్లో విస్తృతంగా జరుగుతున్న ప్రచారం మేరకు అధికార పార్టీ చెందిన నలుగురు మంత్రు లతో పాటు 22 మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని కేసీఆర్ అంచనాకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఎనిమిది మంది ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని హైదరాబాద్ కేంద్రంగా వారు తమ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ వారం పది రోజుల కొకసారి నియోజక వర్గానికి వెళ్తున్నట్లుగా తేలింది. అలాగే వేములవాడ ఎమ్మెల్యే ఎక్కువగా జర్మనీలోనే ఉంటారు. వెనుకపడినట్లుగా భావిస్తున్న ఎమ్మెల్యేలను పిలిచి చివరిసారిగా హెచ్చరి కలు జారీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. తర్వాత కూడా పద్దతి మార్చుకోకపోతే.. కొత్త వారికి టిక్కెట్ ఖరారు చేస్తారు.
ఈ సారి మొహమాటలకు పోకూడదనుకుంటున్న కేసీఆర్
ఈ దఫా జరిగే అసెంబ్లీ ఎన్నికలు కీలకం కావడంతో టికెట్ల కేటాయింపులో గతంలో మాదిరిగా కాకుండా ఈ దఫా అత్యంత కఠినాతి కఠినంగా వ్యవహరించాలన్న నిర్ణయానికి భారాస అధినేత కేసీఆర్ వచ్చినట్టు- సమాచారం. సిట్టింగ్ ఎమ్యెల్యేలందరికీ మళ్ళీ పోటీ చేసే అవకాశం ఇస్తామంటే ప్రజల్లో వ్యతిరేకత పెంచుకోవడం కాదని అంటున్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా సీఎం కేసీఆర్ వారిని ఉపేక్షిస్తూ వచ్చారని, ఇదివరకు జరిగిన పలు ఎన్నికల్లో ఇలా ఎన్నో జరిగాయని గుర్తు చేస్తున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజలతో సాన్నిహితంగా ఉండాలని ప్రతి సమావేశంలో దిశానిర్దేశం చేస్తున్నా కొంతమంది ఎమ్మెల్యేలు తమ వైఖరిని మార్చుకోవడం లేదని, దీంతో పార్టీ ఆయా నియోజకవర్గాల్లో పలచన అవుతోందని భావిస్తున్నారు.
వెనుకడ్డారనిభావిస్తున్న వారికి త్వరలో ప్రగతి భవన్‌లో క్లాస్
ప్రత్యర్థి పార్టీల బలాబలాలు, వారి వ్యూహం ఎత్తులకు పై ఎత్తులు వేయడంలోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదన్న సమాచారం కేసీఆర్‌కు అందుతోందని చెబుతున్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలు తీరుతెన్నులు, లబ్ధిదారుల అభిప్రాయాలు కూడా సేకరించి...తదుపరి నిర్మయం తీసుకోనున్నారు. మంత్రుల పనితీరుపై కేసీఆర్ ఒక అభిప్రాయానికి వచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈనెల 26న మహారాష్ట్రలో నిర్వహి స్తున్న బహిరంగ సభ తర్వాత వెనుకబడిన మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రగతిభవన్‌కు పిలిపించి తుది హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందంటున్నారు. ఎలా చూసినా ఇరవై మంది ఎమ్మెల్యేలకు ఈ సారి టిక్కెట్లు ఉండకపోవచ్చంటున్నారు.