అన్వేషించండి

Karimnagar Jeevan Reddy: బీఆర్ఎస్‌లో కేకే పదవి జీవన్ రెడ్డికి - కోడలికి టిక్కెట్ కూడా - సీనియర్‌కు తగ్గ డీలేనా?

Jeevan Reddy: జీవన్ రెడ్డి వంటి ఉద్ధండుడైన నేతను పార్టీలోకి ఆహ్వానించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ ఆఫర్లు ప్రకటించినట్లు తెలుస్తోంది. సెక్రటరీ జనరల్ పదవితో పాటు ఆయన కోడలికి టిక్కెట్ ఆఫర్ చేశారు

Jeevan Reddy BRS:  తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నేత, దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ జెండా మోసిన తాటిపర్తి జీవన్ రెడ్డి పార్టీని వీడటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.    దాదాపు 42 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం తర్వాత, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. కేవలం పార్టీని వీడటమే కాకుండా, తన తదుపరి రాజకీయ ప్రయాణాన్ని భారత్ రాష్ట్ర సమితి  తో కొనసాగించాలని ఆయన నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా జగిత్యాల రాజకీయాల్లో తన ప్రత్యర్థిగా ఉన్న సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడం, తన అనుచరుడి హత్య జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించిన తీరుపై తీవ్ర మనస్తాపానికి గురైన జీవన్ రెడ్డి..  గౌరవం లేని చోట ఉండలేను అని తెగేసి చెప్పారు.

 బీఆర్ఎస్ బంపర్ ఆఫర్ - కేకే పోస్టు జీవన్ రెడ్డికి? 

జీవన్ రెడ్డి వంటి ఉద్ధండుడైన నేతను పార్టీలోకి ఆహ్వానించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ ఆఫర్లు ప్రకటించినట్లు తెలుస్తోంది. గతంలో కె. కేశవరావు   నిర్వహించిన  సెక్రటరీ జనరల్ పదవిని జీవన్ రెడ్డికి అప్పగించాలని గులాబీ బాధ్యులు భావిస్తున్నారు. పార్టీలో ఆయన సీనియారిటీకి తగిన గుర్తింపు ఇవ్వడం ద్వారా, కాంగ్రెస్ బాధితులందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుందనే సంకేతాన్ని పంపాలని కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. అంతేకాకుండా, ఆయన  చిన్న కోడలికి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చేందుకు కూడా పార్టీ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

 బీజేపీ ఆఫర్ ఇచ్చినా.. ప్రాంతీయ పార్టీకే మొగ్గు 

జీవన్ రెడ్డిని తమ పార్టీలోకి లాగేందుకు భారతీయ జనతా పార్టీ కూడా గట్టిగానే ప్రయత్నించింది. అయితే, జాతీయ పార్టీల తీరుపై విరక్తి చెందిన ఆయన, ప్రాంతీయ పార్టీలోనే తనకు మరియు తన అనుచరులకు సరైన రక్షణ ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఈటల రాజేందర్ వంటి బలమైన నేతలు బీజేపీలో చేరిన తర్వాత అక్కడ ఎదుర్కొంటున్న పరిస్థితులు, వారి ప్రాధాన్యత తగ్గడాన్ని జీవన్ రెడ్డి నిశితంగా గమనించినట్లు తెలుస్తోంది.  జాతీయ పార్టీల్లో చేరి దిక్కులేకుండా పోవడం కంటే, ప్రాంతీయ పార్టీలో ఉండి సొంత గడ్డపై పోరాడటమే మిన్న అనే అభిప్రాయానికి ఆయన వచ్చినట్లు సన్నిహితులు చెబుతున్నారు.

 రేవంత్ రెడ్డిపై యుద్ధం ప్రకటించిన సీనియర్ 

తన రాజీనామా సమయంలో జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి లాఠీ దెబ్బలు తిన్న కార్యకర్తలను కాదని, పార్టీని ఇబ్బంది పెట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. తాను కేవలం పదవుల కోసం ఆశపడటం లేదని, ఆత్మగౌరవం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. జగిత్యాల కోటలో ఇకపై కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆయన చేసే పోరాటం ఆసక్తికరంగా మారనుంది. జీవన్ రెడ్డి నిష్క్రమణ కాంగ్రెస్‌కు, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆయనకు ఉన్న పట్టు, సామాజిక వర్గ సమీకరణాలు బీఆర్ఎస్‌కు ప్లస్ అయ్యే అవకాశం ఉంది.  


 

టాప్ హెడ్ లైన్స్

Telangana Graduate MLC Elections: తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?
తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
AP Employee Unions: ఏపీ ఉద్యోగ సంఘాల సంచలన నిర్ణయం - పీఆర్‌సీ, ఐఆర్‌ కోసం పోరాటం.. కూటమి ప్రభుత్వానికి సవాలు!
ఏపీ ఉద్యోగ సంఘాల సంచలన నిర్ణయం - పీఆర్‌సీ, ఐఆర్‌ కోసం పోరాటం.. కూటమి ప్రభుత్వానికి సవాలు!
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
Bold Series OTT : ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Embed widget