అన్వేషించండి

Kavitha New Party: కొత్త పార్టీకి తెలంగాణ రాజకీయాల్లో స్పేస్ ఉందా? కవిత ప్రభావం ఎంత ఉంటుంది?

Kavitha New Party: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక అంకం మొదలైంది. కవిత కొత్త పార్టీతో నాలుగో రాజకీయ శక్తి అయ్యేందుకు రెడీ అయ్యారు.

Influence of Kavitha New Party: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక అంకం మొదలైంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సొంత రాజకీయ పార్టీని ప్రకటిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వంటి మూడు బలమైన శక్తులు ఉన్న చోట..  నాలుగో శక్తి గా కవిత ఏ మేరకు రాణిస్తారనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.  

 తెలంగాణ రాజకీయాల్లో  నాలుగో శక్తి 

తెలంగాణలో ప్రస్తుతం త్రిముఖ పోటీ నెలకొంది. అధికారం కోల్పోయినా కేడర్ బలంగా ఉన్న బీఆర్ఎస్, అధికారంలో ఉన్న కాంగ్రెస్, పుంజుకుంటున్న బీజేపీ మధ్య రాజకీయ యుద్ధం నడుస్తోంది. ఈ దశలో కవిత కొత్త పార్టీని ప్రకటించడం సాహసోపేతమైన నిర్ణయంగానే కనిపిస్తోంది. అయితే, తెలంగాణ రాజకీయాల్లో  స్పేస్  ఎప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా సెంటిమెంట్, ప్రాంతీయ ఆకాంక్షలు బలంగా ఉన్న  గడ్డపై, గొంతు  లేని వర్గాలకు , అసంతృప్త నేతలకు కవిత పార్టీ ఒక వేదికగా మారే అవకాశం ఉంది. ప్రత్యేకించి మహిళా సాధికారత, తెలంగాణ సంస్కృతిని అజెండాగా మార్చుకుంటే కొంత మేర ఓటు బ్యాంకును ఆకర్షించవచ్చు.

 సొంత ఇంటి నుంచే సవాల్? 

కవిత నిర్ణయం అన్నిటికంటే ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీనే ప్రభావితం చేయనుంది. కేసీఆర్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న నేతలు లేదా పార్టీలో ప్రాధాన్యత దక్కని సెకండ్ లైన్ లీడర్లు కవిత వైపు చూసే అవకాశం ఉంది. పార్టీ పేరులో తెలంగాణ ఉంటుంది.  ఇది బీఆర్ఎస్ ఓటు బ్యాంకును చీల్చితే, అది పరోక్షంగా కాంగ్రెస్ ,  బీజేపీకి లాభం చేకూర్చవచ్చు. తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఆమె తీసుకుంటున్న ఈ అడుగు, తెలంగాణలో ఒక కొత్త రాజకీయ సంస్కృతికి నాంది పలకవచ్చు.  కవిత తన తాజా వ్యాఖ్యల్లో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. తెలంగాణలో జనాభా పరంగా పెద్ద సంఖ్యలో ఉన్న బీసీ సామాజిక వర్గాలను తన వైపు తిప్పుకోవడం ద్వారా బలమైన పునాది వేయాలని ఆమె వ్యూహంగా కనిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీలు కూడా బీసీ మంత్రాన్ని జపిస్తున్న తరుణంలో, కవిత తెలంగాణ బిడ్డ గా వారి ఆకాంక్షలను ఏ మేరకు నెరవేరుస్తారనేది కీలకం. ఆమె పార్టీలో చేరబోతున్న మేధావులు, ఉద్యమకారుల జాబితాను బట్టి ఈ పార్టీ గమ్యం దిశానిర్దేశం అవుతుంది.

 తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ పురుడుపోసుకుంటుందా? 

తెలంగాణ జాగృతి ద్వారా దశాబ్ద కాలంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న కవితకు క్షేత్రస్థాయిలో ఒక నెట్‌వర్క్ ఉంది. ఉద్యమ సమయంలో పనిచేసిన వారు, ప్రస్తుతం రాజకీయంగా అవకాశాలు లేని వారు ఆమె వెంట నడిచే అవకాశం ఉంది. ఒకవేళ ఆమె బలమైన అభ్యర్థులను నిలబెట్టి, ఒక పది నుంచి పదిహేను శాతం ఓట్లు సాధించగలిగితే.. రాష్ట్రంలో ఏ పార్టీ అయినా ప్రభుత్వ ఏర్పాటుకు ఆమె మద్దతు కోరాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే  కింగ్ మేకర్ గా ఎదిగే అవకాశం ఆమెకు ఉంటుంది.
 
 ఆవిర్భావ సభలో పార్టీ జెండా, ఎజెండా , గుర్తు  పై పూర్తి స్పష్టత రానుంది.  తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు త్రిముఖ పోటీ నుంచి చతుర్ముఖ పోటీ వైపు మళ్లుతున్నాయి. ఈ మార్పు తెలంగాణ ఓటరు నాడిని ఎలా మారుస్తుందో వేచి చూడాలి. ముఖ్యంగా మహిళా నేత నేతృత్వంలో వస్తున్న మొదటి ప్రాంతీయ పార్టీగా ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుందో  త్వరలోనే క్లారిటీ వస్తుంది.  

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Embed widget