ఇప్పటం గ్రామస్దులకు నష్టపరిహరం పంపిణికి జనసేన రంగం సిద్దం...
ఇప్పటం గ్రామస్దులకు నష్టపరిహరం పంపిణికి జనసేన రంగం సిద్దం...
Ippatam Janasena : ఇప్పటం ఇళ్ల కూల్చివేత వ్యవహారం సద్దుమణగడం లేదు. జనసేన సభ తో మెదలయిన రాజకీయ దుమారం,ఆక్రమణల తొలంగిపు వరకు వెళ్లింది.. ఆ తరువాత జనసేనాని కూడ నష్టపోయిన బాదితులకు లక్ష రూపాయలు నష్టపరిహారాన్ని ప్రకటించారు.వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టిలు ఇప్పటం గ్రామస్దులను పరామర్శించారు.ప్రస్తుతం ఇప్పటం ప్రశాంతంగా ఉన్నప్పటికి బాదితులకు ప్రకటించిన నష్టపరిహారాన్ని పంపిణి చేసేందుకు జనసేన రంగం సిద్దం చేస్తోంది.
ఇప్పటం ఇళ్ల కూల్చివేత బాధితులకు కుటుంబానికి రూ. లక్ష ప్రకటించిన పవన్
ఇప్పటం గ్రామం వ్యవహరం ఏపీలో సంచలనాలకు దారితీసింది. జనసేన ఆవిర్బావ సభ కోసం ఇప్పటం గ్రామస్దులు 14 ఎకరాల స్దలాన్ని ఇచ్చి సహకరించారు.అందుకు పవన్ ధన్యవాదాలు చెబుతూ గ్రామంలో పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు 50లక్షల రూపాయల ఆర్దిక సహకారాన్ని అందించారు. దీంతో రాజకీయం ఒక్క సారిగా వేడెక్కింది. ఆ తరువాత నుండి వైసీపీ కక్షసాదింపు చర్యలకు పాల్పడుతోందని , అందులో భాగంగానే గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇంటి ముందు నిర్మాణాలను కూల్చేశారని ఆరోపణలు రావడం స్దానికంగా తీవ్ర కలకలం రేపింది. నిర్మాణాలు కూల్చేసిన 24గంటలు గడవక ముందే పవన్ హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో ఇప్పటం వచ్చి గ్రామస్దులను పరామర్శించారు. తర్వాత ఇళ్ల కూల్చివేత బాధితు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సాయం ప్రకటించారు.
శనివారం బాధితులకు చెక్కుల పంపిణీకి ఏర్పాట్లు
పవన్ ఇప్పటం గ్రామానికి మెత్తంగా కోటి మూడు లక్షల రూపాయలు ప్రకటించారు. 50లక్షల రూపాయలు గ్రామం కోసం కాగా,మరో 53లక్షలు ఆక్రమణల తోలగింపు వలన నష్టపోయిన బాధితులకు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. పవన్ అలా ప్రకటించిన తర్వాత కూల్చి వేసిన ఇళ్ల దగ్గర మ ఇళ్ళను ప్రభుత్వం కూల్చలేదని,అనవసరంగా రాజకీయ చేయవద్దని బ్యానర్లు ప్రత్యక్షమయ్యాయి. వాటిని వాలంటీర్లతో బెదిరించి.. ప్రభుత్వమే పెట్టించిందన్న విమర్సలు ఉన్నాయి. బాధిత కుటుంబాలతో టచ్‌లో ఉన్న జనసేన నేతలు.. సాయం చెక్కులు ఇచ్చేందుకు వచ్చే శనివారాన్ని ముహుర్తంఘా ఖరారు చేశారు. వచ్చే శనివారం నాడు పవన్ కళ్యాణ్ లేదా జనసేనకు చెందిన ముఖ్య నేతల చేతుల మీదుగా బాధితులకు నష్టపరిహారాన్ని అందించేందుకు జనసేన నేతలు రెడీ అవుతున్నారు.
బాధితులు నష్టపరిహారం తీసుకోవడానికి వస్తారా ?
పార్టీ కార్యాలయంలో బాధితులను పిలిపించి పరిహారం అందచేయాలా లేదా గ్రామంలోనే సభను ఏర్పాటు చేసి అంద చేయాలా అన్నదానిపై ప్రస్తుతం సమాలోచన ేచస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి పవన్ వస్తారా లేదా అన్నది పార్టి వర్గాల కు క్లారిటి లేదు. ముందుగానే ప్రకటిస్తే ప్రభుత్వం ఆటంకకాలు సృష్టిస్తుంది కాబట్టి చివరి వరకూ గోప్యంగానే ఉంచనున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ ఇప్పటం వచ్చే సమయంలో నిర్వహించిన ర్యాలి కారణంగా తనకు ఇబ్బంది కలిగిందని తెనాలి మారీస్ పేటకు చెందిన శివ అనే వ్యక్తి తాడేపల్లి పోలీసులకు పిర్యాదు చేశారు.దీంతో పోలీసులు కూడ కేసు నమోదు చేశారు.