By: ABP Desam | Updated at : 11 Feb 2023 07:16 AM (IST)
జనసేన విడుదల చేసిన స్టిక్కర్
నువ్వే మా నమ్మకం అంటూ జనాల్లోకి వెళ్లాలని వైసీపీ ప్లాన్ చేస్తుంటే దానికి కౌంటర్‌గా ప్రతిపక్షాలు రోడ్లపైకి వస్తున్నారు. వైసీపీ కార్యక్రమంలో మొదలు కాక ముందే జనసేన వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మాకు నమ్మకం లేదు దొర అంటూ సరికొత్త ప్రచారానికి తెరలేపింది.
నువ్వే మా నమ్మకం జగన్ అంటూ వైసీపీ చేయబోతున్న ప్రచారంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. సంక్షేమ పథకాల లబ్ధిదారులను బెదిరించడానికి ఓట్లు వేయించుకోవడానికి ప్రభుత్వం డబ్బులతో వైసీపీ ప్రచారం చేసుకుంటుందని ఆరోపిస్తోంది జనసేన. ఈ ప్రచారంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. అంతే కాకుండా దీనికి పోటీగా కార్యక్రమాన్నికూడా చేపట్టింది.
మాకు నమ్మకం లేదు దొర అనే ట్యాగ్‌లైన్‌తో నువ్వు మా దరిద్రం జగన్ అంటూ ప్రచారానికి తెలేపింది. నిన్ను నమ్మలేం జగన్ అంటూ నినదించారు జనసేన నాయకులు. గుంటూరులో జరిగిన కార్యక్రమంలో జనసేన అధికార ప్రతినిధి ఈ స్టిక్కర్‌ను విడుదల చేశారు.
వైసీపీ స్టిక్కర్ కార్యక్రమాన్ని ప్రారంభించక ముందే జనసేన తమ ప్లాన్ వర్కౌట్ చేస్తోంది. ఇంటింటికీ వెళ్లీ... మాకు నమ్మకం లేదు దొర స్టిక్కర్లు అంతికించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ మధ్య కాలంలోనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తొమ్మిది నెలల్లోనే ఆర్బీఐ నుంచి తెచ్చిన రూ. 55, 555 కోట్ల అప్పు లెక్కలు విడుదలైన సందర్భంగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ .. సీఎం జగన్ పై సెటైర్ వేశారు. ఆయనకు అప్పు రత్న అవార్డు వచ్చినట్లుగా అధికారులు ఆయనకు ఓ మెమెంటోను తెచ్చి ఇస్తున్నట్లుగా కర్టూన్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేశారు. పక్కనున్న మరో అధికారి అది భారతరత్న లాంటి గౌప్ప అవార్డు అని చెబుతూండటం మరింత సెటైరిక్‌గా ఉంది. ఈ కార్టూన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అప్పులతో ‘ఆంధ్ర’ పేరు మారుమోగిస్తున్నందుకు,ముఖ్యమంత్రి కి నా ప్రత్యేక శుభకాంక్షలు ..keep it up👍
— Pawan Kalyan (@PawanKalyan) February 7, 2023
P.S : Don’t forget to increase your personal wealth.Let the State wealth & progress go to ‘Dogs’ but your personal wealth & assets..‘ NEVER.’That’s the spirit CM✊#AppuRatnaAPCM pic.twitter.com/bnZEOHdMFa
ఈ కార్టూన్ ను సోషల్ మీడియాలో పంచుకుంటూ పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీ వ్యక్తిగత ఆస్తులను పెంచుకునే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. అదే సమయంలో రాష్ట్ర, ప్రజల ఆస్తులను కుక్కలకు వదిలేయాలని .. కానీ వ్యక్తిగత ఆస్తులను భద్రంగా చూసుకుంటారన్నారు. అదే అది సీఎం స్పిరిట్ అని.. సెటైర్ వేసారు.
జనసేనానికి చాలా కాలంగా.. సీఎం జగన్ పై ఈ తరహా సెటైర్లు కార్టూన్ల రూపంలో వేస్తున్నారు. ఓ కేబినెట్ మీటింగ్‌లో ఎన్నికలు వస్తున్నందున మంత్రులందరూ అవినీతికి దూరంగా ఉండాలని జగన్ సూచించినట్లుగా వార్తలు వచ్చాయి.దానిపై కార్టూన్ పోస్ చేసి.. అవినీతికి క్రాప్ హాలీడ్ ప్రకటించడం సంతోషమని సెటైర్ వేసారు.
పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో స్పందించేది తక్కువే. ఎక్కువ సందర్భాల్లో పార్టీకి సంబంధించిన సమాచారాన్ని ఇస్తారు. కీలకమైన అంశాలపై విమర్శలు చేయాలంటే ..తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసారు. పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో ఏ అప్ డేట్ ఇచ్చినప్పటికీ.. సంచలనంగా మారుతూ ఉంటుంది. వైరల్ అవుతుంది. ఇలాంటి సెటైరిక్ కౌంటర్లు ఇచ్చినప్పుడు జనసైనికులు మరింతగా ఉత్సాహంగా వాటిని వైరల్ చేస్తూ ఉంటారు.
‘‘ఓట్ ఫ్రం హోం’’ కాన్సెప్ట్‌పై లక్ష్మీనారాయణ ప్రశంస- ఆ పని కూడా చేయాలంటూ ఈసీకి సూచన
నడ్డా తెలంగాణ పర్యటన రద్దు- 8న రానున్న ప్రధానమంత్రి
Pawan Kalyan: పొత్తులపై క్లారిటీ ఉంది- దుష్ప్రచారాన్ని నమ్మొద్దని కేడర్‌కు పవన్ సూచన
ట్విటర్ వేదికగా కేటీఆర్-బండి మాటల యుద్ధం- మధ్యలో కాంగ్రెస్ కౌంటర్!
మోదీ మిత్రుల ఖజానా నింపేందుకు పెట్రోల్ ధరల పెంపు- మంత్రి కేటీఆర్
Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ
AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!
IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!
Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి