అన్వేషించండి

Kavitha politics: కవిత పార్టీతో బీఆర్ఎస్‌కు అంత ఈజీ కాదు - ఎలా రాజకీయం చేసినా సమస్యలే - ఏం చేయబోతున్నారు?

Kavitha Party: తెలంగాణ రాజకీయాల్లో కవిత కొత్త పార్టీని ప్రకటించడం కేవలం ఒక రాజకీయ పరిణామం మాత్రమే కాదు, ఇది బీఆర్ఎస్ పార్టీలో ముదిరిన సంక్షోభానికి పరాకాష్ట. ఈ పరిణామాల్ని ఎదుర్కోవడం అంత తేలిక కాదు.

Kavitha Party Brs Problems:  దశాబ్దాల పాటు తెలంగాణ రాజకీయాలను శాసించిన కేసీఆర్ కుటుంబం ఇప్పుడు నిలువునా చీలిపోయింది. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ సాక్షిగా కవిత తన తండ్రి స్థాపించిన పాత పేరును తలపించేలా  టీఆర్ఎస్  పార్టీని ప్రకటించడం బీఆర్ఎస్‌కు అతిపెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా తన సస్పెన్షన్‌కు కారణమైన హరీష్ రావు, సంతోష్ రావులపై ఆమె బహిరంగంగానే యుద్ధం ప్రకటించడం, కేసీఆర్ రిని కొందరు వ్యక్తులు బందీగా చేసుకున్నారని ఆరోపించడం పార్టీలో ముదిరిన అంతర్గత విభేదాలను అద్దం పడుతోంది. ఇప్పుడు కవితను అడ్డుకుంటే ఆమెకు సానుభూతి పెరుగుతుందని, పట్టించుకోకపోతే పార్టీ ఖాళీ అవుతుందని బీఆర్ఎస్ ఆందోళన చెందుతోంది.

 వారసత్వ పోరాటమా.. అస్తిత్వ పోరాటమా? 

కవిత తన పార్టీకి  తెలంగాణ రాష్ట్ర సేన  అని పేరు పెట్టడం వెనుక బలమైన వ్యూహం ఉంది. కేసీఆర్  బీఆర్ఎస్‌గా పేరు మార్చడం ద్వారా తెలంగాణ ఆత్మను కోల్పోయారని, తాను తిరిగి ఆ మూలాలను తెస్తానని ఆమె వాదిస్తున్నారు. దీనివల్ల బీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్ అనే పోరు మొదలైతే, ఇది కేవలం ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వారసుల మధ్య తగాదాగా మారిపోయే ప్రమాదం ఉంది.   కుటుంబ వివాదాలే చర్చనీయాంశమైతే రెండు పార్టీలూ ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయే అవకాశం ఉంది.
 
నేతల వలసలు - బీఆర్ఎస్‌కు కొత్త తలనొప్పి 

ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ వరుస ఓటములతో సతమతమవుతోంది. ఇదే సమయంలో కవిత కొత్త పార్టీ పెట్టడం వల్ల, అసంతృప్త నేతలకు ఆమె ఒక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నారు. బీఆర్ఎస్‌లో తగిన ప్రాధాన్యత దక్కని వారు, ముఖ్యంగా హరీష్ రావు ,  కేటీఆర్ నాయకత్వాన్ని ఇష్టపడని వారు కవిత వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ ఆమెపై దూకుడుగా వెళ్తే, ఆమె దానిని  మహిళా నేతపై దాడి గా చిత్రీకరించి మరింత మైలేజ్ పొందే ప్రయత్నం చేస్తారు. అలాగని మౌనంగా ఉంటే, కవిత తన కేడర్‌ను చీల్చుకుపోతారనే భయం గులాబీ బాసులను వేధిస్తోంది.

బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు  ముందు నుయ్యి - వెనుక గొయ్యి 

సాధారణంగా కేసీఆర్   పట్ల అపారమైన గౌరవం చూపే కవిత, ఒక్కసారిగా తండ్రి నిర్ణయాలను ప్రశ్నించడం వెనుక లోతైన కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. మద్యం కేసులో తను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పార్టీ అండగా నిలబడలేదని, పైగా కుటుంబంలోని కొందరు సభ్యులే తనను కావాలని ఇరికించారని ఆమె బలంగా నమ్ముతున్నట్లు ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది. కేసీఆర్   కేటీఆర్‌ను తన వారసుడిగా ఖరారు చేయడం కూడా కవిత అసంతృప్తికి మరో కారణం కావచ్చని సమాచారం. ఈ వారసత్వ పోరు ఇప్పుడు తెలంగాణ నడిబొడ్డున కొత్త పార్టీ రూపంలో ప్రత్యక్షమైంది. బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు  ముందు నుయ్యి - వెనుక గొయ్యి అన్నట్లుగా ఉంది పరిస్థితి. కవిత పార్టీని గుర్తిస్తే తమ ఉనికికే ప్రమాదమని, విమర్శిస్తే కుటుంబ గొడవలు రచ్చకెక్కుతాయని ఆ పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. టీఆర్ఎస్ అనే బ్రాండ్ ఇమేజ్‌ను కవిత దక్కించుకోవడమే ఆమెకు పెద్ద విజయం కాగా, దానిని ఎలా అడ్డుకోవాలో తెలియక బీఆర్ఎస్ నాయకత్వం సతమతమవుతోంది. రానున్న రోజుల్లో ఈ  వారసత్వ యుద్ధం  తెలంగాణ రాజకీయాలను ఎటువైపు తీసుకెళ్తుందో వేచి చూడాలి. 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Traffic Chaos: ఐటీ రాజధానిలో ట్రాఫిక్ నరకం - కేబీఆర్ వన్-వే, గచ్చిబౌలి గుంతల రోడ్లు - అలవాటు చేసుకోవాల్సిందేనా?
ఐటీ రాజధానిలో ట్రాఫిక్ నరకం - కేబీఆర్ వన్-వే, గచ్చిబౌలి గుంతల రోడ్లు - అలవాటు చేసుకోవాల్సిందేనా?
BJP Grassroots Leadership: వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?
స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Embed widget