(Source: ECI/ABP News/ABP Majha)
Kuppam YSRCP Leader Dead : పార్థసారధి మృతదేహాన్ని వైఎస్ఆర్‌సీపీకే దానం ఇస్తున్నామన్న కుటుంబసభ్యులు - కుప్పంలో టెన్షన్ టెన్షన్ !
కుప్పంలో ఆత్మహత్య చేసుకున్న వైఎస్ఆర్‌సీపీ నేత మృతదేహాన్నిపార్టీకే దానం ఇస్తున్నామని కుటుంబసభ్యులు ప్రకటించారు. పార్థసారధి కుటుంబానికి న్యాయం చేయాలని వాల్మీకి కుల సంఘాలు పెద్ద ఎత్తున తరలి రావడంతో కుప్పంలో ఉద్రిక్తత ఏర్పడింది.
కుప్పం వైఎస్ఆర్‌సీపీ నేత పార్థసారధి ఆత్మహత్య ( YSRCP Leader Suiside ) ఘటన సంచలనాత్మకం అవుతోంది. పార్టీ కోసం కష్టపడినా డబ్బులు తీసుకుని గంగమ్మగుడి చైర్మన్ పదవి ఇచ్చారని.. ఇప్పుడు జాతర నిర్వహించే అవకాశం కూడా ఇవ్వకుండా పదవి నుంచి తీసేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్న పార్థసారధి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. పార్థసారధి చాలా కాలంగా వైఎస్ఆర్‌సీపీకి పని చేస్తున్నారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గంగమ్మ గుడి చైర్మన్ పదవి ( Temple Chairman ) ఇచ్చారు. మూడు సార్లు వార్డు మెంబర్‌గా కూడా గెలిచారు. అయితే ఇటీవల ఆయనను పదవి నుంచి తప్పించారు. పార్టీ కోసం పని చేసినా.. పదవి కోసం డబ్బులు ఇచ్చారన్న ఆవేదనతో ఆయన సెల్ఫీ సూసైట్ నోట్ ను వీడియో రూపంలో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
మంత్రివర్గ విస్తరణలో ట్విస్ట్- వాళ్లకు మళ్లీ ఛాన్స్ ఇస్తున్న జగన్!
కుటుంబసభ్యులు పార్థసారధి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరణంపై తమకు అనుమానాలున్నాయని విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. పార్థసారధి మృతదేహాన్ని వైఎస్ఆర్‌సీపీకే దానం చేస్తున్నామని.. తమకు అక్కర్లేదని వారు ప్రకటించారు. దీంతో కుప్పంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పార్థసారధి మృతికి వైఎస్ఆర్‌సీపీ నేతలే కారణమన్న ఆరోపణలు రావడంతో పెద్ద ఎత్తున ఆయన ఇంటి వద్దకు బోయ సామాజికవర్గ నేతలు తరలి వచ్చారు. పార్థసారధి బోయ సామాజికవర్గానికి చెందిన వారు. ఆయనను రాజకీయం ఎదగనీయకుండా ఆర్థికంగా ఇబ్బంది పెట్టారన్న విమర్శలు రావడంతో ఆ సామాజికవర్గానికి చెందిన వారు తరలివచ్చారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. కుప్పంలో ( Kuppam ) పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరించారు.
శ్రీరామనవమి నాడు విచిత్రమైన పరిస్థితి - మంత్రులు లేని సీఎంగా వైఎస్ జగన్
వైసీపీ నేత పార్థసారధి ఆత్మహత్యకు కారణమైన వారిని వెంటనే అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయాలని వాల్మీకి కుల సంఘ ( Valmiki Leaders ) నేతలు కుప్పంకు భారీగా తరలివచ్చి ఆందోళన చేస్తున్నారు. ఈ విషయంపై చిత్తూరు జిల్లా వైఎస్ఆర్‌సీపీ నేతలు ఎవరూ నోరు మెదపడం లేదు. కుప్పం బాధ్యతల్ని వైఎస్ఆర్‌సీపీ తరపున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూస్తున్నారు. పార్టీ నేతలు డబ్బులు తీసుకుని పదవి ఇచ్చారని ఆరోపించి ఆత్మహత్య చేసుకున్నా... పెద్దిరెడ్డి కూడా ఇంత వరకూ స్పందించలేదు. మృతదేహాన్ని తీసుకుని అంత్యక్రియలు నిర్వహించాలని పార్థసారధి కుటుంబీకుల్ని పోలీసులు కోరుతున్నట్లు సమాచారం.