What is Sharmila Plan : పొలిటికల్ చౌరస్తాలో షర్మిల - ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నారా ?
షర్మిల ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నారా?ఏపీలో రాజకీయాలకు అయితేనే కాంగ్రెస్‌లో విలీనంతెలంగాణలో షర్మిల అవసరం లేదంటున్న కాంగ్రెస్ నేతలుసోషల్ మీడియాలో కేసీఆర్ ను విమర్శించడమే షర్మిల పని !
What is Sharmila Plan : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సోషల్ మీడియాలో పోస్టులకే పరిమితమయ్యారు. ఇటీవల ఆమె క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లడం లేదు. సొంత పార్టీ పెట్టుకుని మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినా రావాల్సినంత హైప్ రాకపోవడంతో ఆమె కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నదానిపై స్పష్టత లేకుండా ఉన్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ట్వీట్లు తప్ప మరేమీ రాజకీయ కార్యకలాపాలు కనిపించడం లేదు. పాలేరులో పోటీ చేస్తానని చెబుతున్నా.. ఎన్నికలు దగ్గర పడుతున్నా అక్కడకు వెళ్తోంది కూడా తక్కువే. దీంతో షర్మిల పయనం ఎటు వైపనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో జరుగుతోంది.
కాంగ్రెస్‌లో విలీనానికి షర్మిల అడ్డంకులు
కాంగ్రెస్ లో విలీనం అంటూ కొంత కాలం హడావుడి జరిగింది. కాంగ్రెస్ సీనియర్లు మాత్రం ఆమె అసలు తెలంగాణ పార్టీకి అవసరం లేదని.. ఏపీకి అవసరం అయితే విలీనం చేసుకోవాలని తేల్చేశారు. దీంతో ఆమె విలీనం పెండింగ్ లో పడిపోయిందని చెబుతున్నారు. డీకే శివకుమార్ ద్వారా హైకమాండ్ పై ఒత్తిడి తెచ్చినప్పటికీ పలితం సానుకూంగా రాలేదని చెబుతున్నారు. కాంగ్రెస్ లో విలీనం చేస్తే పాలేరు టిక్కెట్ కూడా ఇచ్చేది లేదని .. అసలు తెలంగాణ రాజకీయాల్లో అంగీకరించబోమని .. కాంగ్రెస్ సీనియర్లు తెగేసి చెబుతున్నట్లుగా తెలుస్తోంది.
పార్టీలో షర్మిల తర్వాత మరో నేత లేరు !
పార్టీలో ఒక్కరంటే ఒక్క ప్రముఖ నాయకుడు కూడా లేరు. నియోజకవర్గ స్థాయి నేత కూడా లేరు. ఆమె పాలేరులో పోటీ చేయాలనుకుంటున్నారు. అక్కడ ఆమె కూడా నియోజకవర్గ స్థాయి నేతో కాదో ఎవరికీ తెలియడం లేదని తెలంగాణ రాజకీయ నేతలు సెటైర్లు వేస్తున్నారు. షర్మిల పార్టీ పెట్టిన కొత్తలో చాలా మంది నేతలు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపించారు. కానీ.. ఏపీ నుంచి వచ్చిన సూచనల్లాంటి హెచ్చరికలతో చాలా మంది డ్రాప్ అయిపోయారు. పొంగులేటి శ్రీనివసారెడ్డి కూడా చేరుతామని సంకేతాలు పంపారు కానీ చివరికి వెనక్కి తగ్గారు. చేరిన ఒకరిద్దరు నేతలు చప్పుడు చేయడం లేదు. ఇప్పుడు కాదు డిసెంబర్‌లో ఎన్నికలు వచ్చినా షర్మిల పట్టుమని పది మంది గట్టి అభ్యర్థుల్ని నిలబెట్టలేని పరిస్థితి ఉందని ఎక్కువ మంది అభిప్రాయం.
పాదయాత్ర ప్రారంభంపైనా ఆలస్యమవుతున్న కసరత్తు !
మరో వైపు ఆగిపోయిన పాదయాత్రను మళ్లీ ఎప్పుడు ప్రారంభించాలన్న దానిపై ఆమెకు క్లారిటీ లేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పాదయాత్ర చేయలేదు. అంతే కాదు.. టీవల వైఎస్ జయంతి రోజున పాలేరులో సభ పెడితే రెండు వందల మందిని కూడా సమీకరించలేకపోయారు. ప్రస్తుతానికి ఆమె పేరుతో మీద.. టీఆర్ఎస్ సర్కార్ ను విమర్శిస్తూ .. రోజుకో ట్వీట్ పెడుతున్నారు తప్ప..క్షేత్ర స్థాయిలో ఎలాంటి కార్యక్రమాలు లేవు. అన్ని పార్టీలు రాజకీయంగా యాక్టివ్ గా మారిపోయాయి. కానీ బరిలోకి దిగి ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో షర్మిల ఉండిపోయిన సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీలో రాజకీయాలు చేయాలనకుుంటే మాత్రం అక్కడ రెడ్ కార్పెట్ వేస్తారని.. నిర్ణయం తీసుకోవాల్సింది ఆమెనని.. కాంగ్రెస్ వర్గాలు సంకేతాలు పంపుతున్నాయి.