Hindupuram YSRCP : మూడేళ్లయినా చిన్న పని కూడా చేయరా ? సొంత పార్టీపై హిందూపురం మున్సిపల్ కౌన్సిలర్ల ఆగ్రహం చూశారా ?
అభివృద్ధి జరగలేదని హిందూపురం వైఎస్ఆర్‌సీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు.
Hindupuram YSRCP : హిందూపురంలో వైఎస్ఆర్‌సీపీ నేతలు అంతర్గత పోరాటంలో రాజకీయ వేదిక లేదా ప్రభుత్వ వేదిక అనేది చూసుకోకుండా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తమ ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ బయట పెట్టుకుంటున్నారు. సోమవారం హిందూపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజతో పాటు ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా హాజయ్యారు. వైఎస్ఆర్‌సీసీ నియోజకవర్గ ఇంచార్జ్.. ఎమ్మెల్సీ ఇక్బాల్ విదేశాల్లో ఉండటంతో ఆయన హాజరు కాలేదు.
కోనసీమలో మరో 48 గంటలు ఇంటర్నెట్ బంద్, లాకప్ డెత్ పుకార్లు నమ్మొద్దని డీఐజీ సూచన
వైఎస్ఆర్‌సీపీ కౌన్సిలర్లు అందరూ ఎంపీ గోరంట్ల మాధవ్ పై వ్యతిరేకతతో ఉన్నారు. వారంతా ఇతర గ్రూపులకు చెందినవారు. దాంతో సమావేశంలో అధికార పార్టీ కౌన్సిలర్లు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు గడుస్తున్నా హిందూపురం మున్సిపాలిటీ లో ఏరియాలో డ్రైనేజీలు లైటింగ్ రోడ్లు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని అధికార పార్టీ మహిళా కౌన్సిలర్లు నేరుగా నిలదీశారు. సమస్యల పైన ప్రజల సమస్యలు పరిష్కరించి నప్పుడు కౌన్సిలర్ ఎందుకు కమిషనర్ ఎందుకు అంటూ ఓ వైసిపి కౌన్సిలర్ ఆగ్రహం వ్యక్తం చశారు.
యూపీఎస్సీ సివిల్స్ మెరిసిన తెలుగు తేజాలు, అంగన్వాడీ కార్యకర్త కుమారుడికి ఆలిండియా ర్యాంక్
కౌన్సిల్ సమావేశంలో అధికార పార్టీ అంతర్గత రాజకీయాల ప్రభావం ఎక్కువగా కనిపించింది. కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇంద్రజ, ఎంపీ గోరంట్ల మాధవ్ చేసేదిలేక మామ అనిపించి సమావేశాన్ని ముగించారు. హిందూపురం వైఎస్ఆర్‌సీపీకి మాజీ సమన్వయకర్తలు నవీన్ నిశ్చల్, అబ్దుల్ గని, కొండూరు వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు. వీరిలో ఒకరంటే ఒకరికి పడదు. ఇప్పుడు ఇక్బాల్... తమ ముగ్గురిలో ఎవరినీ కాదని మళ్లీ ఎంపీని తెచ్చి పెట్టడంతో ముగ్గురు నేతలూ విభేదాలు పక్కన పెట్టి ఇప్పుడు ఏకతాటి పైకి వచ్చారు. కౌన్సిలర్లు అందరూ వీరి వర్గానికి చెందిన వారు కావడంతో గోరంట్ల మాధవ్‌పై వారు విరుచుకుపడుతున్నారు.
తిరుపతి నుంచి పవన్ కల్యాణ్ పోటీ - రెడీ అంటున్న క్యాడర్ !
ఎమ్మెల్సీ ఇక్బాల్ మాజీ పోలీస్ అధికారి.. ఎంపీ మాధవ్ కూడా సీఐగా పని చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పోలీసు బాసులు మాకు వద్దు.. ఇన్చార్జిలుగా మా హిందూ పురానికి చెందిన స్థానికులకే అవకాశం ఇవ్వాలంటూ ఇప్పటికే ఆందోళనలు కూడా చేస్తున్నారు.