అన్వేషించండి

Andhra IAS: దీపక్‌రెడ్డి అన్ని మాటలన్నా ఖండించరా - ఏపీ ప్రభుత్వంపై ఐఏఎస్‌ల అసంతృప్తి - ఇక తాడోపేడో ?

IAS officers : ఏపీ ప్రభుత్వంపై ఐఏఎస్ అధికారులు అసంతృప్తితో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీపక్ రెడ్డి చేసిన ఆరోపణలను వారు సీరియస్ గా తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

IAS officers And TDP Leaders: ఆంధ్రప్రదేశ్ రాజకీయ , పరిపాలనా వర్గాల్లో  ఐఏఎస్ అధికారులు, అధికార కూటమి నేతల మధ్య రాజుకున్న వివాదం ఇప్పుడు ముదురుతోంది. టీడీపీ నేత, సీడాక్ ఛైర్మన్ దీపక్ రెడ్డి ఐఏఎస్ అధికారులపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు బ్యూరోక్రసీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.  ఐఏఎస్ అధికారులు రహస్యంగా సమావేశమై, ప్రభుత్వం తమకు అండగా నిలబడకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.
  
ఏపీలో ఐఏఎస్ అధికారుల  సైలెంట్ రివోల్ట్ ?

ఆంధ్రప్రదేశ్ పాలనా వ్యవస్థలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ నాయకులు,  ఉన్నతాధికారుల మధ్య  కోల్డ్ వార్  మొదలైంది. ఇటీవల టీడీపీ నేత దీపక్ రెడ్డి ఐఏఎస్ అధికారులను ఉద్దేశించి  వ్యవస్థకు పట్టిన దరిద్రం, గ్రహణం  అని వ్యాఖ్యానించడమే కాకుండా, ఒక అధికారి తన కుమార్తె పెళ్లికి  రూ. 1000 కోట్లు కట్నం ఇస్తానని అన్నారంటూ చేసిన ఆరోపణలు ఐఏఎస్ వర్గాలను తీవ్ర అసహనానికి గురి చేశాయి. ఈ వ్యాఖ్యలపై ప్రభుత్వం నుండి కనీస ఖండన లేకపోవడం, తమ పక్షాన ఎవరూ నిలబడకపోవడంతో ఐఏఎస్ అధికారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.

సీనియర్ ఐఏఎస్‌ల రహస్య సమావేశం ? 

కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఒక రహస్య సమావేశాన్ని నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది. మీడియా డిస్కషన్లలో తమను దొంగలుగా చిత్రీకరిస్తున్నా ప్రభుత్వం మౌనం వహించడంపై వారు చర్చించారు. రాజకీయ నాయకులు చేసే పనులకు ఐఏఎస్ అధికారులు బలిపశువులు అవుతున్నారు.. కానీ విమర్శలు వచ్చినప్పుడు మాత్రం ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు  అనే అభిప్రాయం ఐఏఎస్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి వారు ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

పనితీరులో మార్పు ? 
 
ఇకపై ఏ ఫైల్ వచ్చినా దానిని గుడ్డిగా సంతకం చేయకూడదని, ముఖ్యంగా వివాదాస్పదమైన లేదా ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించిన ఫైల్స్ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఐఏఎస్ అధికారులు తీర్మానించుకున్నట్లు తెలుస్తోంది. ఏదైనా ఫైల్‌పై అనుమానం ఉంటే లేదా అది నిబంధనలకు విరుద్ధంగా అనిపిస్తే.. నేరుగా ఆమోదించకుండా  విల్ చెక్ అని రాసి పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనివల్ల ఆ ఫైల్ ప్రక్రియ నిలిచిపోవడమే కాకుండా, భవిష్యత్తులో ఏదైనా విచారణ జరిగితే తమకు రక్షణగా ఉంటుందని వారు భావిస్తున్నారు. ఏ స్థాయి నాయకులు లేదా మంత్రులు ఒత్తిడి తెచ్చినా సరే, చట్టబద్ధత లేని ఫైళ్లపై సంతకాలు పెట్టే ప్రసక్తే లేదని ఐఏఎస్ అధికారులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనుల వల్ల ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని, ఇప్పుడు కూడా అదే పునరావృతం కాకూడదని వారు కృతనిశ్చయంతో ఉన్నారు. 

ఈ పెన్ డౌన్ తరహా నిరసన వల్ల రాష్ట్ర పాలనలో వేగం తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వం మరియు బ్యూరోక్రసీ మధ్య ఏర్పడిన ఈ అగాధం సత్వరమే పూడకపోతే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశిస్తున్న  స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్', ప్రజా పాలన కు విఘాతం కలిగే ప్రమాదం ఉంది. మరి ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగుతారో లేదో వేచి చూడాలి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu and Amit Shah: అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
Advertisement

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandra Babu and Amit Shah: అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
Embed widget