By: ABP Desam | Updated at : 30 Mar 2022 04:28 PM (IST)
"టీం జగన్"లో చోటు దక్కించుకునేదెవరు ?
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ప్రక్షాళన ఖాయమైంది. పదకొండో తేదీన కొత్త మంత్రులు రాబోతున్నారు. అయితే మంత్రులు, ఎమ్మెల్యేల్లోనే కాదు ప్రజల్లోనూ ఇప్పుడు ఎవరు ఇన్ ..ఎవరు ఔట్ అనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఏబీపీ దేశంకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం... అదృష్టరేఖ ఉన్న వారి వివరాలను ఇక్కడ ఇస్తున్నాం.
ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో వివిధ సమీకరణాల రీత్యా కొంత మందిని కొనసాగిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. కానీ కొంత మంది ఎవరో ఉండరని.. ఇద్దరే ఉంటారని తెలుస్తోంది. వారిద్దరూ సీనియర్ మోస్ట్ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వారిని తొలిగిస్తే వారి స్థాయి ఉన్న నేతలు మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యం కాబట్టి వారిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక మిగిలిన మంత్రులందరూ మాజీలవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక కొత్తగా చోటు దక్కించుకునేవారి పేర్లలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు, పాలకొండ ఎమ్మెల్యే కళావతి, పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి పేర్లు ప్రముఖంగా ప్రచారంలో ఉన్నాయి. ధర్మాన ప్రసాదరావుకు ఖాయమని చెబుతున్నారు. ఇద్దరు మహిళా ఎమ్మెల్యేల్లో ఒకరికి చాన్సిచ్చే ్వకాశం ఉంది. ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి కోలగట్ల వీరభద్రస్వామి, పీడిక రాజన్న దొరకు ఎక్కువఅవకాశాలు ఉన్నాయి. విశాఖ జిల్లా నుంచి గుడివాడ అమర్నాథ్ పేరు దాదాపు ఖరారయినట్లుగా తెలుస్తోంది.
ఇక తూర్పుగోదావరి జిల్లా నుంచి దాడిశెట్టి రాజా, పొన్నాడ సతీష్, కొండేటి చిట్టిబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్జి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరిలో ముగ్గురికి చాన్స్ దక్కవచ్చని తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా నుంచి ముదునూరి ప్రసాదరాజు, గ్రంధి శ్రీనివాస్, బాలరాజు, ఎలీజా పేర్లను ప్రాబబుల్స్‌లో చేర్చారు. తుది టీంలో ఇద్దరు ముగ్గురు ఉండే అవకాశం ఉంది. కృష్ణా జిల్లా నుంచి నానీలను సాగనంపి.. పార్థసారథి, ఉదయభాను, దూలం నాగేశ్వరరావుల్లో ఇద్దరికి చాన్సివ్వనున్నారు. ఇక గుంటూరు జిల్లా నుంచి విడదల రజనీ పేరు ఖాయంగా కనిపిస్తోంది. అలాగే మేరుగ నాగార్జునకు కూడా అవకాశం దక్కనుంది.
ప్రకాశం జిల్లా నుంచి కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన యాదవ్, సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు రేసులో ఉన్నారు. నెల్లూరు జిల్లా నుంచి కాకాణి గోవర్థన్ రెడ్డితో పాటు ఇటీవల చనిపోయిన గౌతంరెడ్డి సతీమణి మేకపాటి శ్రీకీర్తిరెడ్డికి కూడా కేబినెట్ బెర్త్ ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించినట్లుగా తెలు్సతోంది. చిత్తూరు జిల్లా నుంచి ఆర్కే రోజా, శ్రీనివాసులు, ఎంఎస్ బాబు, ఆదిమూలం రేసులో ఉన్నారు. అయితే పెద్దిరెడ్డిని కొనసాగిస్తున్నందున వీరిలో ఒక్కరికే చాన్స్ దక్కనుంది. కర్నూలు జిల్లా నుంచి హఫీజ్ ఖాన్, చక్రపాణిరెడ్డి, కంగాటి శ్రీదేవి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. హఫీజ్‌ఖాన్‌కు ఖాయమని తెలుస్తోంది. అనంతపురం- కాపు రామచంద్రరెడ్డి, ఉషాశ్రీచరణ్, జొన్నలగడ్డ పద్మావతి రేసులో ముందున్నారు. కడప జిల్లా నుంచి శ్రీకాంత్ రెడ్డి, కోరుముట్ర శ్రీనివాసులు, మేడా మల్లిఖార్జున రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నారు. అయితే వీరిలో ఒక్కరికే చాన్స్ దక్కనుంది.
BJP Bhansal : తెలంగాణ బీజేపీకి కొత్త ఇంచార్జ్‌గా సునీన్ బన్సల్ - ఈయన ట్రాక్ రికార్డుకి ఓ రేంజ్
BJP Politics : బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా ముప్పే ! ప్రాంతీయ పార్టీలకు కమలం గండం
Nitish PM Plan : మోదీకి దీటుగా ప్రధాని అభ్యర్థి కావడమే లక్ష్యం ! నితీష్ మాస్టర్ ప్లాన్ అదే !
BJP Vishnu : కొద్ది సెకన్ల వీడియోతో దుష్చ్రచారం - జాతీయ జెండాను తిరగేసి పట్టుకున్న అంశంపై బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి క్లారిటీ !
Warangal: ‘లాహిరి లాహిరిలో’ మూవీ సీన్ రిపీట్! ఎదురుపడ్డ ప్రత్యర్థులు - చివరికి ఎవరు నెగ్గారంటే?
Naga Chaitanya: ఆ వీడియో కాల్ మాట్లాడినప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది: నాగచైతన్య
Border Love Story : ప్రేమ కోసం బోర్డర్ దాటిన పాకిస్తాన్ యువతి - కానీ చివరి క్షణంలో దొరికిపోయింది !
Shilpa Shetty: వాళ్ళు కాలు విరగ్గొట్టుకోమన్నారు, అందుకే అలా చేశాను: శిల్పాశెట్టి
Mohan babu : షిర్డీ కన్నా తమ ఆలయమే గొప్పంటున్న మోహన్ బాబు - ఉద్దేశపూర్వకమా ? టంగ్ స్లిప్పా ?