Janasena Chiru : పవన్‌కు తోడుగా రంగంలోకి దిగుతారా ? మళ్లీ చిరంజీవి మనసు రాజకీయం వైపు లాగుతోందా ?
రాజకీయాల్లో రీఎంట్రీకి చిరంజీవి ఆసక్తిగా ఉన్నారా ? జనసేన పార్టీతోనే రీ ఎంట్రీ ఇస్తారా ?
Janasena Chiru : పవన్ కల్యాణ్ ఓ వైపు ఉండి.. తాను మరో వైపు ఉంటే సమస్యలు వస్తాయని.. తాను సైలెంట్‌గా ఉంటనే పవన్ కల్యాణ్ పొలిటికల్‌గా ఎమర్జ్ అవుతాడని చిరంజీవి ప్రకటించారు. అంటే తమ్ముడి కోసం రాజకీయ కెరీర్‌ను త్యాగం చేశానని ఆయన చెప్పకనే చెప్పారు. పవన్‌కు తన మద్దతు తప్పక ఉంటుంది. భవిష్యత్‌లో ప్రత్యక్షంగా జనసేన కోసం పని చేస్తానేమో అన్న సందేహాన్ని కూడా వ్యక్తం చేశారు. దీంతో జనసేన పార్టీలోకి చిరంజీవి ఎంట్రీ ఇవాళ కాకపోతే.. రేపు.. రేపు కాకపోతే.. మరో రోజు ఖచ్చితంగా ఉంటుందన్న అభిప్రాయానికి జనసైనికులు వస్తున్నారు.
సోదరుడి కోసమే సైలెంట్ అయ్యానన్న చిరంజీవి
చిరంజీవికి రాజకీయాలపై చాలా ఆసక్తి ఉంది.అందుకే ఆయన అద్భుతమైన కెరీర్‌ను వదులుకుని ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. కానీ రాజకీయాల్లో వేసిన తప్పటడుగుల కారణంగా తొమ్మిదేళ్లకే రిటైర్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. అయితే తాను లేని లోటును పవన్ కల్యాణ్ తీరుస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ లేదనే భావన లేకుండా..జనసేన పార్టీతో తెర ముందుకు వచ్చారు. అయితే చిరంజీవి ఇంత వరకు నేరుగా మద్దతు ప్రకటించలేదు. అంతే కాదు.. పవన్ పొలిచికల్ కెరీర్‌పై నేరుగా మాట్లాడలేదు. గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్లలో మాత్రమే తొలి సారి మాట్లాడారు. మద్దతు ప్రకటించారు. నేరుగా బరిలోకి దిగే అంశంపై మాత్రం ఇప్పుడే చెప్పలేనన్నారు. అప్పుడైనా.. ఇప్పుడైనా చిరంజీవి అభిమానులకు రాజకీయ పార్టీ ఒకటి ఉంది కానీ ప్రత్యక్షంగా చిరంజీవి లేకపోవడమే లోటు.
మరి కొన్నాళ్లకైనా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాారా ?
గత ఎన్నికలకు ముందు చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కలిసి జనసేన పార్టీలో ప్రత్యేక సమావేశం పెట్టి మరీ చేరారు. అప్పట్లోనే కొన్ని పత్రికలకు ఇంటర్యూలు ఇచ్చిన పవన్ కల్యాణ్.. తన సోదరుడు ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో లేడని .. రాడని చెప్పారు. దానికి తగ్గట్లుగానే ఆ తర్వాత చిరంజీవి ప్రకటనలు ఉన్నాయి. అయితే గాడ్‌ఫాదర్ సినిమాలో డైలాగుల్లా .. ఆయన రాజకీయానికి దూరం అయ్యారు కానీ రాజకీయాలు మాత్రం ఆయనకు దూరం కాలేదు. ఎప్పటికప్పుడు ఏదో ఓ పార్టీలో చిరంజీవి చేరబోతున్నారన్న ప్రచారం జరిగింది. చివరికి జనసేన బాధ్యతలు తీసుకుంటారని కూడా చెప్పుకున్నారు. కానీ ఇప్పుడల్లా చిరంజీవి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని మాత్రం క్లారిటీ ఇచ్చారు. తన సోదరుడు పవన్ కల్యాణ్ ఏపీ పాలకుడు కావాలని కోరుకుంటున్నారు.
చిరంజీవి జనసేనకు ప్రత్యక్షంగా ప్రచారం చేస్తే ఆ రేంజ్ వేరు !
పవన్ కల్యాణ్‌కు తమ ప్రచారం అవసరం అని భావించి.. తన ప్రచారం వల్ల ఫలితాలు మెరుగుపడతాయని గట్టి నమ్మకానికి వస్తే చిరంజీవి రంగంలోకి దిగే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దీనికి కారణం చిరంజీవి ప్రచారానికి వస్తే వచ్చే హుషారు వేరు. బాస్ ఈజ్ బ్యాక్ అని పాత పీఆర్పీ ఫ్యాన్స్ అంతా యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. అంతకు మించి ఓ బలమైన శక్తి జనసేనకు జత చేరినట్లవుతుంది. అయితే చిరంజీవి సోదరుడికి పూర్తి స్థాయి మద్దతు ప్రకటించారు కానీ నేరుగా రాజకీయాల్లోకి వస్తానని మాత్రం చెప్పలేదు. అక్కడ జనసేనికులకూ ఇబ్బందికరంగా ఉంది. అయితే చిరంజీవికి రాజకీయాలపై ఆసక్తి పూర్తి స్థాయిలో పోలేదని.. ఆయన మాటల ద్వారా తెలుస్తోంది. అందుకే..మరో రెండేళ్లకైనా చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారని నమ్మే ఫ్యాన్స్ ఎక్కువగానే ఉన్నారు.