By: ABP Desam | Updated at : 16 May 2023 07:22 AM (IST)
ఏపీ బీజేపీ స్వరం మార్చుకుంటోందా ?
AP Politics : "పవన్ కల్యాణ్ టీడీపీతో కలిసి పని చేయాలని ప్రతిపాదన పెట్టారు. ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాం.. పొత్తుల గురించి" వారే నిర్ణయం తీసుకుంటారని ఏపీ బీజేపీ కీలక నేతలు ప్రకటించారు. ఢిల్లీలో ఏపీ బీజేపీ తరపున వ్యవహారాలు చక్కబెట్టే జీవీఎల్ నరసింహారవు తో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా అదే చెప్పారు. నిజానికి పొత్తులనేవి ఢిల్లీలోనే డిసైడవుతాయి. మొన్నటిదాకా ఏపీ బీజేపీ నేతలు ఇలా చెప్పలేదు. కుటుంబపార్టీలు, అవినీతి పార్టీలతో పొత్తు ప్రశ్నే లేదని చెబుతూ వస్తున్నారు. కానీ ఇప్పుడు టీడీపీతో పొత్తు విషయంపై కాస్త సాఫ్ట గా మాట్లాడుతున్నారు.
కర్ణాటక ఎన్నికల తర్వాత మార్పు కనిపించిందా ?
కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పాలైంది. గెలిచి ఉంటే బీజేపీకి తిరుగులేని బలం వచ్చి ఉండేదమో కానీ పరాజయం పాలవ్వడం వల్ల డీలాపడిపోయింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణాది నుంచి సీట్లు పెంచుకోకపోతే.. ఢిల్లీలో అధికారం కూడా కష్టమవుతుంది. కనీసం ఎన్డీఏ కూటమిలో పార్టీల్ని అయినా పెంచుకోవాల్సి ఉంది. లేకపోతే ఇబ్బంది అవుతుంది. అందుకే బీజేపీ స్వరంలో మార్పులు వచ్చాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.
బీజేపీకి నమ్మకమైన మిత్రపక్షాలు కావాలి !
దక్షిణాదిలో బీజేపీ సీట్లు గెల్చుకోకపోయినా సీట్లు గెలుచుకున్న పార్టీలతో పొత్తులంటే చాలని బీజేపీ అనుకునే అవకాశం ఉంద. కేరళలో బీజేపీతో పొత్తులనే మాటే ఉండదు. అక్కడ ఎవరు గెలిచినా కాంగ్రెస్ కూటమికే సీట్లు. తమిళనాడులో అన్నాడీఎంకేతో బీజేపీతో పొత్తులో ఉంది కానీ.. వచ్చే ఎన్నికల్లో సీట్లు వస్తాయన్న గ్యారంట లేదు. కర్ణాటకలో గత ఎన్నికల్లో దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది బీజేపీ. ఇంత ఘోర పరాజయం తర్వాత ఏడాదిలో సగం సీట్లు అయినా దక్కించుకోవడం కష్టమే. తెలంగాణలో కలిసి వచ్చే పార్టీలు లేవు. ఇక చాన్స్ ఉంది ఏపీలోనే. వైసీపీ బీజేపీతో సన్నిహితంగా ఉంటోంది. కానీ పొత్తులు పెట్టుకోకపోవచ్చు. ఎందుకంటే ఆ పార్టీ కోర్ ఓటు బ్యాంక్ లో ముస్లింలు కూడా ఉన్నారు. బీజేపీతో పొత్తు అంటే వారు దూరమవుతారు. అందుకే వైసీపీ అంగీకరించదు. టీడీపీకి మాత్రం గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి సరిపోతుంది. అంటే దక్షణాదిలో బీజేపీకి దొరికే మిత్రపక్షం ఒక్క టీడీపీనే అనుకోవచ్చు.
ఇప్పుడు టీడీపీ పొత్తు పెట్టుకోవాలంటే షరతులు పెట్టకుండా ఉంటుందా ?
ఇప్పుడు వైసీపీ, బీజేపీ ఒక్కటేనని మేం అనడం కాదు.. ప్రజలే అనుకుంటున్నారు అని ఇటీవల ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన మాధవ్ మధనపడ్డారు. అచ్చెన్నాయుడు కూడా అదే చెప్పారు. పొత్తులు పెట్టుకోవాలంటే ముందు ఆ రెండు పార్టీల మధ్య గ్యాప్ ఉందన్న అభిప్రాయం రావాలన్నారు. అలాంటి అభిప్రాయం రావాలంటే కూడా ఏం చే్యాలో అచ్చెన్నాయుడే పరోక్షంగా చెప్పారు. కేంద్రం నుంచి వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ నేతలకు వ్యక్తిగతంగా అందుతున్న సాయాన్ని నిలిపివేయాలని అంటున్నారు. అంటే ప్రభుత్వానికి అడ్డగోలు అప్పులు ఆపేయడం, నిబంధనల ప్రకారం పాలించేలా చేయడం, చట్ట విరుద్ద పనలును తక్షణం నిలిపివేసేలా చూడటం వంటివి టీడీపీ అజెండాలో ఉండవచ్చు. అవి చేస్తే బీజేపీతో పొత్తులపై ఆలోచిస్తామని టీడీపీ నేతలు చెప్పే అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగత కేసుల విషయంలోనూ వైసీపీకి బీజేపీ సహకరిస్తోందన్న అభిప్రాయం ఉంది. దాన్ని కూడా మార్చాలంటున్నారు.
మొత్తంగా బీజేపీ పొత్తులపై చర్చిస్తామని చెబుతోంది .. కానీ టీడీపీ మాత్రం ఇప్పుడు తక్షణం కొన్ని ప్రయోజనాలను ఆశించే అవకాశం ఉంది.
BJP Dilemma : ఏపీ, తెలంగాణలో బీజేపీకి బ్రేకులేస్తోంది హైకమాండేనా ? - ఎందుకీ గందరగోళం ?
బీజేపిలో కేసీఆర్ మనుషులు ఎవరు..? అధినాయకత్వానికి తలనొప్పిగా కోవర్టులు !
KCR Plan For Elections : పథకాల వరద పారించి ఎన్నికలకు కేసీఆర్ - మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా !?
AP Cabinet : ముందస్తుపై కీలక ఆలోచనలు చేస్తారా ? ఏపీ కేబినెట్ భేటీపై ఉత్కంఠ !
Kakinada MP Vanga Geetha: వైసీపీ ఎంపీ వంగా గీత నుంచి ప్రాణహాని! స్పందనలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఆడపడుచు
Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!
Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!
10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!
IND VS AUS: టీమిండియాకు ‘హెడ్’ షాట్ - ఫైనల్ తొలి రోజు ఆస్ట్రేలియాదే!