అన్వేషించండి

Jr NTR Apolitical : టీడీపీ క్యాడర్ విమర్శలు, ఇతర పార్టీల సమర్థింపులు - గురి తప్పిన జూ.ఎన్టీఆర్ "అపొలిటికల్" రియాక్షన్ !

రాజకీయానికి సంబంధం లేదన్నట్లుగా స్పందించాలనుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. ఆయన స్పందన చుట్టూ రాజకీయమే జరుగుతోంది.

 

Jr NTR Apolitical :  ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీ అని పేరు పెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడం చివరికి జూనియర్ ఎన్టీఆర్‌కు ఇబ్బందికరంగా మారింది. ఈ ఇష్యూ జరిగినప్పటి నుండి "మహానుభావుడి మనవడి"గా ఆయన స్పందించరేమిటని చాలా మంది రకరకాలుగా మాట్లాడారు. తీరా స్పందించిన తర్వాత ఇదేమి స్పందన అనడం ప్రారంభించారు. జూనియర్ ఎన్టీఆర్ స్పందన టీడీపీ అభిమానులకు అసలు నచ్చకపోగా ఇతర పార్టీల వారికి మాత్రం ఎంతో బాగా నచ్చింది. మామూలుగా అయితే ఆయన స్పందన టీడీపీ వాళ్లకు నచ్చాలి. కానీ అక్కడే తేడా వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ ఎందుకిలా ట్వీట్ చేశారనేది అందరి చర్చ.

రాజకీయ వాసన లేకుండా స్పందించిన జూనియర్ ఎన్టీఆర్!

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు తొలగింపు అంశంపై జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి రాజకీయ వాసనలు లేకుండా స్పందించారు.  ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఇద్దరూ ప్రజా నాయకులేనన్నారు. ఒకరి పేరు తీసేయడం.. మరొకరి పేరు పెట్టడం వల్ల వారికి ప్రత్యేకమైన నష్టం ఏమీ ఉండదని  చెప్పారు. ఇందులో రాజకీయం లేదు. ఏమి స్పందిస్తే ఎలా అవుతుందో అన్న సంశయంతో రాజకీయం తన మీదకు రాకుండా జాగ్రత్తగా కొలతలు వేసకుుని జూనియర్ ఎన్టీఆర్ స్పందించినట్లుగా అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ కొలతలు తప్పాయి. జూనియర్ ఎన్టీఆర్ స్పందనలో మొత్తం రాజకీయాన్నే చూస్తున్నారు.. అటు టీడీపీ నేతలు.. ఇతర పార్టీల వాళ్లు కూడా ! 

వైఎస్ఆర్‌ను ఎన్టీఆర్‌తో ఎలా పోల్చుతారని టీడీపీ ఫ్యాన్స్ ప్రశ్నలు !

ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టినందున జూనియర్ ఎన్టీఆర్ కు వైఎస్ఆర్ ప్రస్తావన తీసుకు రాక తప్పలేదు. ఆయనను కూడా ప్రజానాయకుడిగానే జూనియర్ ఎన్టీఆర్ గుర్తించారు. అయితే ఆయన ట్వీట్‌లో  ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఇద్దరూ ఒకటేనన్న వాదన వినిపించింది. అది తెలుగుదేశం పార్టీ నేతలకు అసలు నచ్చలేదు. ఆ మహానుభావుడితో  వైఎస్ఆర్‌ను ఎలా పోలుస్తారని.. ఎన్టీఆర్ గొప్పతనాన్ని చెప్పడం ప్రారంభించారు. ఎన్టీఆర్ వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో కల్యాణ్ రామ్ కూడా స్పందించారు. ఆయన స్పందన టీడీపీ నేతలకు నచ్చింది. వైఎస్ఆర్ ప్రస్తావన లేకుండా.. ఏపీ ప్రభుత్వ చర్యను తప్పు పడుతూ  ట్వీట్ చేశారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఆ లౌక్యం చూపించలేకపోయారు. ఓ వైపు ఎన్టీఆర్ కుమార్తె, చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని వైఎస్ఆర్‌సీపీ నేతలు తీవ్రంగా విమర్శించినా ఎన్టీఆర్ సరైన రీతిలో స్పందించలేదన్న  అసంతృప్తి ఆ పార్టీ అభిమానుల్లో ఇప్పటికే ఉంది. ఇప్పుడు  మూల పురుషుడైన  తాత ఎన్టీఆర్‌ను అవమానిస్తున్నా.. సరైన రీతిలో స్పందించలేదన్న అభిప్రాయానికి ఎక్కువ మంది వచ్చేశారు. 

జూనియర్‌కు మద్దతుగా ఇతర పార్టీల నేతల స్పందనలు !

ఓ వైపు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉంటే.. ఆయనకు మద్దతుగా ఇతర పార్టీల వాళ్లు తెరపైకి రావడం.. జూనియర్ ను మరింత ఇబ్బంది పడుతోంది. గొప్పగా స్పందించారంటూ బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి ట్విట్ పెట్టేశారు. ఇటీవల అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్ కలిసిన సందర్భంగా విష్ణువర్దన్ రెడ్డి మరింత అడ్వాంటేజ్ తీసుకుని ఆయన బీజేపీతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నట్లుగా ప్రకటనలు చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ స్పందించారు . 

ఒక్క  బీజేపీ నేతలే కాదు.. వైఎస్ఆర్‌సీపీ మద్దతు దారులు కూడా జూనియర్ ను సమర్థిస్తున్నారు. ట్వీట్లు పెడుతున్నారు. 

జూనియర్ టీడీపీకి దూరమై ఇతర పార్టీలకు దగ్గరయ్యారా ?

ఎన్టీఆర్‌కు జరిగిన అవమానంపై స్పందించడం ద్వారా ఆయన పెట్టిన పార్టీ క్యాడర్‌ను సంతృప్తి పరచాల్సిన జూనియర్ ఎన్టీఆర్ అనూహ్యంగా ఇతర పార్టీల వారికి నచ్చుతున్నారు. దీంతో సహజంగానే ఎన్టీఆర్ తీరుపై రాజకీయవర్గాల్లో సందేహాలు ప్రారంభమయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివసరావు గత ఎన్నికలకు ముందు వైఎస్ఆర్‌సీపీలో చేరారు.  తెలుగుదేశం పార్టీపై, చంద్రబాబు కుటుంబంపై అసభ్య దూషణలకు దిగే వల్లభనేని వంశీ, కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ ప్రాణమిత్రులనే ప్రచారం ఇప్పటికే ఉంది.ఇలాంటి పరిస్థితుల్లో ఆయన తప్పనిసరిగా స్పందించాల్సిన పరిస్థితుల్లో .. టీడీపీ క్యాడర్‌ను.. మాత్రం సంతృప్తి పరచలేకపోతున్నారు. ఇతర పార్టీల వారికి మాత్రం నచ్చుతున్నారు. ఇది యాధృచ్చికమో.. వ్యూహమో తెలియదు కానీ.. ఎన్టీఆర్ మాత్రం టీడీపీ క్యాడర్ అంచనాలను అందుకోలేకపోతున్నారు. 

ఎంత దూరంగా ఉన్నా జూనియర్ పై రాజకీయ ముద్ర ఖాయం.. తప్పించుకోవాలనకుంటే జరిగేది ఇదే !

జూనియర్ ఎన్టీఆర్ గతంలో టీడీపీకి ప్రచారం చేశారు. తర్వాత కెరీర్ పై దృష్టి పెట్టారు. ఈ లోపు  ఆయనకు కుటుంబంలో విభేదాలు వచ్చాయన్న ప్రచారం జరిగింది. అది నిజమో కాదో వారికే తెలియాలి. ఆయన మాత్రం రాజకీయాలుక దూరంగా ఉన్నానని తటస్థంగా ఉండేందుకు ఇలాంటి ప్రకట నలు చేస్తున్నారని  విశ్లేషిస్తున్నారు. కానీ ఎలా చూసినా ఎన్టీఆర్‌పై టీడీపీ ముద్ర ఖచ్చితంగా ఉంటుంది. అది చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. దాన్ని తప్పించుకోవాలంటే ఆయనపై ఇతర పార్టీల ముద్ర పడుతుంది. దీనికి తగ్గట్లుగా ఆయన తన "అపాలిటికల్" విధానాన్ని వ్యూహాత్మకంగా ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇదే పరిస్థితి ఎదురవుతుంది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Pondicherry Trip : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Pondicherry Trip : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Changes In Futures And Options: చిన్న మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్‌ లేనట్టే, రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!
చిన్న మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్‌ లేనట్టే, రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!
Weak Passwords: ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Embed widget