అన్వేషించండి

Vizag MLC Election TDP : ఖచ్చితంగా గెలిచేలా ఉంటేనే పోటీ - వైజాగ్ ఎమ్మెల్సీ ఎన్నికపై టీడీపీ పునరాలోచనలో పడిందా ?

Andhra Pradesh : విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై టీడీపీ పునరాలోచనలో పడింది. బలాబలాలను పూర్తిగా అంచనా వేసుకుని గెలిచేలా ఉంటేనే పోటీ చేయాలని అనుకుంటున్నారు.

Visakha local bodies MLC elections :  విశాఖ  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో తెలుగుదేశం పార్టీ ఇంకా పూర్తి స్థాయిలో తేల్చుకోలేకపోయింది. విశాఖకు చెందిన టీడీపీ నేతలు పోటీకి రెడీగా ఉన్నారు. అభ్యర్థిగా పీలా గోవింద్ సత్యనారాయణ పేరును ఫైనల్ చేసుకున్నారు.  అన్ని వివరాలతో చంద్రబాబు వద్దకు వెళ్లారు. కానీ చంద్రబాబు మాత్రం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఖచ్చితంగా గెలిచేలా ఉంటేనే పోటీ చేద్దామని.. ఎంత మంది ఓటర్లు ఉన్నారు.. ఎవరికి ఓటేస్తారు..సహా మొత్తం సమగ్ర వివరాలతో రావాలన్నారు. ఇంకా ఉమ్మడి విశాఖ జిల్లాలో  రెండు, మూడు నియోజకవర్గాల నుంచి స్పష్టత రావాల్సి ఉండటంతో నిర్ణయాన్ని వాయిదా వేశారు. 

చంద్రబాబుతో సమావేశం అయిన విశాఖ జిల్లా నేతలు

ఉమ్మడి విశాఖ జిల్లా నేతలు ఎమ్మెల్సీ ఎన్నిక అంశంపై చర్చించేందుకు చంద్రబాబుతో శుక్రవారం సాయంత్రం సమావేశం అయ్యారు. దాదాపుగా అరగంట పాటు జరిగిన సమావేశంలో ఖచ్చితంగా పోటీ చేయాలన్న నిర్ణయానికి రాలేకపోయారు. తన వద్దకు వచ్చిన నివేదికలతో చంద్రబాబు పార్టీ నేతలు చెబుతున్న అంశాలను పోల్చి చూసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో తెలుగుదేశం పోటీ చేయనందున ఓటర్లు తక్కువగా ఉన్నారు. వైసీపీ తరపున అత్యధిక మంది గెలిచారు.  వారిలో ఎంత మంది ఇప్పుడు కూటమి అభ్యర్థికి మద్దతుగా నిలుస్తారన్నదానిపై స్పష్టమైన నివేదికను చంద్రబాబు కోరారు. కొన్ని నియోజకవర్గాలపై ఇంకా స్పష్టత రాకపోవడంతో.. మరింత సమాచారం తెలుసుకుని పంపాలన్నారు. ఆ సమాచారంపై స్పష్టత వస్తే.. పోటీ చేయాలా వద్దా అనేది తెలుస్తారు.. ఒక వేళ పోటీ చేయాలని నిర్ణయిస్తే అభ్యర్థిని కూడా వెంటనే ప్రకటించే అవకాశం ఉంది. 

