TS BJP Plan : సైలెంట్‌గా బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగులు - లైట్ తీసుకున్నారా ? చాపకింద నీరులా విస్తరిస్తున్నారా?
తెలంగాణ బీజేపీ చేపట్టిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు ఎలా జరుగుతున్నాయి ?నేతలు సీరియస్‌గా తీసుకోలేదా ?సీనియర్లు నిర్లక్ష్యం చేస్తున్నారా ?హైకమాండ్ ఏం చేయబోతోంది ?
TS BJP Plan : తెలంగాణలో అధికారం దక్కించుకోవడానికి బీజేపీ యూపీ వ్యూహాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా మొదట స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు పెడుతున్నారు. ప్రతీ వీధిలో... ప్రతీ గ్రామంలోనూ మీటింగ్ పెట్టాలనుకుంటున్నారు. ఇందు కోసం అందరూ రంగంలోకి దిగారు. అయితే ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు ఎలా జరుగుతున్నాయన్నదానిపై ఏ ఒక్క తెలంగాణ బీజేపీ నేత గొప్పగా చెప్పుకోలేకపోతున్నారు. బీజేపీ హైకమాండ్ కూడా ఈ అంశంపై సొంతంగా ఆరా తీస్తోంది. తెలంగాణలో నేతల పనితీరుపై అంచనా వేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లపై బీజేపీ ద్వితీయ శ్రేణి నేతలకు దిశానిర్దేశం లేదా ?
ప్రజా గోస, బీజేపీ భరోసా పేరుతో స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లను బీజేపీ నిర్వహిస్తోంది. విస్తృతంగా ప్రజల ముందుకు వెళ్తోంది. ఇప్పటికే పది రోజులుగా 5వేల సమావేశాలు ఏర్పాటు- చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకులు మొత్తంగా ఇదే కార్యక్రమంలో బిజీబిజీగా ఉన్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా రాష్ట్ర నాయకత్వానికి బీజేపీ జాతీయ అగ్ర నేతలు 15 రోజుల్లో 11వేల సమావేశాలు నిర్వహిం చాలని టార్గెట్ పెట్టారు. ఈ సమావేశాల్లో రాష్ట్రంలో ముఖ్య నేతలతో పాటు- మండల స్థాయి నేతల వరకు పాల్గొనాలని ఆదేశించారు. సమావేశాల్లో పొల్గొనే నేతల కు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు కూడా నిర్వహించారు. తీరా పది రోజులుగా సమావేశాలు జరుగుతున్నా కొంతమంది నేతలు బయటకు రావ డంలేదు. కొంతమంది నాయకులు తమకు ఇచ్చిన కార్యాచరణను పట్టించుకోవడం లేదు. దీంతో ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు తేలిపోతున్నాయన్న ప్రచారం జరుగుతోంది.
పార్టీ నేతల పనితీరుపై హైకమాండ్ ప్రత్యేక దృష్టి !
బీజేపీ జాతీయ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తల పెట్టిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు.. వాటిపై నేతలు చూపిస్తున్న శ్రద్ధపై హైకమాండ్ ప్రత్యేకంగా సమాచారం సేకరిస్తున్నట్లుగా బీజేపీలో ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగు తున్న ఈ సమా వేశాల్లో పాల్గొంటు-న్న నేతలెవరు? వారి సమా వేశాలకు ప్రజల నుండి వస్తున్న స్పందన ఏంటీ-? అన్న వివరాలను సేకరిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పా టు చేసిందనిచెబుతున్నారు. సమావేశాల నిర్వ హణ కోసం ఎంపిక చేసిన 700 మందికి పైగా నేతలు నిత్యం ఎక్క డక్కడికి వెళ్తున్నారు? వారి పనితీరు ఎలా ఉందో ఆరా తీస్తున్నారు.
టిక్కెట్ ఆశిస్తున్న నేతలు కూడా పైపైన సమావేశాలకే ప్రాధాన్యం !
బీజేపీలో టిక్కెట్లు ఆశిస్తున్న నేతలు కూడా పైపై సమావేశాలకే ప్రాధాన్యం ఇస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తమపై జాతీయ నాయకత్వాని బ్యాడ్ ఇంప్రెషన్ వెళ్తే అసలుకే మోసం వస్తుందని భావిస్తున్న బీజేపీ నేతలు తమదైన శైలిలో అప్రమత్తం అవుతున్నారు. ఢిల్లీ స్థాయి నుండి వస్తున్న సమాచారంతో తమ పనితీరు మెరుగుపరు చుకునే పనిలో పడ్డారు. తమపై నెగిటివ్ రిమార్క్ రాకుండా ఉండేందుకు ఏం చేయాలన్న దానిపై కూడా వారంతా కసరత్తు చేస్తున్నారు.
స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌ల తర్వాత సంస్థాగత మార్పులు జరుగుతాయా ?
యూపీ వ్యహం ప్రకారం స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు అత్యంత కీలకం., రాష్ట్రంలో ఏ మూలన చూసినా బీజేపీ పేరు వినిపించేలా కార్య క్రమాలు రూపొందించి అమలు చేయాలని అనుకున్నారు. ఇవి ముగిిన తర్వాత హైకమాండ్ సమీక్ష సంస్థాగత మార్పులు కూడా చేసే అవకాశం ఉందన్న ప్రచారం తెలంగాణ బీజేపీలో జరుగుతోంది.