Komatireddy RajaGopal Reddy: రాజన్న నీ దారెటు, క్లారిటీ మిస్సయితే పాలిటిక్స్‌ల్ ఖేల్ ఖతమ్ !
కాంగ్రెస్ పార్టీలో సరైన గుర్తింపు లేదని, కోరుకున్న పదవులను అధిష్టానం ఇవ్వలేదన్న అసంతృప్తితోనే రోజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నారన్న మాటలైతే వినిపించాయి. కానీ ఆయన క్లారిటీ ఇవ్వలేదు.
ప్రజాప్రతినిధులకే క్లారిటీ లేనప్పుడు ఇక ప్రజలకు ఏముంటుందిలే అనుకోవద్దు సుమా అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సలహా ఇస్తున్నారు. గతకొన్నిరోజులుగా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. సీరియల్ ఎపిసోడ్ ఈ రాజకీయం సాగుతూనే ఉంది కానీ ఇంతవరకైతే రాజగోపాల్ నుంచి క్లారిటీ మాత్రం రాలేదు.
గుర్తింపు కావాలా.. అసంతృప్తితో వెళతారా !
కాంగ్రెస్ పార్టీలో సరైన గుర్తింపు లేదని, కోరుకున్న పదవులను అధిష్టానం ఇవ్వలేదన్న అసంతృప్తితోనే రోజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నారన్న మాటలైతే వినిపించాయి. ఇది బహిరంగ రహస్యమైనా ఆయన మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. పదవుల కోసం కాదు తెలంగాణ స్వేచ్ఛ కోసం సీఎం కేసీఆర్ పై సమరశంఖాన్ని పూరిస్తున్నానని స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ స్పష్టత పార్టీ మారే విషయంలో లేదన్నది ఇంకో వాదన. అందుకు కారణం ఇంతకుముందు రాజగోపాల్ మాట్లాడిన తీరు.. అధిష్టానం, సీనియర్ల చర్చల తర్వాత నోటివెంట వచ్చిన మాటల తీరు భిన్నంగా ఉన్నాయంటున్నారు. బీజేపీలో చేరేది లేనిది స్పష్టత నివ్వలేదు. అలాగే కాంగ్రెస్ ని వీడే విషయంలోనూ సరైన క్లారిటీ లేదన్నది గుర్తు చేస్తున్నారు. ప్రతి పక్ష పార్టీనుంచి మరో ప్రతిపక్ష పార్టీలోకి పోతుంటే ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి ఇదే ఇప్పుడు రాజన్న ముందున్న పెద్ద ప్రశ్న. ప్రజల మద్దతు కోరుకుంటున్నానని మాత్రమే చెప్పిన రాజగోపాల్ రెడ్డి పొలిటికల్ కార్యాచరణ ఏంటన్న విషయంపై స్పష్టత నివ్వకపోవడంతో ఆయనకు కూడా వివేక్ పరిస్థితే ఖాయమంటున్నారు.
మరో వివేకాలాగా అయిపోతారా?
కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన వివేక్ ఎంపీగా గెలిచి తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. మొదట్లో కేసీఆర్ తో మంచి సంబంధాలున్న వివేక్ ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. అర్నెళ్లో పార్టీ మారి 2014 ఎంపీగాపోటీ చేసి ఓడిపోయి, తిరిగి మళ్లీ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 టీఆర్ఎస్ నుంచి టిక్కెట్ రాకపోవడంతో బీజేపీ గూటికి చేరారు. ఎంపీ టిక్కెట్ ఇవ్వలేదన్న కారణంతో బీజేపీలోకి చేరారు. ఇలా కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్ , టీఆర్‌ఎస్ నుంచి బీజేపీలోకి రావడంతో ఆయన ఏ పార్టీలో ఉన్నారన్న క్లారిటీ ఓటర్లకు కూడా లేకుండా పోయింది. ఫలితంగా ఎంపీగా గెలవలేకపోయారు. ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నా పెద్దగా పేరు మాత్రం వినిపించడం లేదు.
ఇప్పుడిలాంటి కన్ఫ్యూజనే రాజగోపాల్ రెడ్డి ఓటర్లలో తీసుకొచ్చారంటే.. రానున్న ఎన్నికల్లో ఆయన ఓడిపోయవడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముందుగా ఆయనకు పార్టీ మారాలన్న ఆలోచన ఉందా? లేదా? అన్న విషయంపై క్లారిటీ ఉంటే భవిష్యత్ రాజకీయం బాగుంటుందని సలహా ఇస్తున్నారు.
మరోవైపు బీజేపీ ఆకర్షలో మరికొంతమంది నేతలున్నారన్న వార్తలైతే వినిపిస్తున్నాయి. అయితే ఎన్నికలకు ఆర్నెల్ల ముందు వాళ్లంతా కాషాయం కప్పుకుంటారని తెలుస్తోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో జంపింగ్ జపాంగ్ లకు ఇది అవకాశంగా మారింది.