JC Prabhakar Reddy : సీఐని సస్పెండ్ చేయడంపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం - తాడిపత్రిలో ఏం జరిగిందంటే ?
Tadipatri CI : తాడిపత్రిలో సీఐని సస్పెండ్ చేయడంపై జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. క్రికెట్ బుకీని అరెస్టు చేసినందుకే సస్పెండ్ చేశారని మండిపడ్డారు.
Tadipatri JC Prabhakar Reddy Fire : తాడిపత్రి డిఎస్పి గంగయ్య, తాడిపత్రి వైసిపి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పై మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రి పట్టణ సీఐ హమీద్ ఖాన్ ను సస్పెండ్ చేయడం చాలా బాధాకరమని, హామీద్ ఖాన్ సీఐగా వచ్చిన తర్వాతే తాడిపత్రి పట్టణంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని ,ఎమ్మెల్యే పెద్దారెడ్డి అనుచరులను క్రికెట్ బుకీ కేసులో హమీద్ ఖాన్ అరెస్ట్ చేశాడని ,ఆ కేసులో సిఐ హామిద్ ఖాన్ ఎమ్మెల్యే మాట వినకపోవడంతో, హమీద్ ఖాన్ ను పక్కా ప్రణాళిక ప్రకారం తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి మరియు తాడిపత్రి డిఎస్పి గంగయ్య లు సస్పెండ్ చేయించారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. తాడిపత్రి డిఎస్పి ఒక ఫ్రాడ్ అని, తాడిపత్రి డిఎస్పి గంగయ్య ఒక ఐదు మంది పోలీసులను ఐడి పార్టీగా నియమించుకొని ఒక్కొక్కరితో ఒక్కో లావాదేవీ నడుపుతున్నాడని, ముందు తాడిపత్రి డిఎస్పి పై విచారణ చేసి డిఎస్పీ ని సస్పెండ్ చేయాలంటూ ఎస్పీని కోరారు. సిఐలు... ఎవరు తాడిపత్రికి రావద్దు, ఒక వేళ వస్తే ఎమ్మెల్యేకు, డిఎస్పీకి తొత్తులుగా ఉంటేనే ఇక్కడ పనిచేస్తారు, లేకపోతే మీరు ఇక్కడికి వచ్చి సస్పెండ్ అవుతారు అంటూ జెసి ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని.. తాడిపత్రి అర్బన సీఐ హమీద్‌ఖాన, బుక్కరాయసముద్రం సీఐ నాగార్జునరెడ్డిని సస్పెండ్ చేస్తూ అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మొదట వీరిద్దరినీ ఎస్పీ అన్బురాజన్ వీఆర్‌కు పంపిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. తర్వాత డీఐజీ అమ్మిరెడ్డి సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. తాడిపత్రి సీఐ హమీద్‌ఖాన తనకు షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చాడని రెండురోజుల క్రితం పట్టణానికి చెందిన బాలగురవయ్య అనే వ్యక్తి ఆరోపించాడు. తాడిపత్రి సీపీఐ కాలనీలో తాను, తన స్నేహితులు గొడవపడ్డామని, ఆ సమయంలో సీఐ రావడంతో పారిపోయామని అన్నాడు. రెండు రోజుల తర్వాత తనను అదుపులోకి తీసుకున్న సీఐ చెవులు, ముక్కుకు వైర్లు పెట్టి కరెంట్ షాక్ ఇచ్చాడని బాధితుడు చెప్పుకొచ్చాడు. ఆ కారణంగా తనకు కళ్లు కనిపించడం లేదని, చెవులు వినపడటం లేదని, మర్మాంగం కూడా పనిచేయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అతన్ని మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తీసుకొచ్చారు. ఈ ఘటనపై విచారణాధికారులుగా ఏఎస్పీ విజయభాస్కర్‌రెడ్డి, ట్రైనీ డీఎస్పీ హేమంతకుమార్‌ను నియమించారు. అనంతరం సీఐ హమీద్‌పై చర్యలు తీసుకున్నారు.
మరో సీఐ డ్వాక్రా మహిళల సొమ్ము కాజేసిన మాజీ యానిమేటర్‌ను కొట్టాడని, డబ్బులు తీసుకురమ్మని బెదిరించాడని సస్పెండ్ చేశారు. బుక్కరాయసముద్రం మండలం బొమ్మలాటపల్లికి చెందిన మహానందారెడ్డి గతంలో పొదుపు సంఘాల యానిమేటర్‌గా పనిచేసేవాడు. డ్వాక్రా మహిళలకు చెందిన రూ.19 లక్షలను స్వాహా చేశాడు. వైసీపీ అధికారంలోకి వచ్చాక, పురుషులు యానిమేటర్లుగా ఉండకూడదని నిబంధనలు అమలు చేసింది. దీంతో మహానందరెడ్డిని తొలగించారు. ఆ సమయంలో మహిళలు బ్యాంకులకు చెల్లించిన రుణాల సొమ్మును మహానందరెడ్డి వాడుకున్న విషయం బయటపడింది. బాధిత మహిళల ఫిర్యాదు మేరకు అప్పట్లో మహానందరెడ్డిపై కేసు నమోదైంది. ఆ కేసు విచారణలో భాగంగా కొన్ని రోజులుగా మహానందారెడ్డిని పోలీస్ స్టేషనకు పిలిపిస్తున్నారు. సీఐ తనను చితకబాదాడని మహానందరెడ్డి శుక్రవారం సెల్ఫీ వీడియో తీసుకుని, పురుగుల మందు తాగాడు. రెండు లక్షలు ఇవ్వకపోతే అంతు చూస్తానని సీఐ బెదిరించాడని, తనను చితక బాదాడని మహానందరెడ్డి ఆరోపించాడు. తన చావుకు సీఐ వేధింపులే కారణమని పేర్కొన్నాడు. దీంతో ఆ సీఐని సస్పెండ్ చేశారు.
ఇద్దరు సీఐలు తమ తప్పేమీ లేదని అంటున్నారు. మొద వేకెన్సీ రిజర్వ్ కు..తర్వాత సస్పెండ్ చేయడంతో.. పోలీసు వర్గాల్లోనూ తెర వెనుక ఏదో జరిగిందన్న చర్చ జరుగుతోంది.