దువ్వాడ శీనుతోనే ఉంటా - మాది ఇల్లీగర్ ఎఫైర్ కాదు - మీడియా ముందుకు దివ్వల మాధురి

ముందు జాగ్రత్తగా క్యాంపులకు తరలించిన వైసీపీ 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ ఓటర్లను ముందుగానే క్యాంపులకు తరలించింది. ముఖ్యంగా అరకు, పాడేరు నియోజకవర్గాల ఓటర్లను క్యాంపులకు తరలించారు. నెలాఖరు వరకూ వారిని క్యాంపుల్లో ఉంచి నేరుగా ఓటింగ్ కు తీసుకు రావాలని  నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికను జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. టీడీపీ పోటీ పెడుతుందని గట్టిగా నమ్ముతున్న ఆయన అత్యంత సీనియర్ అయితేనే పోటీని తట్టుకోగలరని బొత్స సత్యనారాయణను ప్రకటించారు. అన్నీ తాను చూసుకుంటానని ఖర్చుల గురించి  ఆలోచించవద్దని జగన్ చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో బొత్స కూడా పోటీ చేసేందుకు అంగీకరించారు. ఇప్పుడు జగన్ మూడు రోజుల పాటు నియోజకవర్గాల వారీగా పార్టీ ఓటర్లను పిలించుకుని వారిని బుజ్జగించి మంచి మాటలు చెప్పి.. ప్రలోభాలకు లొంగవద్దని చెప్పి క్యాంపులకు పంపించారు. ఇప్పుడు టీడీపీ నేతలు వారితో సంప్రదింపులు జరపడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. 

గెలిచి చూపిస్తామంటున్న టీడీపీ నేతలు

అయితే టీడీపీ నేతలు మాత్రం.. విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఏం జరిగిందో చూశామని అంటున్నారు. వైసీపీ ఓటర్లు .. జగన్ తో భేటీకి వెళ్లినా ఆ పార్టీకి ఓటు వేయలేదని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనూ అదే జరుగుతుందని అంటున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు అందరూ కూటమి నేతలేనని.. అలాగే ప్రభుత్వం కూడా చేతిలో ఉన్నందున.. వైసీపీ క్యాంపులకు వెళ్లిన ఓటర్లు కూడా చివరికి ఓటు దగ్గరకు వచ్చే సరికి కూటమికే వేస్తారని అంటున్నారు. ఈ మేరకు తాము ఏర్పాట్లు చేసుకుంటామంటున్నారు. ఈ విషయంలో చంద్రబాబు సంతృప్తి చెందితే.. ఎప్పుడైనా అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది. 

ఈ హత్యల్లో చంద్రబాబు, లోకేష్‌ను ముద్దాయిలుగా చేర్చాలి, మేం హైకోర్టుకు వెళ్తాం - జగన్

పోటీ జరిగితే ఓడిపోయే పార్టీకి ఇబ్బందే ! 

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ జరిగితే.. రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారుతుంది. ఓడిపోయే పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. పూర్తి  బలమున్నా అభ్యర్తి ఓడిపోతే వైసీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. గ్రౌండ్ లెవల్లో పార్టీ పై పట్టును కోల్పోయినట్లు అవుతుంది. టీడీపీ ఓడిపోతే బలం లేకపోయినా పోటీ చేశారని.. అధికార బలం ఉన్నా..కావాల్సిన ఓట్లను మేనేజ్ చేసుకోవడం చేత కాలేదన్న విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే పోటీ చేస్తే గెలిచి తీరాలన్న టార్గెట్ తో ఉన్నారు. అందుకే.. నిర్ణయం ఏ క్షణమైనా వెల్లడించే అవకాశం ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nitish Family Photo With Kohli: కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 67 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 67 మంది మృతి- సంఖ్య పెరిగే అవకాశం
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
Telangana Income: కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitish Family Photo With Kohli: కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 67 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 67 మంది మృతి- సంఖ్య పెరిగే అవకాశం
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
Telangana Income: కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
Venkatesh: వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
Pakistan Afghanistan War: తాలిబన్ల చేతిలో చావు దెబ్బ తింటున్న పాకిస్తాన్ -  భారత్ పని సులువైనట్లే !
తాలిబన్ల చేతిలో చావు దెబ్బ తింటున్న పాకిస్తాన్ - భారత్ పని సులువైనట్లే !
World Rapid Chess Champion: ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత
ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత
Embed widget