అన్వేషించండి

Jeevan Reddy:రెండు సార్లు కేసీఆర్‌పై పోటీ చేసిన జీవన్ రెడ్డి ఇప్పుడు ఆయన పార్టీలోకే !

Jeevan Reddy:తెలంగాణ రాజకీయాల్లో జీవన్ రెడ్డిది ఓ ప్రత్యేక శైలి. అంతే కాదు ఏ కేసీఆర్‌పై రెండు సార్లు పోటీ చేశారో ఇప్పడు అదే కేసీఆర్ పార్టీలోకి వెళుతుండటం ఆసక్తికర పరిణామం కూడా.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కేసీఆర్ పై రెండుసార్లు పోటీ చేసిన జీవన్ రెడ్డి, ఇప్పుడు బీఆర్ఎస్ లోకి వెళ్తున్నారు.
  • 42 ఏళ్ల కాంగ్రెస్ ప్రయాణం తరువాత, సీనియర్లకు గౌరవం లేదని అసంతృప్తితో ఉన్నారు.
  • సాధారణ జీవనశైలి, నియోజకవర్గానికే పరిమితమయ్యే ప్రత్యేకత కలిగిన నేత జీవన్ రెడ్డి.
  • రేవంత్ రెడ్డి నాయకత్వ శైలి, ఫిరాయింపుల రాజకీయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Jeevan Reddy: తెలంగాణ రాజకీయాల్లో జీవన్ రెడ్డిది  ఓ ప్రత్యేక శైలి. 1983లో మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచినా ఇంకా సొంత నియోజకవర్గానికి మాత్రమే అంటిపెట్టుకుని ఉన్న అరుదైన నేత. అంతే కాదు ఏ కేసీఆర్‌పై రెండు సార్లు పోటీ చేసారో ఇప్పడు అదే కేసీఆర్‌ పార్టీలోకి వెళుతుండటం ఆసక్తికర పరిణామం. ఒకప్పుడు ఎవరినైతే ఓడించడానికి తన సర్వశక్తులూ ఒడ్డారో, నేడు అదే నాయకుడి వెనుక నడవడానికి సిద్ధపడ్డారు. జగిత్యాల ప్రజల తలలో నాలుకగా మెదిలి, కాంగ్రెస్ కోటను కాపాడిన తాటిపర్తి జీవన్ రెడ్డి, నేడు గులాబీ కండువా కప్పుకోవడం వెనుక రాజకీయ అవసరాలకు మించిన ఆత్మగౌరవం, అసంతృప్తి దాగి ఉన్నాయి.

రెండు సార్లు కేసీఆర్ పై పోటీ.. నేడు కేసీఆర్ వెంట!

తెలుగు రాష్ట్రాల రాజకీయాలు తెలిసిన ఎవరికైనా జీవన్ రెడ్డి పేరు సుపరిచితం. నేటి ధిగ్గజనేతలు కేసీఆర్, చంద్రబాబు సమకాలికుడే కాదు, 1983లోనే ఎమ్మెల్యే.. యువ మంత్రి, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పలు పర్యాయాలు ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్ గడ్డుకాలంలో చాలా సందర్భాల్లో జీవన్ రెడ్డి గెలిచి తన ప్రత్యేకత చాటుకున్నారు. అంతే కాదు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న వేళ కేసీఆర్ సెంటిమెంటును కొనసాగించేందుకు రాజీనామాలు, ఉపఎన్నికల ఎత్తుగడలు వేసేవారు అలా 2006, 2008 కరీంనగర్ లోక్‌సభ ఉపఎన్నికల్లో కేసీఆర్ పై కాంగ్రెస్ తరఫున పోటీకి నిలిచారు. మొదటిసారి రెండు లక్షల ఓట్లతో కేసీఆర్ గెలిచినా.. 2008లో మాత్రం వైఎస్ సహకారంతో జీవన్ రెడ్డి కేసీఆర్ కు ముచ్చెమటలు పట్టించారు. కరీంనగర్ లో తనకు ఎదురు లేదనుకున్న గులాబీ నేతను దాదాపు ఓటమి అంచులదాకా నెట్టి కేవలం 15వేల మెజారిటీ మాత్రమే ఇచ్చారు. కానీ, కాలక్రమేణా పరిస్థితులు మారాయి. నేడు అదే కేసీఆర్ నాయకత్వాన్ని కీర్తిస్తూ, "ప్రజలు కోరిన దానికంటే ఎక్కువే చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్" అని జీవన్ రెడ్డి కీర్తించే దాకా పరిణామాలు మారాయి. శత్రువు నుంచి మిత్రుడిగా మారిన ఈ ప్రస్థానం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

సింప్లిసిటీకి బ్రాండ్ అంబాసిడర్: అదే ఇల్లు, ఆదే పాత డెస్కు

జీవన్ రెడ్డి అంటే సంప్రదాయ రాజకీయ నాయకత్వానికి ఉదాహరణ. ఆయన ఇల్లు, ఆఫీసు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఆధునిక కార్పొరేట్ రాజకీయాల హంగులు ఆయన దరిచేరలేదు. ఆయన ఆఫీసు డెస్కు దశాబ్దాల నాటి పాత శైలిలో ఉంటుంది. అత్యంత సాధారణంగా ఉండే ఆ గదిలోనే వేల మందిని ప్రతిరోజూ కలుస్తుంటారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసినా ఆయన జీవనశైలి మారలేదు. కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే ‘ఓపెన్ డోర్’ పాలసీ ఆయనది. గల్ఫ్ బాధితులైనా, స్థానిక పేదలైనా ఆయన వద్దకు వెళ్లి కష్టాలు తీర్చమని అడుగుతారు. ఇంటికి వచ్చిన వారికి పప్పు, పచ్చిపులుసు, మామిడికాయ తొక్కుతో ‘సింపుల్ లంగర్’ దశాబ్దాలుగా వడ్డిస్తున్నారు. వైఎస్ హయాంలో అత్యధిక సీఎం రిలీఫ్ ఫండ్ సాధించుకున్న నేత కూడా జీవన్ రెడ్డి గారే. 

ఢిల్లీ క్యూలైన్లకు దూరం

కాంగ్రెస్ నాయకులకు ఢిల్లీ పర్యటనలు, 10 జనపథ్ అపాయింట్‌మెంట్ కోసం పడిగాపులు సర్వసాధారణం. కానీ, జీవన్ రెడ్డి శైలి వేరు. ఆయన ఎన్నడూ పదవుల కోసం ఢిల్లీ వీధుల్లో లాబీయింగ్ చేయలేదు. తనకు పదవి రావాలన్నా, పోవాలన్నా అది తన పనితీరు మీద ఆధారపడాలే తప్ప హైకమాండ్ ప్రదక్షిణల వల్ల కాదన్నది ఆయన నమ్మకం. తన నియోజకవర్గమే ఢిల్లీ, ప్రజలే హైకమాండ్ అన్నట్లుగా సాగుతారు. ఇప్పుడు రేవంత్ తో వైరం కూడా ఆ ఆత్మగౌరవ ప్రతిష్టతోనే వచ్చిందని చెబుతారు. 

రేవంత్ శైలిపై తీవ్ర అసంతృప్తి 

42 ఏళ్ల పాటు పార్టీతో నడిచి నేడు వీడటానికి జీవన్ రెడ్డి చెప్పిన కారణాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేశాయి. "తెలంగాణ ప్రజలు మార్పు కోసం ఆశపడి ఓటేశారు, కానీ నేడు నిరాశకు గురవుతున్నారు" అని ఆయన చేసిన విమర్శలు చాలా ఘాటైనవి. ఫిరాయింపుల రాజకీయాలను ప్రోత్సహించడం, సీనియర్లకు గౌరవం ఇవ్వకపోవడం వంటి అంశాలు ఆయన ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయి. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు 2014లో ఒంటరి పోరాటం చేసి గెలిచిన తనకు, నేడు సొంత పార్టీలోనే గుర్తింపు కరువైందన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తక్కువేం చేసామంటున్న కాంగ్రెస్.

జీవన్ రెడ్డిని కాంగ్రెస్ ఎప్పుడూ గౌరవించింది. 2018లో ఓడిపోతే ఎమ్మెల్సీని చేసింది. అంతకు ముందు కాంగ్రెస్ హయాంలో మంత్రిని చేసింది. మొత్తం 14 సార్లు జీవన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. బుజ్జగించేందుకు జాతీయ నేతలు, పీసీసీ అధ్యక్షులతో సహ అందరూ ఆయన ఇంటికి వెళ్లి కాంగ్రెస్ లో కొనసాగాలని కోరారు. కేవలం ఒకరితో ఆభిజాత్యానికి పోయి తల్లిలాంటి పార్టీని వీడటం సరికాదని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ లాంటి కుటుంబ పార్టీలోకి వెళ్తే కేసీఆర్ ప్రేమలు ఎప్పటికీ ఉండవని హెచ్చరిస్తున్నారు.

జగిత్యాల గడ్డపై తనకంటూ ఒక ముద్ర వేసుకున్న జీవన్ రెడ్డి, ఇప్పుడు కేసీఆర్ గూటికి చేరబోతున్న నేపథ్యంలో.. ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలు మారతాయా. రాజకీయం అంటే కేవలం అధికారమే కాదు, ఆత్మగౌరవంతో కూడిన ప్రయాణం అని జీవన్ రెడ్డి చెప్పకనే చెబుతున్నారు. బిఆర్ఎస్‌లో ఆయన ప్రస్థానం ఎలా సాగుతుందో.. తన కోడలికి రాజకీయ వారసత్వం అప్పగించి వానప్రస్తంలోకి జారుకుంటారో చూడాలి!

Frequently Asked Questions

తెలంగాణ రాజకీయాల్లో జీవన్ రెడ్డి ఎందుకు వార్తల్లో నిలిచారు?

జీవన్ రెడ్డి రెండు సార్లు కేసీఆర్ పై పోటీ చేసి, ఇప్పుడు అదే కేసీఆర్ పార్టీలో చేరబోతున్నందున వార్తల్లో నిలిచారు. ఆయన ఒకప్పుడు ఓడించడానికి ప్రయత్నించిన నాయకుడి వెంట నడవడానికి సిద్ధపడ్డారు.

జీవన్ రెడ్డి కేసీఆర్ పై ఏ ఎన్నికల్లో పోటీ చేశారు?

జీవన్ రెడ్డి 2006 మరియు 2008 కరీంనగర్ లోక్ సభ ఉప ఎన్నికల్లో కేసీఆర్ పై కాంగ్రెస్ తరపున పోటీ చేశారు.

జీవన్ రెడ్డి రాజకీయ శైలి ఎలా ఉంటుంది?

జీవన్ రెడ్డిది అత్యంత సాధారణ జీవనశైలి. ఆయన ఆఫీసు, ఇల్లు ఆధునిక ఆర్భాటాలకు దూరంగా ఉంటాయి. ఆయన ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు.

జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడుతున్నారు?

రేవంత్ రెడ్డి శైలిపై అసంతృప్తి, సీనియర్లకు గౌరవం ఇవ్వకపోవడం, ఫిరాయింపుల రాజకీయాలను ప్రోత్సహించడం వంటి కారణాలతో ఆయన కాంగ్రెస్ ను వీడుతున్నారు. సొంత పార్టీలోనే గుర్తింపు లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డిని ఎలా గౌరవించింది?

కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డిని ఎప్పుడూ గౌరవించింది. 2018లో ఓడిపోతే ఎమ్మెల్సీని చేసింది, అంతకుముందు మంత్రిని చేసింది. 14 సార్లు టికెట్ ఇచ్చింది.

టాప్ హెడ్ లైన్స్

TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Telangana Power Crisis: తెలంగాణలో కరెంట్ కష్టాలు - రూ.5,420 కోట్ల ట్రూ-అప్ షాక్ - ప్రజాగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పించుకోగలదా?
తెలంగాణలో కరెంట్ కష్టాలు - రూ.5,420 కోట్ల ట్రూ-అప్ షాక్ - ప్రజాగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పించుకోగలదా?
KCR Farmhouse 45 Acres Missing Land: కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 45 ఎకరాల మిస్సింగ్ భూమి కలకలం - నోటీసులు రెడీ..రాజకీయ భూకంపం తప్పదా?
కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 45 ఎకరాల మిస్సింగ్ భూమి కలకలం - నోటీసులు రెడీ..రాజకీయ భూకంపం తప్పదా?
TDP Janasena Seat Sharing: స్థానిక పోరులో పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ - 7 కార్పొరేషన్లపై కన్ను.. చంద్రబాబు రియాక్షన్ ఏంటి?
స్థానిక పోరులో పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ - 7 కార్పొరేషన్లపై కన్ను.. చంద్రబాబు రియాక్షన్ ఏంటి?

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget